రూ.4 లక్షల కోట్లు ఆవిరి…

రెండు రోజుల్లో ఇన్వెస్టర్లు నష్టపోయిన మొత్తం  రూపాయి పతనంతో కుప్పకూలిన మార్కెట్లు ముంబయి : దేశీయ స్టాక్‌మార్కెట్ల్లు కుప్పకూలడంతో ఇన్వెస్టర్ల సంపద రెండు రోజుల్లో రూ.4 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్(బిఎస్‌ఇ)లో లిస్టయిన స్టాక్‌ల మొత్తం విలువ రూ.153 లక్షల కోట్లకు పడిపోయింది. రూపాయి దారుణంగా పడిపోవడంతో సూచీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద భారీ మొత్తంలో ఆవిరైంది. దాదాపు రూ.4.2 లక్షల కోట్లను మదుపర్లు కోల్పోయారు. […]

రెండు రోజుల్లో ఇన్వెస్టర్లు నష్టపోయిన మొత్తం  రూపాయి పతనంతో కుప్పకూలిన మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్‌మార్కెట్ల్లు కుప్పకూలడంతో ఇన్వెస్టర్ల సంపద రెండు రోజుల్లో రూ.4 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్(బిఎస్‌ఇ)లో లిస్టయిన స్టాక్‌ల మొత్తం విలువ రూ.153 లక్షల కోట్లకు పడిపోయింది. రూపాయి దారుణంగా పడిపోవడంతో సూచీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద భారీ మొత్తంలో ఆవిరైంది. దాదాపు రూ.4.2 లక్షల కోట్లను మదుపర్లు కోల్పోయారు. ఎక్సేంజ్ గణాంకాల ప్రకారం, మంగళవారం సాయంత్రం 3.30 నిమిషాలకు మొత్తం మార్కెట్ మూలధనం(మార్కెట్ క్యాపిటలైజేషన్) రూ.153.24 లక్షల కోట్లకు పడిపోయి రూ.4.16 లక్షల కోట్లు నష్టపోయింది. సెప్టెంబర్ 7న మార్కెట్ మూలధనం రూ.157.40 కోట్లుగా ఉంది. అయితే ఆగస్టు 31న బిఎస్‌ఇలోని మొత్తం లిస్టెట్ కంపెనీల మార్కెట్ మూలధనం గరిష్ఠ స్థాయి రూ.159.35 లక్షల కోట్లుగా ఉంది. మంగళవారం బిఎస్‌ఇ 1.3 శాతం నష్టపోయి రూ.37,413 పాయింట్ల వద్ద ముగిసింది. గత వారాంతం శుక్రవారం 38,390 పాయింట్ల వద్ద ఉన్న బిఎస్‌ఇ సూచీ దాదాపు 977 పాయింట్లు(2.5శాతం) నష్టపోయింది. గత రెండు రోజు ల్లో పలు కంపెనీలు రూ.10 వేల కోట్లకు పైగా మార్కెట్ విలువను కోల్పోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.26,300 కోట్లు, ఐటిసి రూ.17,600 కోట్లు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రూ.15,300 కోట్లు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ.14,400 కోట్లు, హిందుస్తాన్ యునిలివర్ రూ.10,800 కోట్లు మార్కెట్ విలువను కోల్పోయాయి. ఐదు కంపెనీల మార్కెట్ విలువ మొత్తంగా రూ.84,400 కోట్లు నష్టమేర్పడింది. మార్కెట్ పరిస్థితులను చూస్తే ఆర్థిక రంగం అత్యంతగా నష్టపోయింది. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు గత రెండు రోజుల్లో రూ.97,900 కోట్లు నష్టపోయాయి.
రెండు రోజుల్లో సెన్సెక్స్ 977 పాయింట్లు డౌన్
మార్కెట్ సూచీలు నెల రోజుల కనిష్టానికి పడిపోయాయి. రూపాయి పతనం మార్కెట్‌ను ముంచింది. చివరి గంట లో మార్కెట్‌లో హఠాత్తుగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఐటిసి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి, టిసిఎస్, ఐసిఐసిఐ బ్యాంక్ 1 నుంచి -3 శాతం మధ్య క్షీణించాయి. చివరికి సెన్సెక్స్ 509 పాయింట్లు కోల్పోయి 37413 వద్ద ముగిసింది. రెండు రోజుల్లో (సోమ, మంగళ) సెన్సెక్స్ 977 పాయింట్లను నష్టపోయింది. మొత్తానికి సూచీలు నెలరోజుల కనిష్టానికి పడిపోయాయి. ఎన్‌ఎస్‌ఇలోని ప్రధాన సూచీలన్నీ నష్టాలతో ముగిశాయి. అత్యధికంగా నిఫ్టీ ఎఫ్‌ఎంసిజి సూచి 2.50 శాతం నష్టపోయింది. మరో కీలకమైన నిప్టీ బ్యాంకు సూచీ 394 పాయింట్లు క్షీణించి 27వేల దిగువకు 26,807 వద్ద ముగిసింది. హెవీ వెయిట్ షేర్లైన ఐటిసి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి, టిసిఎస్, ఐసిఐసిఐ బ్యాంక్‌లు 3 నుంచి 1 పతనం కావడం మార్కెట్ల భారీ పతనానికి కారణమైంది. రెండు రోజులు ఎఫ్‌ఎంసిజి షేర్ల ఐటిసి 3శాతం వరకూ నష్టపోయింది.

మార్కెట్‌కు రూపాయి సెగ

స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజు కుప్పకూలాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 72.72కు పడిపోవడంతో మార్కెట్లు కుదేలయ్యాయి. మరోవైపు ముడి చమురు ధరలు పెరుగుతూ ఉన్నాయి. దీంతో మంగళవారం మధ్యాహ్నం స్వల్ప ఆటుపోట్ల మధ్య కదిలిన స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ కారణంగా సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా పతనమైంది. సోమవారం కూడా రూపాయి భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. మార్కెట్లు 2016 ఫిబ్రవరి తరువాత వరుసగా రెండు రోజులు 1 శాతం చొప్పున నష్టపోవడం ఇదే.. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ మరోసారి 509 పాయింట్లు నష్టపోయి 37,413 పాయింట్ల ముగిసింది. ఇదే బాటలో నిఫ్టీ 151 పాయింట్లు కోల్పోయి 11,287 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఇలో అన్ని రంగాలూ 2- నుంచి 1.5 శాతం మధ్య పతనమయ్యాయి. ఐటి మాత్రమే 0.7 శాతం క్షీణించగా, నిఫ్టీ దిగ్గజాలలో టైటన్, టాటా స్టీల్, ఐటిసి, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, హీరోమోటో, టెక్ మహీంద్రా, ఐబి హౌసింగ్, యుపిఎల్, ఎయిర్‌టెల్ 4.5- నుంచి 2.4 శాతం డీలాపడ్డాయి. బ్లూచిప్స్‌లో కేవలం కోల్ ఇండియా, ఎం అండ్ ఎం, ఎన్‌టిపిసి, ఇన్ఫోసిస్ లాభపడ్డాయి. మార్కెట్ల బాటలో చిన్న షేర్లలోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.4 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1840 నష్టపోగా, 875 మాత్రమే లాభాలతో ముగిశాయి. సోమవారం నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ.842 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా, దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ.290 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.

Comments

comments

Related Stories: