‘బేర్’మన్న మార్కెట్లు

ముంబయి: వారారంభ రోజు సోమవారం స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆగస్టు 17 తర్వాత తొలిసారిగా సెన్సెక్స్ 467 పాయింట్లు పతనమై 37,922 వద్ద ముగిసింది. కాగా ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 151 పాయింట్లు లేక 1.3 శాతం నష్టపోయి 11,438 వద్ద ముగిసింది. మార్చి 16 తర్వాత ఒకే రోజున సెన్సెక్స్, నిఫ్టీలు ఇంతలా పడిపోవడం ఇదే మొదటిసారి. అమెరికాచైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ తాజాగా సర్వకాల కనిష్ఠానికి భారీగా పతనం […]

ముంబయి: వారారంభ రోజు సోమవారం స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆగస్టు 17 తర్వాత తొలిసారిగా సెన్సెక్స్ 467 పాయింట్లు పతనమై 37,922 వద్ద ముగిసింది. కాగా ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 151 పాయింట్లు లేక 1.3 శాతం నష్టపోయి 11,438 వద్ద ముగిసింది. మార్చి 16 తర్వాత ఒకే రోజున సెన్సెక్స్, నిఫ్టీలు ఇంతలా పడిపోవడం ఇదే మొదటిసారి. అమెరికాచైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ తాజాగా సర్వకాల కనిష్ఠానికి భారీగా పతనం కావడం, చమురు ధర మంటతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దాంతో ఒత్తిడిని తట్టుకోలేక మార్కెట్ల సూచీలు బేర్‌మన్నాయి. దీనికి తోడు ఆసియా మార్కెట్లు కూడా బలహీన సంకేతాలనే కనబరిచాయి. ఎన్‌ఎస్‌ఇలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, ఎఫ్‌ఎంసిజి, లోహ, ఫార్మా రంగాల 12 శాతం పడిపోయాయి. నిఫ్టీలో 42 స్టాకులు నష్టాల్లోనే ముగిసాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వీస్, ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, బిపిసిఎల్, మహీంద్ర, వేదాంత 3.5 శాతం మేరకు పతనమయ్యాయి. మొత్తంగా చూసినప్పుడు మార్కెట్ నష్టాల్లోనే కుప్పకూలింది.

చైనా వస్తువుల దిగుమతి వస్తువులపై సుంకాలు విధిస్తామని ట్రంప్ శుక్రవారం హెచ్చరించడంతో చైనా కరెన్సీ విలువ పడిపోయింది. రూపాయి విలువ కూడా పతనమైందని మూడీస్ చెప్పేసరికి మదుపరుల సెంటిమెంట్ దెబ్బతింది. ఏడాది కాలంలో డాలరు మారకంతో రూపాయి విలువ 14 శాతం పతనమైంది. ముడి చమురు ధర బ్యారెల్‌కు 78 డాలర్లకు చేరుకుంది. అమెరికా కొత్తగా ఇరాన్ ముడిచమురుపై ఆంక్షలు నవంబరులో అమలు చేయనుండడంతో మదుపరుల సెంటిమెంటు కుంగింది. మార్కెట్ సోమవారం కుప్పకూలడానికి రూపాయి విలువ పతనం, వాణిజ్య లోటు ఒత్తిడి, ముడి చమురు ధర అత్యధికంగా పెరగడం వంటివి కారణమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. భారత తన చమురు అవసరాలకు 80 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నదన్నది ఇక్కడ గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌జూన్ మధ్య కరెంట్ ఖాతా లోటు 15.8 బిలియన్ డాలర్ల మేరకు పెరిగింది. ముఖ్యంగా వాణిజ్య లోటు ఎక్కువగా ఉండడమే దీనికి కారణమని ఆర్‌బిఐ గత వారం తెలిపింది.

Comments

comments