కడుపుబ్బ నవ్వులు

Pittala Dora

 

మెతుక్కి గతిలేని బతుకులు పిట్టల దొర కళాకారులు

పల్లెల్లో వీధి వీధి తిరుగుతూ పండితుల దగ్గరి నుండి పామరుల వరకు అందరిని కడుపుబ్బా నవ్వించే కళాకారుడు పిట్టలదొర. ఎవరైనా గ్రామంలో సాధ్యంకాని మాటలు మాట్లాడితే, పిట్టలదొర,తుపాకి రాముని మాటలు అంటూ నేటికీ వ్యవహరించే నానుడి కనిపిస్తుంది. ఈ పిట్టలదొరకే తుపాకీ వెంకట్రాముడు,తుపాకి రాముడు, లత్కోరు సాహెబ్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ వేషాన్ని పగటివేష కళాకారులతో పాటు బహురూపుల వాళ్లు, బేడ బుడగ జంగాలలో కొందరు కూడా వేస్తారు. ఇతను వేషధారణలో చేతిలో కట్టెతుపాకి, తలపై టోపీ, కాకి చొక్కా పాయింట్ ధరిస్తాడు. అతనికి ప్రదర్శనలో వాద్యాలు, పాటలు, అడుగులు అవసరం లేదు, అతనిమాటలే వాద్యాలు పాటలు అడుగులవుతాయి. అతను మాటలతో చిన్న పెద్ద,ముసలి ముతకా అందరికీ నవ్వులు తెప్పిస్తూ, నవ్వి నవ్వి కడుపు చెక్కలయ్యేలా చేస్తాడు. అతను వేషం ధరించి పల్లెలో మొదలైన దగ్గరి నుండి అతని వెంట పిల్లలు నవ్వుతూ తిరుగుతూనే ఉంటారు. అది అతని నైపుణ్యంతో కూడిన ఆకర్షణగా చెప్పవచ్చు.

తెలంగాణ సంస్కృతిలో జానపద కళలు భాగమై, తెలంగాణ సంస్కృతీ వైవిధ్యాన్ని గొప్పదనాన్ని తెలియజేస్తున్నాయి. ఇవి ప్రదర్శనలో భిన్నప్రక్రియలు కలిగి జానపద సమూహానికి విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తూ వస్తున్నాయి. ఆయా కళల కళాకారులు కూడా తమ కళను త రతరాలుగా పోషించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ జానపద కళల్లో హాస్యం ప్రధానమైనది. తాము ప్రదర్శించే కథలో ప్రేక్షకునికి ఆసక్తిలేనట్లయితే, ఆ కథాంశంలో హాస్యాన్ని ప్రవేశపెట్టి కళాకారులు ప్రదర్శించే అంశాన్ని రక్తి కట్టిస్తారు. ఆ యా కళారూపాల్లో బుడ్డరికమ్ బఫూన్, జోకర్, మంత్రి, హాస్యగాడు, సేవకుడు మొదలైన పేర్లతో హాస్యపాత్రలుంటాయి. ఈ హాస్య పాత్రలను వేరువేరు పేర్లతో పిలిచి నప్పటికీ ఆయా పాత్రలు వేదికమీద ప్రవేశించగానే ఆ పాత్రల వేషధారణ ,సంభాషణ ,అభినయం చూడగానే ప్రేక్షకుల్లో ఆనందం కలుగుతుంది.

ఆయా పాత్రలు కథలో హాస్యాన్ని పండించి తిరిగి తెర వెనుకకు మాయమవుతాయి. ఈ పాత్రలన్నీ కథలో సందర్భాన్నిబట్టి కేవలం రంగస్థలం మీదనే హాస్యాన్ని పండిస్తాయి .కానీ పల్లెల్లో వీధి వీధి తిరుగుతూ పండితుల దగ్గరి నుండి పామరుల వరకు అందరిని కడుపుబ్బా నవ్వించే కళాకారుడు పిట్టలదొర. ఎవరైనా గ్రామ ంలో సాధ్యంకాని మాటలు మాట్లాడితే, పిట్టలదొర ,తుపాకి రాముని మాటలు అంటూ నేటికీ వ్యవహరించే నానుడి కనిపిస్తుంది. ఈ పిట్టలదొరకే తుపా కీ వెంకట్రాముడు,తుపాకి రాముడు, లత్కోరు సాహెబ్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ వేషాన్ని పగటివేష కళాకారులతో పాటు బహురూపుల వాళ్లు, బేడ బుడగ జంగాలలో కొందరు కూడా వేస్తారు. ఇతను వేషధారణలో చేతిలో కట్టెతుపాకి, తలపై టోపీ ,కాకి చొక్కా పాయింట్ ధరిస్తాడు.

అతనికి ప్రదర్శనలో వాద్యాలు, పాటలు, అడుగులు అవసరం లేదు, అతని మాటలే వాద్యాలు పాటలు అడుగులవుతాయి. అతను మాటలతో చిన్న పెద్ద, ముసలి ముతకా అందరికీ నవ్వులు తెప్పిస్తూ, నవ్వి నవ్వి కడుపు చెక్కలయ్యేలా చేస్తాడు. అతను వేషం ధరించి పల్లెలో మొదలైన దగ్గరి నుండి అతని వెంట పిల్లలు నవ్వుతూ తిరుగుతూనే ఉంటారు. అది అతని నైపుణ్యంతో కూడిన ఆకర్షణగా చెప్పవచ్చు. ‘సోగ్గాడే చిన్ని నాయన ఒక పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు… కట్టె తుపాకెత్తుకోని గట్టుమీద నడుస్తుంటే కాలు జారి పడ్డాడే సోగ్గాడు’ అంటూ ‘ఆస్తిపరులు’ సినిమాలో పట్టణ నేపథ్యంలోని ప్రియుడిని సరదాగా హేళన చేస్తూ ఒక పల్లెటూరి పిల్ల పాడిన పాట ఉంటుంది. ఇందులో అతడు పిట్టలదొర వేషంలో కనిపిస్తాడు.

తుపాకి వెంకట్రాముని సంభాషణలో జానపదులకు ఆసక్తిని కలిగించే అంశాలే ఎక్కువగా ఉంటాయి. తన దగ్గర అన్ని ఉన్నాయంటూనే తన దగ్గర ఏమీ లేదనే విషయాన్ని స్పష్టం చేస్తాడు. అంతేకాకుండా తను మాట్లాడే భాషలో తెలంగాణ యాసతో పాటు తెలంగాణ వ్యవహార పదాలు, జంట పదాలు ఎక్కువగా ప్రయోగిస్తాడు. తుమ్మాకు ఇస్తార్లు, చింతాకు డొల్లలు, చెరువులో బియ్యం పోసి తూముకింద మంట పెట్టడం ,భోజనం చేసిన చుట్టాలు పాలతో చేతులు కడుక్కోవడం, ఇద్దరికి ఒక మెతుకు చొప్పున పొద్దంతా అన్నం పెట్టడం, ఊర బిస్కనుకొట్టి దాని మాంసంతో ఊరంతా భోజనాలు పెట్టగా మిగలడం, ఆ మిగిలిన మాంసం కోసం కొట్టుకోవడం అత్తమామలను వ్యంగ్యంగా దూషించటం, ఇటువంటి సన్నివేశాలు జానపదులను ఆకర్షించే అంశాలు.

వీటన్నింటిని అద్భుతంగా తన నైపుణ్యంతో ప్రదర్శిస్తూ పొట్ట పోసుకుంటూ వస్తున్నాడు పిట్టలదొర. నేటి ఆధునిక కాలంలో కూడా పిట్టలదొర అనగానే పండితులకైనా, పామరుల కైనా పెదాల మీద చిరునవ్వు కనిపిస్తుంది. పిట్టలదొర వేషం తరతరాలుగా జానపద సమూహానికి ఆనందాన్ని కలిగిస్తూ వస్తున్నప్పటికీ, ఆ వేషం వేసే కళాకారులు మాత్రం ఆర్థికంగా లేకుండా అదే వేషాన్ని కడుతూ గ్రామంలో మారాజా, మారాజా అంటూ ఇంటింటికి తుపాకి పట్టుక తిరుగుతూ పొట్ట కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. వారి మాటల్లో ఉన్న గాంభీర్యం, ఆనందం వారి జీవితాల్లో మాత్రం కనిపించదు.

పిట్టలదొర కళాకారుడు తాను ప్రధానంగా ఐదు నుండి పది నిమిషాల నిడివితో ఒక కథను గానం చేసినట్టుగా సంభాషిస్తాడు. అందులో ప్రధానంగా తన తుపాకి , వెంకట్రాముని పెళ్లి, తన అత్తమామల పెళ్లి , తన వేట గురించి ప్రస్తావిస్తాడు. ఈ సన్నివేశాలతో ప్రాచీన ఆధునిక కవులకందని భావుకతతో, అతిశయోక్తి అలంకారంతో జానపదులను కడుపుబ్బ నవ్విస్తాడు. అంతేగాక తాను మాట్లాడే భాషలో తెలంగాణ యాస, వ్యవహార పదాలు విస్తృతంగా ప్రయోగిస్తాడు. ’మా రాజా, మా రాజా…. అంటూ మొదట తన తుపాకీ అమీన్ సాబ్ తుపాకీ పోటీ పడ్డాయని, ఎవరి తుపాకి నీటిలో తేలుతుందోనని పందెం పెట్టుకుంటారు.

ఇందుకోసం ఇద్దరూ కలిసి వాటిని హుస్సేన్ సాగ ర్లో వేస్తారు. ఇందులో వెంకట్రాముని తుపాకి అ ప్పటికే మూడు సేర్ల పిండి, తవ్వడున్నర సోడు గు డాల తో పాటుగా మూడు సేర్ల గుడుంబాతాగి నీ ళ్ల మీద తేలుతూ, ఈత కొట్టుకుంటూ వస్తుంది. అమీన్ సాబ్ తుపాకి మాత్రం వేసిన కాడే అడుగు బట్టి పోయిందని నవ్విస్తాడు. అమీన్ సాబ్ కు కో పం వచ్చి నీ తుపాకికి లైసెన్స్ లేదంటే, నా తు పాకిని భుజాన పెట్టుకొని పోతుంటే ముఖ్యమంత్రు లు, ప్రధాన మంత్రులు, డీజీపీలు, కలెక్టర్లు కూ డా నా తుపాకీ లైసెన్స్ అడగరని ప్రభల్బాలుపలుకు తూ, మారాజ మారాజ అంటూ అందరు తుపాకు ల్లో ఇనుప గుండ్లు పెడితే, నేను మాత్రం మని షి గుండ్లు పెడతానని వ్యంగ్యంగా చమత్కరిస్తాడు.

వెంకట్రాముని ఊరబిస్క వేట:
తుపాకి రాముడు ఊరబిస్కెను వేటాడి దాన్ని ఊరందరికీ పంచిపెట్టే సంభాషణ అత్యంత హాస్యాన్ని కలిగిస్తుంది. ఇతను తుపాకీతో ఊరపిచ్చుకను కొడితే అది పోయి ఒక ఊరిలోని ఒక వాడలో పడుతుంది. దాని మాంసం తినని కులాలతో పాటుగా రజకులు, నాయీ బ్రాహ్మణులు ,దూదేకులవాళ్లు అందరూ కలిసి దాని మాంసాన్ని పోగులు వేస్తారు. ఆ మాంసం ఊరంతా సరిపోగా ఇంకా రెండు సప్పలు మిగిలిపోతాయి . ఆ రెండు సప్ప లు వరంగల్ మండి బజార్ కు పంపుతాడు. అక్కడ ఉండే కులాలు వెంకట్రాముడు నాకు పోగులు పంప లేదంటే నాకు పంపలేదంటూ ఒకరికొకరు గుద్దుకొని చనిపోయారని అంటాడు. ఊర పిచ్చుక మాంసం కనీసం వంద గ్రాములైనా ఉండదు. అలాంటిది దాని మాంసాన్ని ఊరందరికీ పంచి, చివరికి రెండు సప్పలు మిగిలితే అవికూడా పంచుతాడు. ఈ సన్నివేశాన్ని వెంకట్రాముడు అతని మాటలద్వారా జానపదులకు పదేపదే ఎన్నిసార్లు చెప్పినా కడుపుబ్బా నవ్వుతారంటే అది అతని గొప్పదనమే అవుతుంది.

వెంకట్రాముని పెళ్లి
వెంకట్రాముడు పెళ్లి చేసుకోవాలని చుట్టాలందర్నీ పిలిచి భోజనాలు పెట్టే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. తన పెండ్లికి చుట్టాలు కార్లు ,జీపులు, మోటార్లు సరిపోకపోతే సపాయి మోటర్లు వేసుకొని వస్తారు. అంతే కాదు ఇతని పెళ్ళికి మంత్రులతోపాటు పాకిస్తాన్ నుండి కూడా వస్తారు .పెళ్ళికి వచ్చిన చుట్టాలలో తబలపోచి, తబల రాజి ,తబలా ఎల్లవ్వ, ఒంటి పిర్ర గంగమ్మ, చాకలి ఎల్లమ్మ ,దూదేకుల పీరమ్మ ,పుర్రు మళ్లీ, పెంటాసి, గసగసలు, ఎనక రండలు, ముంగర ముండలు, ఎత్తుకోళ్లు, మొత్తు కోళ్లు ,కుయ కుయ్యలు,బయ బయ్యలు, జో కొట్టుడు ,లసలసలు, గుసగుసలు ఉసికేత్తే రాలకుండా వస్తారు. వారందరికీ వెంకట్ రాముడు చిన్న చూపు చూడడు పెద్ద చూపే చూస్తాడు. పదహారు పుట్ల వడ్లు పట్టించి గింజల వండితే సరిపోదని, చెర్ల బియ్యం పోసి తూము కింద మంట పెట్టిస్తాడు.

బువ్వ కూడా ఉడక మంటే కుయ్య కుయ్య అనుకుంటూ ఉడుకుతుంది. ఇక కూరగాయలు అయితే బర్రెపుర్రు, నేతి మట్టు, పశువులపెండ, గాడిద లద్ది, గుర్రం గుజ్జు , మేక నాదం, మేకతోలు, ఇక గ్యాస్ నూనె పోసి తాలింపు పెట్టిస్తాడు. హైదరాబాద్ లో పోసు పెడితే వరంగల్ మండి బజార్ లో వాసన వస్తుంది. అది కమ్మగా తీయగా ,పుల్లపుల్లగా చింతకాయ తిన్నట్టు తింటారు . అంతేకాకుండా తినేటప్పుడు చుట్టాలందరికీ వాడు గుండ్రౌతులుకాల్చి కిందేస్తాడు. సూదులు కాల్చి చుక్కబొట్టు పెడతాడు. దబ్బు డాలు కాల్చి కాటుక బొట్టు పెడతాడు. కొందరికి తలకొరిగి శికముడిచి పండ్లు ఊడదీసి తమలపాకులు ఏపిస్తాడు .ఇది చూసిన చుట్టాలు శభాష్ వెంకట్రాముడని పొగుడుతారు. ఇస్తార్లు కూడా తుమ్మాకు ఇస్తార్లు, చింతాకు డొల్లలు కుట్టించి లైన్ మీద కూర్చోబెట్టి పులిచేరుఆకులతో, తూటుపోయిన గంటె తోటి తోడాపెట్టా, పొద్దుపూకదు, అన్నం ఒడవదు. పొద్దుగాల ఆరు గంటలకు కూర్చున మనుషులకు ఒంటిగంట వరకు ఇద్దరికి ఒక మెతుకు చొప్పున పెడతాడు.

అది తిన్న మగవారి కైతే మొల దారాలు పుట్రు పుట్రుమని తెగుతుండగా, ఆడవారికి రవికలు పుసుకు పుసుకుమని ఊసి పోతుంటాయి. వెంకట్రామున్ని అక్కడి నుండి అత్తమామలు తమ పెద్ద అల్లుడని ఇంటికి తీసుకెళ్తారు. ఇంటిదగ్గర కుడి కాలు పెట్టి ఇంట్లోకి వస్తే మా ఇంట్లోకి లక్ష్మి వస్తుందని అంటారు. కానీ వెంకట్రాముడు మాత్రం కుడి కాలుకు బదులు ఎడమ కాలు పెట్టి ఇంట్లో అడుగు పెడతాడు. అప్పుడు అతని అత్తగారి సంసారం చుక్కల పర్వతం పెరిగినట్లు పెరుగుతుంది.అది ఎట్లా అంటే అతని అత్త పెద్ద బావను పెద్దపులి, చిన్న బావను చిరుత గండు, నడింబావను నాగు పాము కరుస్తుంది. ఇదే కాకుండా దొడ్డెడు ఆవులు దొంగలు దోచుకోవడం, ఇల్లుఇగురు పెట్టడం, పందిరి పచ్చబడటం, అతని మామ నీళ్ళు పోసుకోవడం, అత్త సమర్థ కావడం, అతని పెళ్ళం పసిద్ధ కావడం జరుగుతుంది. ఈ రకంగా అతను ఇంట్లో కాలు పెట్టిన విశేషం .ఇలాంటి అల్లుడు అందరికీ దొరకాలని అతన్ని పొగుడుతుంది. అంతేకాకుండా మళ్లీ నాకు బిడ్డ పుడితే నీకే ఇస్తానని అంటుంది. వెంకటరాముడు పోతే దొరకడని వాళ్ళ అత్త కంట్లం నూనె తెచ్చి, వాకిట్ల అయితే అం దరూ చూస్తారని ఇంట్లో మూలవాసం దగ్గర అతని పిరుదులు రెండింటినీ విడతీసి అక్కడ దీపం పెట్టి మా అల్లుడు బంగారం అంటూ వంగి వంగి దండం పెడుతుంది.

రాముని దగ్గర బంగారం కూడా బాగానే ఉందని, అతని బంగ్లాకాడ బం గారం ఎండి ఏట్లాడుతుందని అంతే కాదు బం గారం బంక లు జారుతుందని అంటాడు. అతని దగ్గర ఉన్న గుమ్మడి కాయంత బంగారాన్ని కుక్క మురుకు చూసిందని బాయిలో వేస్తాడు . దాన్ని తీసుకోవడానికి ఆశపోతులు బావిలో మునుగుతూ తేలుతున్నారని అయినా నా దగ్గర బంగా రం బాగానే ఉందని పలుకుతాడు. ఇక నా దగ్గర వడ్లు ఎన్ని రకాలున్నాయో అంటూ ఈత పేళ్లు, తాటి పేళ్లు, గరక సన్నలు, దోమ సన్నలు, చిట్టి ముత్యాలు, పులి మీసాలు, సీతమ్మ తలువాలు , లంజఉడుతలు, రామక్క పిర్రలు, చింతపువ్వడ్లు ,కప్పసారికలు ,బొల్లి మూతడ్లు, పాల బుడుమలు,టెంకాయ సన్నలు ,సూర్య వంకలు ,చంద్రవంకలు ,ఏక్ నిమ్మ లు ,వినీచినిమ్మ ల్లు,రాంకిచిడీలు, రత్నాలు ,కుంకుం పూలు, ఎలుక తోక లు, బట్ట సన్నలు,గౌరీ గోవులు,బండ్రగోవులు, గంట మొలకలు ఇట్లా నా దగ్గర మస్తు ఉన్నాయని, వడ్లకేంఫికర్ లేదని నాకేం బయంలేదని పలుకుతాడు. చివరగా తాను అందర్నీ నవ్విస్తూనే మా అత్త మామల పెళ్లి మందం కట్నమీయండని అర్థిస్తాడు.

