ప్రేమ జంటలను కాపాడుకుందాం

తల్లిదండ్రులు ప్రేమ జంటల్లో అబ్బాయిల మీద కిడ్నాపింగ్‌ల్లాంటి తప్పుడు కేసులు మోపడం, జరిగిన విషయాన్ని ప్రయత్న పూర్వకంగా కొంత దాచిపెట్టడం, కిడ్నాపింగ్ కేసు పెట్టేవరకు అన్ని రకాల ప్రలోభాలకు ఆయా వ్యవస్థల్ని లొంగదీయడం లేదా డబ్బులుతో కొనేయడం చేస్తున్నారు. తుదిగా రాజకీయ నాయకుల నుండి వత్త్తిడి తేవటం, ఇలాంటి కేసుల్లో పోలీసుల పాత్రకీలకమైనది. నిజాయితీగా కేసు పూర్వపరాలు అంచనా వేసుకుంటే జంటప్రేమ పెళ్లి కోసం వెళ్ళి పోయారా లేక అమ్మాయిని వేరే క్రిమినల్ ఇంటెన్షన్‌తో తీసికెళ్ళారో తెలుస్తుంది. […] The post ప్రేమ జంటలను కాపాడుకుందాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

తల్లిదండ్రులు ప్రేమ జంటల్లో అబ్బాయిల మీద కిడ్నాపింగ్‌ల్లాంటి తప్పుడు కేసులు మోపడం, జరిగిన విషయాన్ని ప్రయత్న పూర్వకంగా కొంత దాచిపెట్టడం, కిడ్నాపింగ్ కేసు పెట్టేవరకు అన్ని రకాల ప్రలోభాలకు ఆయా వ్యవస్థల్ని లొంగదీయడం లేదా డబ్బులుతో కొనేయడం చేస్తున్నారు. తుదిగా రాజకీయ నాయకుల నుండి వత్త్తిడి తేవటం, ఇలాంటి కేసుల్లో పోలీసుల పాత్రకీలకమైనది. నిజాయితీగా కేసు పూర్వపరాలు అంచనా వేసుకుంటే జంటప్రేమ పెళ్లి కోసం వెళ్ళి పోయారా లేక అమ్మాయిని వేరే క్రిమినల్ ఇంటెన్షన్‌తో తీసికెళ్ళారో తెలుస్తుంది.

అమ్మాయిల మనోగతాన్ని అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు బలవంతంగా ఇష్టంలేని వరుడు కిచ్చి, లక్షలు కట్నాలిచ్చి చేతులు కాల్చుకోడానికయినా సిధ్దపడుతున్నారు గాని అమ్మాయిల ఇష్టాఇష్టాలని లెక్కపెట్టటంలేదు. నచ్చిన మనిషి కోసం ఇంటిని, ఆస్తిపాస్తులని, అమ్మానాన్నలని, భవిష్యత్తుని సామాజిక స్థితిని తృణప్రాయంగా ఎంచి గడపదాటిన యువతీ యువకుల్ని ప్రేమకోసమో తమ మంచి భవిష్యత్ కోసమో గడప దాటిన వయోజనులు గా భావించడానికి బదులు – వారిని నేరస్థులుగా, భావించడమే గాక వారిని చంపడానికి పన్నాగాలు పన్ని అందుకు అన్ని వ్యవస్థలను తమకు అనుకూలంగావాడుకుంటున్న కులరాక్షస కన్నవాళ్ళు చేస్తున్న నేరాలకు అడ్డులేకుండా పోతున్నది.

హింస, హిపోక్రసీ ,వంచన రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో – మనుషుల మధ్య ప్రేమ, అనుబంధ బాంధవ్యాలు నిలుపుకోవడం కోసం , కులమతాలతో సంబంధం లేకుండా జీవితం లో ఒకరికొకరు తోడూ- నీడగా బతకాలని నిర్ణయించుకునే యువతీ యువకులను చూసి సమాజం ఎంతైనా గర్వపడాలి , సమాజపు వెనుకబాటు తనాన్ని అధిగమించి , పురోగమన దిశలో నడిచి వెళ్తున్నందుకు , కులమతాల సుడిగుండాలను దాటుకుని ముందుకెళ్లిన అలాంటి యువ ప్రేమ జంటల కు సామజిక అండ చాలా అవసరం.

తలిదండ్రులకు ఇష్టం లేని ప్రేమ పెళ్లిళ్లలో, వారిని కష్ట పెట్టటం ఇష్టం లేకనో, తలిదండ్రుల కోపాన్ని తట్టుకోలేకనో, యువ జంటలు ఇల్లు విడిచి వెళ్లిపోవటం లేదా స్వతంత్రంగా బతికే ఆలోచన చేయటం సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఆర్ధికంగా సామాజికంగా క్రి oదిస్థాయికి నెట్టబడిన కుటుంబాల్లో పుట్టి పెరిగిన యువకులు, నిచ్చెన మెట్ల కులవ్యవస్థ లో పైమెట్టుగా చెప్పుకునే కులాలకు చెందిన అమ్మాయిలని ప్రేమించి చేసుకొనే పెండ్ల్లిళ్ళలో, ఆ యువకులను అమ్మాయి తలిదండ్రులు లేదా బంధువులు, ఎక్కువగా తప్పుడు కేసుల్లో ఇరికించడం, భౌతిక దాడులకు హత్యలకు గురిచేయడం సర్వదా చూస్తున్నాం. అందులో భాగంగా అబ్బాయి తలిదండ్రులను, తోబుట్టువులను వేధించడమూ మామూలే.

ఇక అమ్మాయిల విషయంలో తమ తమ తలిదండ్రులు వారిని నాలుగ్గోడల మధ్య బంధించి ’దారికి’ తెచ్చే వైనం, శారీరక మానసిక దాడికి గురిచేస్తూ అలవి కానప్పుడు అంతం చేసి ’ఆత్మహత్య’లుగా సమాజాన్ని మభ్యపెట్టడం, న్యాయస్థానాలను దారి తప్పించడం , ‘పరువు‘ పేరుతో కలవారికుటుంబాలు ఆడపిల్లల పట్ల చేస్తున్నదాష్టీకం చూస్తూనే ఉన్నాం ! , ‘పరువు‘ పేరుతో జరిగే ఈ హత్యలు , వాటిని ప్రేరేపించే కుల పెద్దల పంచాయతీలు – ’కట్టుబాట్లు’ , ప్రత్యక్షంగా – పరోక్షంగా యువజంటల ప్రాణాలనే బలి తీసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న, వేరు కులం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందని సొంత కూతుర్నే బాలింతరాలని కూడా చూడకుండా మట్టుబెట్టారు. ఈ నేరాల్లో తండ్రులు, అన్న తమ్ములు కొన్ని సార్లు తల్లులు కూడా చేయికలపడం – ’కులం’ మనుషులని ఎంత పాశవికంగా తయారు చేయగలదో అర్థం అవుతుంది.

తలిదండ్రులనుండి ఘర్షణపూరిత వాతావరణం నెలకొని ఉన్నప్పుడు, ప్రేమ జంటలకు పోలీసుల అండ ఎంతో అవసరం. కాపు కాసి కాటేసే కలవారి ‘పరువు’ కుటుంబాలనుండి ప్రేమ జంటలను కాపాడటానికి బదులు వదిలించుకోడానికే ప్రాధాన్యమిస్తున్నది పోలీస్ వ్యవస్థ ! నిజానికి అటువంటి పరిస్థితి లో ఉన్న యువతీ యువకులకు, కౌన్సిలింగ్ ఇప్పించడం, ప్రాణాహాని లేకుండా చూసి కాపాడటం పోలీసుల బాధ్యత, అది వారికీ సులువైన విషయం కూడా . అయితే సమాజం లో పెరిగిన నేరాల సంఖ్య వల్ల కావొచ్చూ లేదా బయటి నుండి వచ్ఛే వత్తిళ్ళ వల్ల కావచ్చూ యువ జంటలకు ఇవ్వాల్సినంత రక్షణ ఇవ్వలేకపోతున్నారని చెప్పక తప్పదు. ఆడ పిల్లలకు పెళ్లి చేయించడానికి , ప్రభుత్వాలు నడిపే రాజకీయ పెద్దలు, చొరవ చూపి డబ్బులు పంచడానికి తద్వారా ఓట్లు రాబట్టుకునే యోచన చేస్తున్నారు కానీ, ఎవరి సహాయం తీసుకోకుండా కట్నకానుకలు అవసరం లేకుండా తమ ఇష్ట పూర్తి గా చేసుకునే ప్రేమ వివాహాలలో ఉన్న ఆడ పిల్లల కు కావాల్సిన రక్షణ ప్రభుత్వాలు ఇవ్వకున్నాయి.

ప్రేమ- పెళ్ళి- ఉద్యోగాల పేరుతో అమ్మాయిలని మాయమాటలతో ఇళ్ళు ,ఊర్లు దాటించేసి డబ్బుకి వంచనకి తెగబడి, మానవ అక్రమ రవాణాలో సరుకులుగా మార్చేస్తున్న ట్రాఫికర్స్, బ్రోకర్స్ దుర్మదాంధులున్న ఇదే సమాజంలో – ఒకరికొకరు అండగా నిలబడటానికి మానవసంబంధాలని నిలబెట్టుకునే ప్రయత్నం లో ప్రేమ-పెళ్లి చేసుకుంటున్న యువతీ యువకులకి అండగా ఉండి కాపాడి నిలబెట్టాల్సిందే! వారిని ’పారిపోయిన జంట’గా, నేరస్తులుగా, అవమానింపబడాల్సిన వ్యక్తులుగా భావించడమే గాక వారిపై నేరాలు మోపడం, నిర్దయ గా ఉన్న తలిదండ్రులకు అప్పచెప్పడం బాధ్యత రాహిత్యమే అవుతుంది! ’మా పని ఇంత వరకే ’ అనే గీత దాటి, పొలిటిషియన్స్ ప్రాణాలు ఎంత ముఖ్యమో మాములు ప్రజల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం అనే రాజ్యాంగ సూత్రాన్ని మనసా -వాచా-కర్మణా పాటించాలి.

తల్లిదండ్రులు ప్రేమ జంటల్లో అబ్బాయిల మీద కిడ్నాపింగ్‌ల్లాంటి తప్పుడు కేసులు మోపడం. జరిగిన విషయాన్ని ప్రయత్న పూర్వకంగా కొంత దాచిపెట్టడం , కిడ్నాపింగ్ కేసు పెట్టేవరకు అన్ని రకాల ప్రలోభాలకు ఆయా వ్యవస్థల్ని లొంగదీయడం లేదా డబ్బులు తో కొనేయడం చేస్తున్నారు. తుదిగా రాజకీయనాయకుల నుండి వత్త్తిడి తేవటం. ఇలాంటి కేసుల్లో పోలీసుల పాత్రకీలకమైనది. నిజాయితీగా కేసు పూర్వపరాలు అంచనా వేసుకుంటే జంట ప్రేమపెళ్లి కోసం వెళ్ళి పోయారా లేక అమ్మాయిని వేరే క్రిమినల్ ఇంటెన్షన్ తో తీసికెళ్ళరో తెలుస్తుంది. అమ్మాయిల మనోగతాన్ని అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు బలవంతంగా ఇష్టంలేని వరుడు కిచ్చి, లక్షలు కట్నాలిచ్చి చేతులు కాల్చుకోడానికయినా సిద్ధపడుతున్నారు గాని అమ్మాయిల ఇష్టాఇష్టాలని లెక్కపెట్టటంలేదు.

నచ్చిన మనిషి కోసం ఇంటిని, ఆస్థి పాస్తులని, అమ్మానాన్నలని, భవిష్యత్తుని సామాజిక స్థితిని తృణప్రాయంగా ఎంచి గడపదాటిన యువతీ యువకుల్నిప్రేమకోసమో తమ మంచి భవిష్యత్ కోసమో గడప దాటిన వయోజనులు గా భావించడానికి బదులు – వారిని నేరస్థులుగా, భావించడమే గాక వారిని చంపడానికి పన్నాగాలు పన్ని అందుకు అన్ని వ్యవస్థలను తమకు అనుకూలంగావాడుకుంటున్న కులరాక్షస కన్నవాళ్ళు చేస్తున నేరాలకు అడ్డులేకుండా పోతుంది. కులం మతం అంటూ గీతలు గీసి మానవత్వానికి మంటలు రాజేస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి యువ జంటలని కాపాడుతూ వ్యవస్థలు పటిష్ట పడాలి. పెళ్లి ఖర్చులకి భాజా భజంత్రీ లకోసం వెచ్చిస్తున్న ప్రభుత్వ సొమ్ముని ఇష్టపడి పెళ్లి చేసుకుని రక్షణ కోరుతున్న జంటలకు, జీవితం లో వారు స్వతంత్రంగా బతకడానికి కావాల్సిన వనరులని ఏర్పర్చడానికి ఉపయోగించాలి. వీరి సమస్యలు వినడానికి పరిష్కార మార్గాలు చూపడానికి లీగల్ సర్వీసెస్ అథారిటీ ముందుకు రావాలి.

Story about Love couples

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రేమ జంటలను కాపాడుకుందాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: