బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…

  బతుకమ్మలో కనువిందు చేసే పుష్పాలు ఎంతో ఘనమైనవి, ఖరీదైనవి కావు. పొలాలు, పెరటిలో, కాలిబాటల వెంట విరబూసే పువ్వులే బతుకమ్మగా ఒదిగిపోతాయి. గులాబీలు, మల్లెలు, లిల్లీలు కాకుండా అతి సామాన్యమైన గడ్డిపువ్వుల్లో కూడా బతుకమ్మ ఆకృతి దాలుస్తుంది. బతుకమ్మకు సంబంధించిన పువ్వుల వరుసకు కొన్ని నియమాలున్నాయి. మూడు, ఏడు, తొమ్మిది వరుసల్లో పూల వరుస ఉంటుంది. ఈ క్రమంలో అమర్చిన బతుకమ్మలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. మూడు వరుసల్లో పేరిస్తే ముగురమ్మలకు సంకేతం. ఏడు వరుసల్లో […] The post బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బతుకమ్మలో కనువిందు చేసే పుష్పాలు ఎంతో ఘనమైనవి, ఖరీదైనవి కావు. పొలాలు, పెరటిలో, కాలిబాటల వెంట విరబూసే పువ్వులే బతుకమ్మగా ఒదిగిపోతాయి. గులాబీలు, మల్లెలు, లిల్లీలు కాకుండా అతి సామాన్యమైన గడ్డిపువ్వుల్లో కూడా బతుకమ్మ ఆకృతి దాలుస్తుంది. బతుకమ్మకు సంబంధించిన పువ్వుల వరుసకు కొన్ని నియమాలున్నాయి. మూడు, ఏడు, తొమ్మిది వరుసల్లో పూల వరుస ఉంటుంది. ఈ క్రమంలో అమర్చిన బతుకమ్మలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. మూడు వరుసల్లో పేరిస్తే ముగురమ్మలకు సంకేతం. ఏడు వరుసల్లో పేరిస్తే ఏడు లోకాల్లో ఉన్న సప్త మాతృకలకు, తొమ్మిది వరుసల్లో అయితే నవ దుర్గలకు సంకేతాలు.

అట్ల బతుకమ్మ

అట్లను ఈ రోజు ప్రసాదంగా ఇస్తారు. నానబెట్టిన బియ్యం దంచి లేదా విసిరి పిండి చేస్తారు. నానబెట్టిన మినపప్పు రుబ్బి ఒక రోజు ముందే ఈ రెంటినీ కలిపి ఉంచుతారు. ఆ తర్వాత రోజు అట్లు పోసి ప్రసాదంగా పెడతారు.

Story about Flowers in Bathukamma

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: