బాలిక కంట్లో నుంచి రాళ్లు..

  నిజామాబాద్‌: ఓ 12 ఏళ్ల బాలిక కంట్లో నుంచి చిన్న చిన్న రాళ్లు బయటకు వస్తుండడం స్థానికులను ఆశ్చర్యచకితుల్ని చేస్తోన్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… మాక్లూర్ మండలం మదన్ పల్లి గ్రామానికి చెందిన విజయ తన భర్త గల్ఫ్‌ వెళ్లాడంతో తాను బీడీలు చుడుతూ పిల్లని చదివించుకుంటుంది. వారికి సంతనం కలగకపోవడంతో చెల్లి కూతుర్ని దత్తత తీసుకొని పెంచుకుంటుంది. రాజేశ్వరి అనే బాలిక ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుంది. గత […] The post బాలిక కంట్లో నుంచి రాళ్లు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నిజామాబాద్‌: ఓ 12 ఏళ్ల బాలిక కంట్లో నుంచి చిన్న చిన్న రాళ్లు బయటకు వస్తుండడం స్థానికులను ఆశ్చర్యచకితుల్ని చేస్తోన్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… మాక్లూర్ మండలం మదన్ పల్లి గ్రామానికి చెందిన విజయ తన భర్త గల్ఫ్‌ వెళ్లాడంతో తాను బీడీలు చుడుతూ పిల్లని చదివించుకుంటుంది. వారికి సంతనం కలగకపోవడంతో చెల్లి కూతుర్ని దత్తత తీసుకొని పెంచుకుంటుంది. రాజేశ్వరి అనే బాలిక ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుంది.

గత 3 రోజుల నుంచి బాలిక కంటి నొప్పితో బాధపడుతుంది. ఎడవ కన్ను రెప్ప కింది భాగం నుంచి వివిధ సైజుల్లో ఒకదాని వెంట ఒకటి రాళ్లు పడుతున్నాయని, ఇప్పటికి 25 రాళ్లు గుర్తించినట్టు బాలిక తల్లి విజయ తెలిపారు. దీంతో బాలికను నిజమాబాద్ లోని కంటి ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాలికకు కంటి పరీక్షలు నిర్వహించిన హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానకు బాధిలి చేశారు. అయితే బాలిక కంటి వైద్య ఖర్చులు భరించేందుకు బాధితురాలి కుటుంబం భయపడుతోంది.

Stones getting from a girls eyes in nizamabad

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బాలిక కంట్లో నుంచి రాళ్లు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: