టిక్‌టాక్ వినోదమా? విషాదమా?

ఇప్పుడంతా ఆన్‌లైన్ యాప్స్ హవా నడుస్తోంది. ఉదయం లేవనంత, రాత్రి పడుకోనివ్వనంతగా చిన్నా పెద్దా అంతా ఆన్‌లైన్‌లోనే గడిపేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో చక్కగా నచ్చిన యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం.. వీడియోలు, ఫొటోలు, సెల్ఫీలు దిగడం.. తరువాత వాటిని ఇతరులకు షేర్ చేసేస్తూ గడిపేస్తున్నారు. ఒకవైపు ఆన్‌లైన్ గేమ్స్ పబ్‌జి లాంటివి యువతను మాయలో పడేస్తుంటే… టిక్‌టాక్ లాంటి యాప్‌లు చిన్నాపెద్దలకు క్రేజీగా తయారయ్యాయి. ఏది కావాలన్నా సెల్‌ఫోన్ మీద ఆధారపడే స్థాయికి చేరుకున్నాం. మాటల స్థాయి నుంచి పాటలకు, […] The post టిక్‌టాక్ వినోదమా? విషాదమా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఇప్పుడంతా ఆన్‌లైన్ యాప్స్ హవా నడుస్తోంది. ఉదయం లేవనంత, రాత్రి పడుకోనివ్వనంతగా చిన్నా పెద్దా అంతా ఆన్‌లైన్‌లోనే గడిపేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో చక్కగా నచ్చిన యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం.. వీడియోలు, ఫొటోలు, సెల్ఫీలు దిగడం.. తరువాత వాటిని ఇతరులకు షేర్ చేసేస్తూ గడిపేస్తున్నారు. ఒకవైపు ఆన్‌లైన్ గేమ్స్ పబ్‌జి లాంటివి యువతను మాయలో పడేస్తుంటే… టిక్‌టాక్ లాంటి యాప్‌లు చిన్నాపెద్దలకు క్రేజీగా తయారయ్యాయి. ఏది కావాలన్నా సెల్‌ఫోన్ మీద ఆధారపడే స్థాయికి చేరుకున్నాం. మాటల స్థాయి నుంచి పాటలకు, పాటల స్థాయి నుంచి ఆటలకు కూడా దానిమీదే ఆధారపడుతున్నాం. వినోదం ఎప్పుడూ ఆనందాన్నివ్వాలి. కానీ ఒక్కోసారి (ఈమధ్య చాలా సార్లు) అది హద్దు దాటి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. వినోదం కాస్తా విషాదంగా మిగులుతుంది.

మనకున్న టాలెంట్‌ను అందరితో పంచుకోవాలనుకోవడం సహజం. ఒకప్పుడు ఇది కష్టమైన పని. కానీ స్మార్ట్‌ఫోన్ చేతిలోకొచ్చాక ఏపనైనా సాధ్యమే. తమకున్న ప్రతిభను ప్రదర్శించడానికి యాప్స్‌ను చక్కగా ఉపయోగించుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్ వాడే వారిలో వందకు తొంభై మంది ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్‌ను వాడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అలాంటివాటిల్లో ‘మోస్ట్ ఎంటర్‌టైనింగ్ యాప్’ టిక్‌టాక్. ఈ యాప్‌కి మనదేశంలోనే 20 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇంతగా అందరినీ మోజులో ముంచెత్తుతున్న ఈ యాప్‌ని చైనా కంపెనీ తయారు చేసింది. అంతకుముందు 2014లో వచ్చిన డబ్స్‌స్మాష్ యాప్ ద్వారా సినిమాల్లోని డైలాగ్స్‌లను ఇమిటేట్ చేస్తూ నటిస్తారు. దీన్ని డామినేట్ చేస్తూ టిక్‌టాక్ వచ్చింది.

మన దేశంలో టిక్‌టాక్ యూజర్లు పన్నెండు కోట్ల మంది. యావరేజ్‌గా ఒక యూజర్ టిక్‌టాక్ వీడి యో చేస్తే 67 మంది యూజర్లు ఆ వీడియోను కేవ లం చూసున్నారట. టిక్ టాక్ (Tik Tok) మోస్ట్ పాపులర్ మొబైల్ యాప్. ఈ వీడియో యాప్‌ను చైనా బైట్‌డ్యాన్స్ కంపెనీ రూపొందించింది. 2018 లో అత్యధికంగా ఆండ్రాయిడ్, ఆపిల్ డివైజ్ లలో డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్‌లో ఇదొకటి. ఇండియాలో పెద్దసంఖ్యలో టిక్‌టాక్ యాప్‌ను వాడుతున్నారు. అందులో తమిళనాడు అయితే చెప్పనక్కర్లే దు. టిక్‌టాక్ యాప్‌లో షార్ట్ సాంగ్, వీడియోలను షేర్ చేసుకోవచ్చు. దీని పిచ్చిలో పడిన యువత.. గంటలకొద్దీ వీడియోలు, సాంగ్ షేరింగ్ చేస్తూ హద్దులు లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ పెద్ద ఎత్తు న విమర్శలున్నాయి. అసభ్యకరమైన కంటెంట్‌ను షేర్ చేయడం వల్ల.. చిన్నారులు, యువతను తప్పు దోవ పట్టిస్తోందని పెద్దలు వాపోతున్నారు.

బైట్ డ్యాన్స్

టిక్‌టాక్ హవా కొనసాగుతుండగానే బైట్‌డ్యాన్స్ నుంచి మరో ఎంటర్‌టైన్ యాప్ వచ్చింది. ఫ్లిప్‌చాట్ (ఫెయ్‌లియావో) యాప్‌ను విడుదల చేసింది. ఇదొక ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. అలవాట్లు, అభిరుచులు, ఇష్టాలు, ఆసక్తులు ఒకేలా ఉన్నవాళ్లంతా ఒక గ్రూప్‌గా చేరి ఈ యాప్‌లో చాట్ చేసుకోవచ్చు. చైనాలో ఇప్పటికే రిలీజ్ అయిన ఫ్లిప్‌చాట్ హోం మార్కెట్‌లో హవా చాటుతోంది. త్వరలోనే దీన్ని మిగతా దేశాల్లోనూ విడుదల చేయనున్నారు. అయితే టిక్‌టాక్ ద్వారా షార్ట్ వీడియో షేరింగ్ యాప్ లాసో మార్కెట్ ఏవిధంగా దెబ్బతీసిందో ఇప్పుడు ఫిప్‌చాట్ ద్వారా స్నాప్‌చాట్‌కి చెక్ పెట్టేందుకు బైట్‌డ్యాన్స్ ప్రయత్నిస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

టిక్‌టాక్ నేపథ్యం

2015 సెప్టెంబర్ 14న చైనా విడుదల చేసిందీయాప్‌ని. 2018లో ఈ అప్లికేషన్‌కి ప్ర జాదరణ ఎక్కువ గా వచ్చిం ది. అక్టోబర్ 2018 లో US లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌లో ఒకటిగా టిక్‌టాక్ నిలిచింది. 2018 నాటికి 75 భాషల్లో అందుబాటులో ఉంది. 2018 జూలైలో ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. ప్రతి రోజూ 1 బిలియన్ వీడియోలను వీక్షిస్తారు. చైనాలో డౌయిన్‌గా దీన్ని పిలుస్తారు. డౌయిన్ అంతర్జాతీయ మార్కెట్ టిక్‌టాక్ గా పేరుపొందింది. ఇది సెప్టెంబర్ 2017 లో ఇతర దేశాలకు విస్తరించడం ప్రారంభమైంది. 15- సెకనుల వీడియోని టిక్‌టాక్ ద్వారా ఇతరులకు పంచుకోవచ్చు. ఇది ఆపిల్ యాప్ స్టోర్లో ప్రపంచంలోని అత్యంత డౌన్లోడ్ చేసి న యాప్. అదే సమయంలో PUBG మొబైల్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రికార్డ్ చేసిన డౌన్‌లోడ్‌ను అధిగమించింది.

వ్యసనంగా మారడంతో ప్రమాదం

ఏదైనా అతిగా ఉపయోగించకుండా, ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించుకుంటే ఎటువంటి ప్రమాదాలు, అనర్థాలు జర గవు. కానీ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, కొంత మంది వినియోగదా రు లు ఇటు వంటి వినోదాత్మక మైన యా ప్‌లను వేలంవెర్రిగా ఉప యోగించుకుంటున్నారు. దీంతో వీటిని నిషేధించ మంటూ కొన్ని దేశాలు పట్టుబట్టాయి కూడా.
*ఇండోనేషియా ప్రభుత్వం ‘అశ్లీలత, అనుచితమైన కంటెంట్, దైవదూషణ’లాంటివి టిక్‌టాక్ ద్వారా ప్రచారం అవుతున్నాయంటూ జూలై 3, 2018న టిక్‌టాక్ యాప్‌పై నిషేధం విధించింది. ఈ యాప్‌లోని కంటెంట్‌ను సెన్సార్ చేయడంతో 11 జూలై 2018 న నిషేధాన్ని ఎత్తివేసింది.

* 2018 నవంబర్‌లో, బంగ్లాదేశ్ ప్రభుత్వం టిక్‌టాక్ యాప్ ఇంటర్నెట్ యాక్సెస్‌ను బ్లాక్ చేసింది.
* టిక్‌టాక్ యాప్‌పై మద్రాస్ హైకోర్ట్ నిషేధం విధించింది. పోర్నోగ్రఫీని ప్రోత్సహిస్తోందనే కారణంతో ఈ యాప్‌ను తప్పుపట్టింది. ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్స్‌కి తోడు, వీడియోలు కూ డా తేడాగానే ఉంటాయి. కానీ ఇది యూత్‌ని బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో సెన్సేషన్ అ య్యింది. ఈ యాప్‌తో మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతోందనీ, కుర్రాళ్లతోపాటూ… పెద్దవాళ్లు కూ డా గంటల తరబడి దీన్ని ఆపరేట్ చేస్తూ… బూతు పురాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారని తమిళనాడులో వివాదం చెలరేగింది. ఇలాంటి యాప్‌ని రద్దు చేయడమే మంచిదని ప్రభుత్వ పెద్దలు కూడా భావించారు. ప్రస్తుతం మళ్లీ ఈ యాప్ పైన నిషే ధం ఎత్తివేయడంతో తిరిగి యథావిధిగా వాడు తున్నారు.

టిక్‌టాక్ వీడియోను చూసిన యూజర్లు కామెంట్ చేయకమానరు. కానీ అవి ఇతరులను నొప్పించేవిగా ఉంటున్నాయని విశ్లేష కులు అంటున్నారు. ఇష్టం వచ్చినట్లు ట్రోలింగ్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీలను కించ బరుస్తూ ట్రోలింగ్ చేయడం ఫ్యాషన్‌గా మారింది. ఈ తరహావి టిక్‌టాక్‌లోనూ ఎక్కువయ్యాయి.
ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌లను వాడేటప్పుడు వినో దాన్ని మాత్రమే కోరుకుంటే బాగుంటుంది. లేకుంటే జీవితంలో విషాదమే మిగులుతుంది. ఎవరో మెచ్చుకుంటారనే భ్రమతో వింత వింత చర్యలు చేయొద్దంటూ యువతను హెచ్చరిస్తున్నారు నిపుణులు.

పబ్జీ అంటే “ప్లేయర్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్స్‌”. అతి తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ వచ్చిన ఆన్‌లైన్ గేమ్. ఒక రోజులో ౩౦మిలియన్ల ఆటగాళ్లు ఈ గేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్‌ను ఐర్‌లాంగ్‌కు చెందిన ‘బ్రెండాన్ గీనీ’ అనే వెబ్‌డిజైనర్ దీన్ని డెవలప్ చేశాడు. అతడు సోనీలో గేమ్ డెవలపర్‌గా పనిచేసేవాడు. అతనికి యాక్షన్ థ్రిల్లింగ్స్ అంటే ఇష్టం ఉండేది. సొంతంగా గేమ్ డెవలప్ చేయాలనే అలోచనతో జాపనీస్‌లోని “బ్యాటిల్ రాయల్‌” చిత్రం నుంచి ఇన్‌స్పైర్ అయి పబ్జీని డెవలప్ చేశాడు. ఆ చిత్రంలో ఓ కాలేజీలోని 42 మందిని ఓ ఐలాండ్‌లో వదిలేసి ఆహారం, ఆయుధాలు, మ్యాప్స్ ఇచ్చి ఆ మ్యాప్‌కు సంబంధించిన ఐలాండ్‌లో వదిలేస్తారు. అయితే వాళ్లు ఒకరినొకరు చంపుకుని చివరికి ఒకరే మిగలాలి. అలా మిగిలిన వారిని ఐలాండ్ నుంచి పంపిస్తారు. అయితే ‘గ్రీన్’కు ఇలాంటి గేమ్స్ ఇష్టం ఉన్నందువల్ల ఈ చిత్రంను ఇన్‌స్పైర్‌గా తీసుకున్నాడు.

మొదట ఈ గేమ్‌ను 2017 మార్చిలో మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎక్స్ బాక్స్ 1 అనే గేమింగ్‌లో కంజెన్సీలో లాంచ్ చేశారు. తర్వాత డిసెంబర్‌లో కంప్యూటర్ వర్షన్, ఇతర కంజెన్సీల్లోనూ లాంచ్ చేశారు. ఈ గేమ్‌కు వచ్చిన స్పందన చూసి 2018 ఫిబ్రవరి 9న మొబైల్ వెర్షన్‌లో కూడా లాంచ్ చేశారు. ఇది రిలీజ్ చేసినా కేవలం ఆరు నెలల్లోనే ప్లే స్టోర్‌లో ఎక్కువ డౌన్‌లోడ్ అయిన యాప్‌గా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకుంది.

అసలు ఎందుకు ఈ గేమ్‌కు ఇంత క్రేజ్ వచ్చిందంటే… దాంట్లో ఉన్న ఇంటెన్సిటి, గ్రాఫిక్స్ మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. మనమే అక్కడ ఉన్న అనుభూతి కలుగుతుంది. ముందుగా ఇంటర్నెట్ రేట్లు తగ్గడం, స్మార్ట్‌ఫోన్స్ వాడకం ఎక్కువవడం ముఖ్య కారణాలు. దీంట్లో గెలిచిన వారికి ‘విన్నర్ విన్నర్ చికెన డిన్నర్’ అనే గిఫ్ట్ మెసెజ్ వస్తుంది. దాని కోసమే మళ్ళీ మళ్ళీ ఆడుతున్నారు. ఆ ‘విన్నర్ విన్నర్ చికెన డిన్నర్’ అనేది గెలిచిన వారికి ఇస్తున్న మెసెజ్‌ని ఎందుకు తీసుకున్నారంటే ఫారన్ దేశాల్లో ఏవైనా బెట్టింగ్ కానీ, గేమ్స్‌లో కానీ గెలిచిన డబ్బుతో ఇంటికి వచ్చాక చికెన్ కొనుకుని తినేవారు అందుకే దీనికి ఆ పేరు తీసుకున్నారు.

సాధారణంగా ఇతరులకు హానికలిగించే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ స్వయంగా తొలగిస్తుంది. గూ గుల్ ప్రమాణాలకు తగినట్లుగా యాప్ ఉందని భావిస్తేనే దాన్ని అమోదిస్తుంది. ఐతే… కొన్ని యా ప్స్‌పైకి చెప్పేదొకటి, చేసేది మరొకటి. టిక్ టాక్ కూడా అలాంటిదేనన్న భావన వస్తోంది. టిక్ టాక్ యాప్ అనేది వినియోగదారులు 15 సెకన్ల షార్ట్ లూపింగ్ వీడియోలు, చిన్న మ్యూజిక్ వీడియోలను సృష్టించడానికి ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నా రు. దీంతో ఎటువంటి ఇబ్బంది లేదు. అశ్లీల తలాంటివి జోడిస్తేనే ప్రమాదం అంటునారు నిపుణులు.

మనమే అధికం

టిక్‌టాక్‌కు బానిసలైన వాళ్ళు ఒక్క భారత్‌లోనే 12 కోట్ల మంది ఉన్నట్టు ఈ మధ్య సర్వేలో తెలిసింది. అంటే టిక్‌టాక్ పిచ్చి బాగా ముదిరిపోయిందని.. టిక్‌టాక్ అంటే ఎగబడే వారు అధికమవుతున్నారని తాజా రిపోర్ట్ ద్వారా వెల్లడి అయ్యింది. దేశం లో నటనతో తమ నైపుణ్యాన్ని వెలిబుచ్చి, వీడియోలను టిక్‌టాక్‌లో పోస్టు చేసి, 12 కోట్ల మంది లైక్‌ల కోసం వేచి వుంటే, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారు చాలామందికి కౌన్సిలింగ్ కోసం రంగం సిద్ధంగా వుందని టాక్. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది ప్రజలు టిక్ టాక్‌ను ఉపయోగిస్తున్నారు. భారత్‌లో మాత్రం వీడియోలను పోస్టు చేసి లైకుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా 150 భాషల్లో అంటే భారత్‌లో 11 భాషల్లో టిక్‌టాక్ యాప్ అందుబాటులో వుంది. ముంబై, ఢిల్లీలో టిక్ టాక్ సంస్థకు చెందిన కార్యాలయాలున్నాయి. ఇందులో 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత ఏడాదిలో మాత్రం 60లక్షల వీడియోలను హింస, అశ్లీలత కారణంగా డిలీట్ చేసినట్లు టిక్‌టాక్ వెల్లడించింది. టిక్‌టాక్ ద్వారా ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, వీడియోలను పోస్టు చేసే అలవాటు ద్వారా టిక్‌టాక్‌కు బానిసలు అవుతున్నారని తేలింది. అందుకే టిక్‌టాక్ సంస్థ 13 విధివిధానాలను అమలు చేసింది. ఈ విధుల్లో 13 ఏళ్లలోపు గల వారు టిక్ టాక్ యాప్‌ను ఉపయోగించలేరు. అయితే ఇప్పటికే టిక్ టాక్‌ను ని షేధించాలని తమిళనాడు లో డిమాం డ్ ఉంది.
ప్రాణాలకు తెగిస్తునారు: ఈ వీడియోలతో క్రేజ్ సంపాదించుకోవాలన్న కుతూహలంతో ప్రాణాలకు తెగించి మరీ కొందరు సాహసాలు చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలోని తుమకూరుకు చెందిన కుమార్ అనే యువకుడు టిక్‌టాక్ కోసం ఓ వీడియో రూపొందిస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. తలకిందులుగా గాల్లోకి ఎగిరే స్టంట్ బెడిసి కొట్టడంతో మెడ, వెన్నెముక భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఇలాంటి కేసులు దేశవ్యాప్తంగా కోకొల్లలు.

