భారతదేశ ప్యాకేజీ జిడిపిలో 5% లోపే

  నాయకులు, విధానకర్తలు కలిసి చర్యలు చేపట్టాలి లేకపోతే రాబోయే 18 నెలల్లో ఆర్థిక ఇబ్బందులు తప్పవు వరల్ ఎకనామిక్ ఫోరం నివేదిక న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ జిడిపిలో 5 శాతం కన్నా చాలా తక్కువ ఐఎంఎఫ్ తాజా నివేదిక పేర్కొంది. ప్రపంచ నాయకులు, వ్యాపారవేత్తలు, విధానకర్తలు కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని, లేకపోతే రాబోయే 18 నెలల్లో ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అసంతృప్తి పెరిగే అవకాశముందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యయనం తెలిపింది. […] The post భారతదేశ ప్యాకేజీ జిడిపిలో 5% లోపే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నాయకులు, విధానకర్తలు కలిసి చర్యలు చేపట్టాలి
లేకపోతే రాబోయే 18 నెలల్లో ఆర్థిక ఇబ్బందులు తప్పవు
వరల్ ఎకనామిక్ ఫోరం నివేదిక

న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ జిడిపిలో 5 శాతం కన్నా చాలా తక్కువ ఐఎంఎఫ్ తాజా నివేదిక పేర్కొంది. ప్రపంచ నాయకులు, వ్యాపారవేత్తలు, విధానకర్తలు కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని, లేకపోతే రాబోయే 18 నెలల్లో ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అసంతృప్తి పెరిగే అవకాశముందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యయనం తెలిపింది.

‘కోవిడ్ -19 రిస్క్ అవుట్‌లుక్: ఎ ప్రిలిమినరీ మ్యాపింగ్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్’ పేరిట మార్ష్ అండ్ మెక్లెనన్, జూరిచ్ ఇన్సూరెన్స్ గ్రూప్ భాగస్వామ్యంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యయనం చేపట్టింది. ఇది దాదాపు 350 మంది సీనియర్ రిస్క్ నిపుణుల అభిప్రాయాలను సేకరించింది. వారు రాబోయే 18 నెలలు పరిస్థితులు, అలాగే ప్రపంచం, వ్యాపారాలపై ఉండే ప్రభావం వంటి అంశాలను ర్యాంక్‌ల వారీగా నివేదికలో పేర్కొన్నారు. వాటిలో కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి.

1) భారతదేశ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ జిడిపిలో 5% కన్నా చాలా తక్కువ. (ఐఎంఎఫ్ పేర్కొన్న గణాంకాల ప్రకారం)
2) ప్రపంచ నాయకులు, వ్యాపారవేత్తలు, విధానకర్తలు కలిసి పనిచేయకపోతే రాబోయే 18 నెలల్లో ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అసంతృప్తి పెరుగుతుంది.
3) అత్యధికంగా భయపడే ప్రమాదాల జాబితాలో సుదీర్ఘమైన ప్రపంచ మాంద్యం అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత దివాలా, పరిశ్రమల ఏకీకరణ, వైఫల్యం నుంచి పరిశ్రమలు కోలుకోలేకపోవడం, సప్లై చైన్ అంతరాయం ఉన్నాయి.
4) కోవిడ్ -19 ప్రజలు, వస్తువుల కదలికలను పరిమితం చేస్తుంది. దీంతో విధానాల రూపంలో వ్యాపారాలకు భౌగోళిక రాజకీయ అంతరాయం ముప్పు పొంచి ఉంది.
5) మరొక అంటు వ్యాధి వ్యాప్తికి అవకాశం.
6) సైబర్ క్రైమ్ పెరుగుదల, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) మౌలిక సదుపాయాల వైఫల్యం.

Stimulus of 5% of Indian GDP needed

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భారతదేశ ప్యాకేజీ జిడిపిలో 5% లోపే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: