మూసీకి స్టాప్‌లాగ్ గేటు బిగింపు

Musi project

 

సిఎం కెసిఆర్ ప్రమేయంతో ఆగమేఘాలపై చర్యలు, మంత్రి జగదీశ్‌రెడ్డి, యంత్రాంగం చొరవతో సక్సెస్, మరో ఎనిమిది ఎలిమెంట్స్ అమర్చేందుకు సన్నద్ధం

నల్లగొండ : మూసీ ప్రాజెక్టు గేటు ధ్వంసం కథ సుఖాంతమైంది. వరద ఉధృతి పెరగడంతో ఈనెల 5న ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని రెగ్యులేటరీ గేటు ధ్వంసంమైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక దృష్టితో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవ కారణంగా ఎట్టకేలకు ధ్వంసమైన మూసీ గేటు స్థానంలో స్టాప్‌లాగ్ గేట్‌ను శనివారం బిగించారు. అధికార యంత్రాంగం ఉరుకులు, పరుగులతో ఇప్పటికే వృథాగా వెళ్తున్న మూసీ నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. తొలిప్రయోగం విజయవంతం కావడంతో మరో ఎనిమిది ఎలిమెంట్స్ అమర్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

కాగా మూసీ ప్రాజెక్టు గేటు ధ్వంసమైన సమాచారం అందుకొని ఆ క్షణం నుంచి స్టాఫ్‌గేటు బిగింపు వరకు మంత్రి జగదీష్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో సాధ్యమైనంత త్వరగా ప్రయోజనం చేకూరిందనే చెప్పాలి. ముఖ్యమంత్రితో మాట్లాడి నిపుణుల బృందాన్ని రప్పించడం ద్వారా సాధ్యాసాధ్యాలను సమీక్షించిన మంత్రి ధ్వంసమైన మూసీ గేటు స్థానంలో స్టాఫ్ లాగ్‌గేటు అమర్చడంతో పాటు మరో ఎనిమిది ఎలిమెంట్స్ అమర్చేందుకు ఆస్కారం లభించింది.

మియాపూర్ వర్క్‌షాప్‌లో మరో 8 ఎలిమెంట్స్
హైదరాబాద్ మియాపూర్ వర్క్‌షాప్‌లో మరో ఎనిమిది ఎలిమెంట్స్ తయారు చేస్తున్నారు. ఈ ఎలిమెంట్స్ కూడా త్వరితగతిన మూసీకి చేరుకోవడం ద్వారా మిగిలిన వాటిస్థానంలో కూడా బిగించనున్నారు. మొత్తానికి 30వేల ఎకరాల ఆయకట్టుకు జీవనాధారమైన మూసీ ప్రాజెక్టు మనుగడతో పాటు రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోనుంది.

Stoplog gate clamp for Musi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మూసీకి స్టాప్‌లాగ్ గేటు బిగింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.