పౌరసత్వం లేని భారత జవాను!

  ఆయన పేరు ముహమ్మద్ సనావుల్లా. అస్సాం రాజధాని గౌహతిలో సతాగాంవ్ ప్రాంతంలో ఉంటాడు. ఉత్తర కామరూప్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆయన్ను తన కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశాలు పంపాడు. ఎందుకంటే, ఆయన భారత పౌరుడు కాదు, అక్రమంగా ఇండియాలో ప్రవేశించిన బంగ్లాదేశీ. కాబట్టి ఆయన్ను నిర్బంధించి డిటెన్షన్ సెంటరుకు తరలించవలసి ఉంది. ఎన్‌ఆర్‌సి (జాతీయ పౌర రిజిస్టరు) ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి.పోలీసు సూపరింటెండెంట్ నుంచి ఈ ఉత్తర్వులు జారీ […] The post పౌరసత్వం లేని భారత జవాను! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆయన పేరు ముహమ్మద్ సనావుల్లా. అస్సాం రాజధాని గౌహతిలో సతాగాంవ్ ప్రాంతంలో ఉంటాడు. ఉత్తర కామరూప్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆయన్ను తన కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశాలు పంపాడు. ఎందుకంటే, ఆయన భారత పౌరుడు కాదు, అక్రమంగా ఇండియాలో ప్రవేశించిన బంగ్లాదేశీ. కాబట్టి ఆయన్ను నిర్బంధించి డిటెన్షన్ సెంటరుకు తరలించవలసి ఉంది. ఎన్‌ఆర్‌సి (జాతీయ పౌర రిజిస్టరు) ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి.పోలీసు సూపరింటెండెంట్ నుంచి ఈ ఉత్తర్వులు జారీ కావడానికి కేవలం ఒక నెల రోజులు ముందు ఇదే సనావుల్లాకు పోలీసులే ఉద్యోగమిచ్చారు. విచిత్రంగా ఉంది కదా. అది కూడా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగమిచ్చారు. అది కూడా బోర్డర్ పోలీస్ యూనిట్‌లో ఎలాంటి విచారణ లేకుండా ఒక విదేశీయుడికి బోర్డర్ పోలీసులో ఉద్యోగమిచ్చేస్తారా?

సనావుల్లా వయసు 57 సంవత్సరాలు. ఇటీవల ఆయన భారత సైన్యం నుంచి రిటైరయ్యారు. భారత సైన్యంలో ముప్పయి సంవత్సరాలు సేవ లందించారు. సుబేదారు హోదాలో రిటైరయ్యారు. సైన్యం నుంచి రిటైరైన తర్వాత, ఎక్స్ సర్వీస్ కోటాలో మరో ఉద్యోగం కోసం ప్రయత్నించారు. అస్సాంలో స్టేట్ బోర్డర్ పోలీస్ విభాగంలో యస్‌పిగా నియమించబడ్డారు. స్వయంగా డిఐజి ఆఫీసు ఈయన వెరిఫికేషన్ నిర్వహించి ఉద్యోగమిచ్చింది. ఏప్రిల్ 24న ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఎన్‌ఆర్‌సి కసరత్తులో భాగంగా ఆయన విదేశీయుడని చెప్పి గోపాల్ పారా నిర్బంధ కేంద్రానికి తరలించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇలా విదేశీయులుగా ముద్ర వేసిన వారిని ఉంచడానికి అస్సాంలో ఇప్పటి వరకు ఇలాంటి ఆరు జైళ్ళను ఏర్పాటు చేశారు. ముప్పయి సంవత్సరాలు సైన్యంలో పని చేసిన వ్యక్తి ఎలా విదేశీయుడు అవుతాడన్నది సైన్యం చెప్పాలి. మే 23వ తేదీన, అంటే ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తేదీన, గౌహతిలోని విదేశీయుల ట్రిబ్యునల్ సనావుల్లాను విదేశీయుడుగా ప్రకటించింది. 1971 మే 24 తర్వాత అక్రమంగా అస్సాంలోకి ప్రవేశించిన బంగ్లాదేశీగా నిర్ధారించింది.

ఈ తేదీ 1985 అస్సాం ఒప్పందంలో నిర్ణయించిన తేదీ. ఎవరు విదేశీయులు, ఎవరు స్వదేశీలు తేల్చడానికి 100 విదేశీ ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి చాలా కేసులు ముందుకు వస్తున్నాయి. ఈ కేసులు వ్యవస్థలోని అయోమయాన్ని బయటపెడుతున్నాయి. సాంకేతిక కారణాలతో అనేక మందిని విదేశీయులుగా ప్రకటించడం, వారిని నిర్బంధ శిబిరాలకు తరలించడం జరుగుతోంది. ఇందులో అత్యధికులు ముస్లింలే. ఇప్పుడు పౌరసత్వ చట్టం కూడా వస్తే, ముస్లింలు తప్ప మరెవ్వరు ఇలాంటి వేధింపులకు గురి అయ్యే పరస్థితి ఉండదు. కాని భారతదేశంలో ముస్లింల విషయంలో వేధింపులు న్యాయ సమ్మతం అయిపోతున్నాయి. సనావుల్లా సమర్పించిన పత్రాల్లో తేదీల్లో చాలా గందరగోళం ఉంది. సనావుల్లా 1978లో సైన్యంలో చేరానని చెప్పాడు. కాని అధికారిక పత్రాల్లో ఆయన 1987లో సైన్యంలో చేరినట్లు ఉంది.

సైన్యంలో చేరిన తేదీ పొరబాటున చెప్పి ఉండవచ్చు కదా. కాని విదేశీయుడిగా ప్రకటించడానికి ఏ అవకాశాన్ని వదలడం ట్రిబ్యునల్‌కు ఇష్టం లేదు. 1986 నాటికి 20 సంవత్సరాలు నిండిన సనావుల్లా ఓటర్ లిస్టులో తన పేరు ఎందుకు నమోదు చేయలేదన్నది మరో అభియోగం. కాని ఓటరుగా నమోదు చేసుకోడానికి కనీస వయస్సు 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన ప్రభుత్వ నిర్ణయాన్ని 1989లో తీసుకున్నారు. కాబట్టి సనావుల్లాకు ఓటరుగా నమోదు చేయించుకునే అవకాశం అప్పుడు లేదు. నిజం చెప్పాలంటే, దేశంలో చాలా చోట్ల ప్రజలు అందరు ఓటర్లుగా నమోదు చేయించుకుంటున్నారా? ట్రిబ్యునల్‌కు ఇచ్చిన బర్త్ సర్టిఫికేట్‌లోను, 1989 ఓటరు లిస్టులో ఇచ్చిన వివరాల్లోను జన్మ తేదీ వేరువేరుగా ఉందని ట్రిబ్యునల్ మరో అభ్యంతరం చెప్పింది.

ఇలా ఓటరు లిస్టులో తేడా ఉండడంలో ఆశ్చర్యమేమైనా ఉందా? ఎన్ని తప్పులు ఓటరు లిస్టులో రావడం లేదు? తన తండ్రి 1973లో చనిపోయారని సనావుల్లా చెప్పారట. ఆయన చెల్లెలి వయసు 40 సంవత్సరాలని చెప్పారట. కాని 1973లో తండ్రి చనిపోతే చిన్నచెల్లెలి వయసు కనీసం 46 సంవత్సరాలు ఉండాలి. మరి 40 సంవత్సరాలని చెప్పాడు కదా. కాబట్టి అబద్ధాలు చెబుతున్నాడు. తన చెల్లెలి వయసు విషయంలో పొరబడే అవకాశం అస్సాంలో ముస్లింకు లేదు. అలాంటి పొరబాటు చేస్తే పౌరసత్వమే ఉండదు. ఓటర్ల జాబితాలో సనావుల్లా బంధువు లందరి పేర్లు, కుటుంబ సభ్యులందరి పేర్లు లేకపోవడం కూడా ఆయన విదేశీయుడని అనుమానాన్ని నిర్ధారించుకోడానికి మరో కారణం.

గత సెప్టెంబరులో సోఫియా ఖానమ్ కేసులో సుప్రీంకోర్టు ఈ విషయమై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో తప్పులు సాధారణం. ఈ తప్పులను ఆధారం చేసుకుని ఎవరినీ విదేశీయుడిగా ప్రకటించడం సాధ్యం కాదని కోర్టు చెప్పింది. సనావుల్లా చదువుకున్న స్కూలులో పాత రికార్డులు వరదల్లో కొట్టుకుపోయాయి. ఆ స్కూలు ఆ రికార్డులు పోయాయని పోలీసులకు అప్పడు ఫిర్యాదు చేయలేదు. ఇది కూడా సనావుల్లాకు వ్యతిరేకమైన ఆధారంగా మారింది. ఇలాంటి చాలా సాక్ష్యాధారాలున్నాయి. ఆయన పౌరసత్వం గురించి విచారణ జరిపిన పరిశోధనాధికారి సందేహాస్పద ఓటరు అని నివేదిక ఇచ్చాడట.

కాని విచారించడానికి తన వద్దకు ఏ పోలీసు అధికారి రాలేదని సనావుల్లా చెప్పాడు. సనావుల్లా పిల్లల ఎత్తులు కూడా ఆయన తప్పుగా చెప్పాడట. పత్రాల్లో ఆయన పిల్లల పేర్లలో కూడా స్పెల్లింగ్ తప్పులున్నాయట. కాబట్టి ఈ కారణాల వల్ల ఆయన విదేశీయుడని నిర్ధారించేశారు. ఆయన సైన్యంలో 30 సంవత్సరాలు పని చేశాడు. క్షుణ్ణంగా విచారణ జరపకుండా సైన్యంలో ఎవరికీ ఉద్యోగం ఇవ్వరు. 2014లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి ఎక్స్ లెన్స్ సర్టిఫికేటు పొందాడు. ఈ సర్టిఫికేటు వల్లనే నాయబ్ సుబేదార్ నుంచి సుబేదార్ గా హోదా లభించింది. సైన్యంలో సేవలందించిన వ్యక్తి, అందులోను సర్వీస్‌లో అత్యధిక కాలం కశ్మీరులో ఉగ్రవాదులతో పోరాడిన సనావుల్లా తనను విదేశీయుడని గెంటేసి డిటెన్షన్ సెంటరుకు తరలిస్తారని కలలో కూడా ఊహించ లేదు. కాని మారిన ఇండియాలో ఇవన్నీ ఇపుడు సాధ్యమే.

                                                                                      – సంగీత బారువా పిషారోతీ (దివైర్)

Story about Muhammad Sanaullah

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పౌరసత్వం లేని భారత జవాను! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: