సమస్యలను తరిమికొట్టే యోగా!

Yoga

 

పదిమందిలో ఎనిమిదిమంది వరకు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడ్తున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, శరీరానికి వ్యాయామం లేకపోవడం వల్ల రోగాలబారిన పడుతున్నారు. అందులో ఈ వర్షాకాలంలో వ్యాయామం చేయడం అంటే బద్ధకం వచ్చేస్తుంది. యోగా ఈ కాలంలో చేయదగ్గ మంచి వ్యాయాయమని చెబుతున్నారు యోగా నిపుణులు. యోగాతో ఎన్నో ప్రయోజనాలున్నాయన్న విషయం తెలిసిందే. వారానికి ఓ నాలుగు రోజులు యోగాకి కేటాయిస్తే శరీరం, మనసు చురుదనంతోపాటు ఆరోగ్యంగా ఉంటాయని సూచిస్తున్నారు.

సెలబ్రిటీలను ఎవరిని కదిలించినా ప్రతిరోజూ యోగా తప్పక చేస్తుంటామని చెబుతుంటారు. దేశ ప్రధాని దగ్గర నుంచి ఇదే మాట వినిపిస్తుంటుంది. సంపూర్ణ ఆరోగ్యా నికి వైద్యులు సూచించే ప్రథమ ఔషధం యోగా. యోగసాధనతో సంపూర్ణ, సమగ్ర వ్యక్తిత్వ వికాసం అలవడుతుంది. వ్యక్తిలో శారీరక, మానసిక, సామా జిక, ఆధ్యాత్మిక వికాసం అలవడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. శారీరక వ్యాయామాన్ని మించిన ప్రయో జనాలున్నం దునే విదేశీయులు కూడా దీనిపై మోజు పెంచుకుంటున్నారు. యోగ సాధన వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరం నుండి విషతుల్యాలు వేగంగా బయటకు వెళ్లిపోతాయి. శ్వాసప్రక్రియపై ఏకాగ్రత ఉంచి సాధన చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది.

మనోవికాసానికి మందు యోగా : యోగ సాధన అంటే సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ముద్రలు, క్రియలు మాత్రమే కాదు. మనసు, శరీరాల సంయోగంతో శ్రద్ధ గా యోగా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్తపోటు నివారణ, ఒత్తిడి తగ్గడం, బరువు తగ్గడం కొలెస్టరాల్ నియంత్రణ లాంటి ఎన్నో అద్భుతమైన అనుకూల ప్రభావాలు చూపిస్తుంది. బరువు తగ్గడానికి మంచి మార్గం. మానసిక ఆనందం ఇచ్చే మార్గం.

బరువు తగ్గించేది: ప్రస్తుతం అందరినీ బాధిస్తున్న సమస్య అధిక బరువు. బరువు తగ్గించుకోవడానికి రకరకాల పద్ధతు ల్ని అవలంబిస్తుంటారు. వాటివల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చి అదో సమస్యగా మారుతోంది. బరువు తగ్గడానికి యోగా అద్భుతం గా సహాయపడుతుంది. డైట్ ప్లాన్ అనుసరిస్తూ మధ్యలో వదిలేస్తే తిరిగి సులభంగా బరువు పెరుగుతారు. కాబట్టి డైట్ ప్లాన్‌తో పాటు క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే తప్ప నిసరిగా అధిక బరువును అధిగమించవచ్చని అంటున్నారు నిపుణులు. యోగ సాధనతో ఎల్లప్పుడూ ఒకే బరువును కలిగి ఉండవచ్చు.

మానసిక శాంతి: యోగ సాధన వల్ల ఆలోచనా శక్తి పెరుగుతుంది. శ్వాస క్రియ సాధనలతోపాటు ఆసనాలు చేస్తుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని యోగా గురువులు అంటున్నారు. దైనందిన జీవితంలోని నిరంతర కార్యక్రమా లను ఏ ఆటంకం లేకుండా చేసుకోగలుగుతారు. యోగాతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. రోజంతా తీరిక లేని పనులతో సతమతమయ్యేవారు యోగసాధనకు కాస్త సమయం కేటా యించడం వల్ల ఒత్తిడి తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.
విశ్రాంతికి మార్గం: ఈ యాంత్రిక జీవనం వల్ల విశ్రాంతి ఏంటో మర్చిపోతున్నారు చాలా మంది. కొంతమందేమో అతిగా తింటూ, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం బారిన పడుతున్నారు. ఈ రెండు పద్ధతులూ మంచివి కావు. విశ్రాంతికి సమయం లేనివారికి యోగాలో అతి తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలనిచ్చే (దీర్ఘ విశ్రాం తినిచ్చే) ప్రక్రియలు చాలా ఉన్నాయి. వీటినే యోగనిద్ర లేదా రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటారు. ఈ రకమైన యోగసాధన చేయడం వల్ల కేవలం ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలో శరీరం అంతా దీర్ఘ విశ్రాంతి పొందుతుంది. 1-2 గంటలు నిద్రపోతే శరీరానికి ఎంత విశ్రాంతి లభిస్తుందో, కేవలం ఐదు నుంచి పది నిమిషాలలో అటువంటి లోతైన విశ్రాంతి లభిస్తుంది. శరీరంలోని కేంద్ర నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, అన్నీ దీర్ఘమైన, లోతైన విశ్రాంతిని పొందుతాయి. తద్వారా శరీరంలో జరిగే జీవక్రియలన్నీ సహజంగా, సామరస్యంగా జరుగుతూ శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి.

సజావుగా రక్త ప్రసరణ : యోగాలోని వివిధ భంగిమలు, శ్వాస ప్రక్రియల సం యోగంతో శరీరంలో రక్తప్రసరణ సజావుగా సాగు తుంది. రక్త ప్రసరణ బాగుంటే, ప్రాణ వాయువు, ఇతర పోష కాలు శరీరంలో చక్కగా సరఫరా అయి ఆరోగ్యకరమైన అవయవా లు, మెరిసే చర్మం కలిగి ఉండేందుకు దోహదపడుతుంది. స్వ ల్ప కాలం పాటు శ్వాస నిలిపి ఉంచే వివిధ ఆసనాల వల్ల గుండె, ధమనులు చురుగ్గా పని చేస్తాయి. యోగా వల్ల రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. రక్తం గడ్డ కట్టదు. గుండె సమర్థవంతంగా పనిచేస్తుంది.

నొప్పుల నివారణగా: యోగా వెన్నునొప్పి, కీళ్ళ నొప్పులు రాకుండా చేస్తుంది. కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యో గాలు చేసే వారు, నిత్యం ఎక్కువ దూరం వాహనాలు నడిపే వారు క్రమం తప్పకుండా యోగా చేయాలని నిపుణులు సూచి స్తున్నారు. ఎందుకంటే యోగా వెన్ను పూసలో ఒత్తిడిని, బిగుతును తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరాకృతి మెరుగ య్యేలా చేస్తుంది. యోగాలో భాగంగా దీర్ఘంగా, నెమ్మదిగా చేసే వివిధ శ్వాసక్రియల వల్ల ఊపిరితిత్తులు, ఉదర భాగా లకు సామర్ధ్యం పెరుగుతుంది. దీని వల్ల దైనందిన పనితీరు మెరుగుపడుతుంది, సహన శక్తి పెరుగుతుంది. దీర్ఘ శ్వాసల వల్ల కూడా విశ్రాంతి కలిగి శారీరక, మానసిక ఒత్తిడి నుంచి కోలుకునేలా చేస్తుంది.

పెద్దలకు కూడా.. వయసు పెరిగే కొద్దీ మెదడుకీ, శరీరానికి సమతౌల్యం దెబ్బతింటుంది. నిత్యం చేసే పనుల్లో శారీరక కదలికలు లేకుండా స్తబ్దుగా ఉండేవారి జీవన శైలిలో ఈ ప్రమాదం ఎక్కువ. దీనివల్ల పడిపోవడం, ఎముకలు విరగ డం, వెన్ను పూస ఆరోగ్యంగా లేకపోవడం లాంటి చాలా సమ స్యలు వస్తాయి. యోగావల్ల కోల్పోయిన ఈ సమతౌల్యాన్ని, కీలకమైన నియంత్రణను తిరిగి పొందవచ్చు.

గర్భిణీలకు యోగా! గర్భం దాల్చిన సమయంలో మనసుపై పడే ఒత్తిడిని తగ్గించేందుకు యోగా బాగా ఉపయోగపడు తుంది. యోగ సాధన ద్వారా మానసిక స్థైర్యం పెరిగి భయా లు, అపోహలు తొలిగిపోతాయి. శారీరకంగా, మాననసికం గా దృఢంగా తయారవుతారు. యోగావల్లరక్త ప్రసరణ, జీర్ణ క్రియ, శ్వాస క్రియ మెరుగవుతాయి, నాడీ వ్యవస్థ నియంత్ర ణలోకి వస్తుంది. గర్భిణీగా ఉన్నప్పుడు ఉండే నిద్రలేమి, నడు ము నొప్పి, కాళ్ళు పట్టేయడం, అజీర్ణం లాంటి సమస్యలనుంచి కూడా బయట పడవచ్చు. ముందుగా వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.

Stay healthy with yoga

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సమస్యలను తరిమికొట్టే యోగా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.