శృతి మించితే ప్రమాదం

ఏదైనా అడిక్షన్ శృతి మించి పోయాక దాన్ని కం ట్రోల్ చేయడం చాలా కష్టం. పబ్‌జి, టిక్‌టాక్‌లు అడిక్షన్ స్థాయికి చేరకుండా ఉండాలంటే మనం చేసే పని, ఇంటి లోపల, ఇంటి బయట గడిపే సమయాల్లో బ్యాలెన్స్ కలిగి ఉండటం, నేరుగా కలిసిన వ్యక్తులతో ఫోన్ పక్కన పెట్టి మనస్ఫూర్తిగా గడపడం, సినిమాలు, పెళ్లిళ్లు వంటి వాటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఫోన్ కాల్ వస్తే తప్పించి అసలు ఫోన్ వాడకుండా మనం ఉన్న ప్రదేశాన్ని, అక్కడ చుట్టూ ఉన్న వ్యక్తులను ఆస్వాదించడం అవసరం.
అలాగే వారానికి కనీసం నాలుగు గం టలపాటు ఫోన్ చేతిలో లేకుండా డిజిటల్ డిటాక్స్ అలవాటు చేసుకోవాలి. ఇలాంటి సమయంలో కొంతమందికి విత్‌డ్రాయల్ లక్షణాలు వచ్చే అవకా శం ఉంటుంది. అదేపనిగా ఫోను గురించి ఆలోచించడం, గేమ్స్, టిక్ టాక్ వీడియోలు చూడడం, లే దా క్రియేట్ చేయడం చేయాలని మనసు లాగుతుంటుంది. దాన్ని వీలైనంత వరకు నియంత్రణలో పె ట్టుకోవాలి. కొంతకాలానికి దానంతట అదే అలవాటు అయిపోతుంది.పలురకాల డ్రగ్స్‌కి ఎలాగైతే బానిసలు అవుతారో ఇలాంటి యాప్స్‌కి బానిసలు కావడం కూడా అంతే ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా అడిక్షన్ స్థాయికి వెళ్తే నిద్రలేమి, చిరాకు, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి అనేక రకాల మానసిక సమస్యలతో ఇబ్బందిపడక తప్పదంటున్నారు.

అతిసర్వత్రావర్జయేత్ అన్నట్లుగా ఏదై నా సరే హద్దు మీరనంతవరకూ బాగానే ఉంటుం ది. టాలెంట్‌ను బయటపెట్టడం తప్పుకాదు. కానీ అది అసభ్యత, అశ్లీలతలకు దారితీయకూడదు. అ దేవిధంగా ట్రోలింగ్‌ల పేరుతో ఇతరులను కించపరచడం, అవమానపరచడం అమానుషం. కొన్ని ని యమాలు పాటిస్తూ ఉంటే ఈ బిజీలైఫ్‌లో ఇలాం టివి ఎన్నో ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌లు ఎంతో రిలీఫ్‌ను ఇస్తాయి. ఒత్తిడి నుంచి బయటపడేలా చేస్తా యని చెబుతున్నారు సైకాలజిస్టులు.

Story About Tik Tok App

మల్లీశ్వరి వారణాసి

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టిక్‌టాక్ వినోదమా? విషాదమా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.