తుపాకీ వెంకట్రాముని సంభాషణలో జానపదులకు ఆసక్తిని కలిగించే అంశాలే ఎక్కువగా ఉంటాయి. తన దగ్గర అన్ని ఉన్నాయంటూనే తన దగ్గర ఏమీ లేదనే విషయాన్ని స్పష్టం చేస్తాడు. అంతేకాకుండా తను మాట్లాడే భాషలో తెలంగాణ యాసతో పాటు తెలంగాణ వ్యవహార పదాలు, జంట పదాలు ఎక్కువగా ప్రయోగిస్తాడు.తుమ్మాకు ఇస్తార్లు, చింతాకు డొల్లలు ,చెరువులో బియ్యం పోసి తూముకింద మంట పెట్టడం, భోజనం చేసిన చుట్టాలు పాలతో చేతులు కడుక్కోవడం, ఇద్దరికి ఒక మెతుకు చొప్పున పొద్దంతా అన్నం పెట్టడం, ఊర బిస్కనుకొట్టి దాని మాం సంతో ఊరంతా భోజనాలు పెట్టగా మిగలడం ,ఆ మిగిలిన మాంసం కోసం కొట్టుకోవడం అత్తమామలను వ్యంగ్యంగా దూషించటం, ఇటువం టి సన్నివేశాలు జానపదులను ఆకర్షించే అంశా లు. వీటన్నింటిని అద్భుతంగా తన నైపుణ్యంతో ప్రదర్శిస్తూ పొట్ట పోసుకుంటూ వస్తున్నాడు పిట్టలదొర. నేటి ఆధునిక కాలంలో కూడా పిట్టలదొర అనగానే పండితులకైనా, పామరుల కైనా పెదాల మీద చిరునవ్వు కనిపిస్తుంది.

పిట్టలదొర వేషం తరతరాలుగా జానపద సమూహానికి ఆనందాన్ని కలిగిస్తూ వస్తున్నప్పటికీ, ఆ వేషం వేసే కళాకారులు మాత్రం ఆర్థికంగా లేకుండా అదే వేషాన్ని కడుతూ గ్రామంలో మారాజా, మారాజా అంటూ ఇంటింటికి తుపాకి పట్టుక తిరుగుతూ పొట్ట కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. వారి మాటల్లో ఉన్న గాంభీర్యం, ఆనందం వారి జీవితాల్లో మాత్రం కనిపించదు .జానపద కళల్లో బృంద కళలే మనుగడ సాధించలేని కాలంలో కూడా ఈ కళాకారులు తమ కళను కాపాడుకుంటూ వస్తున్నారు. ఎన్నో తరాల నుండి వ్యక్తిగతంగా ఒక్కరే ప్రదర్శించగల కళ లేదా పిట్టలదొర వేషం అక్కడక్కడ కొనఊపిరితో ,ఆ కళాకారులు మెరుస్తూ జీవితం కోసం కాకుండా కళ మీద ఉన్న అభిమానంతో ప్రదర్శిస్తూ వస్తున్నారు. మందపల్లి గ్రామం, చిన్నకోడూరు మండలం, సిద్దిపేట జిల్లాకు చెందిన తూర్పాటి కనకరాజు తుపాకి వెంకట్రాముని వేషం ధరిస్తూ ,గత నలభై సంవత్సరాలుగా కళను పోషించుకుంటూ వస్తున్నాడు. కానీ ఈ కళాకారునికి కనీసం ఉండడానికి గూడు లేక కళాకారుల పింఛను కూడా రాక ఈ కళాకారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ రకంగా వ్యక్తిగతంగా ప్రదర్శించే కళలను కూడా ప్రభుత్వం గుర్తించి వారికి ఆర్థికంగా సహాయం అందించాలని కళాకారులు కోరుకుంటున్నారు.

Story about Lifestyle of Pittala Dora

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కడుపుబ్బ నవ్వులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.