ఇకపై రాష్ట్రాలకే ఎక్కువ అధికారాలు

  కేంద్రం పాత్ర పరిమితమే ఆ 30 మున్సిపాలిటీల్లో మాత్రం మరింత కఠినంగా ఆంక్షలు ప్రార్థనా మందిరాలు , మెట్రో సర్వీసులపైనా రాష్ట్రాలకే నిర్ణయాధికారం లాక్‌డౌన్ సడలింపులపై కేంద్ర అధికారుల వెల్లడి న్యూఢిల్లీ: జూన్ 1వ తేదీ తర్వాత లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించినప్పటికీ కేంద్రం తన పాత్రను పరిమితం చేసుకుని లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలా, లేక అదనంగా మరిన్ని సడలింపులు ఇవ్వాలా అనే దానిపై నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేయవచ్చని అధికారులు శుక్రవారం […] The post ఇకపై రాష్ట్రాలకే ఎక్కువ అధికారాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కేంద్రం పాత్ర పరిమితమే
ఆ 30 మున్సిపాలిటీల్లో మాత్రం మరింత కఠినంగా ఆంక్షలు
ప్రార్థనా మందిరాలు , మెట్రో సర్వీసులపైనా రాష్ట్రాలకే నిర్ణయాధికారం
లాక్‌డౌన్ సడలింపులపై కేంద్ర అధికారుల వెల్లడి

న్యూఢిల్లీ: జూన్ 1వ తేదీ తర్వాత లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించినప్పటికీ కేంద్రం తన పాత్రను పరిమితం చేసుకుని లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలా, లేక అదనంగా మరిన్ని సడలింపులు ఇవ్వాలా అనే దానిపై నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేయవచ్చని అధికారులు శుక్రవారం తెలియజేశారు. అయితే దేశంలోని మొత్తం కేసుల్లో 80 శాతం వరకు కేసులు నమోదవుతున్న 30 మునిసిపాలిటీల్లో ని కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రం కఠిన ఆంక్షలను కొనసాగించాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచించవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, యుపి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ మునిసిపాలిటీలున్నాయి. ‘ జూన్ 1నుంచి ఆంక్షలు విధించడం, లేదా సడలించడానికి సంబంధించి కేంద్రం పాత్ర చాలా పరిమితంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే అలాంటిని ర్ణయాలు తీసుకుంటాయి’ అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పిటిఐకి చెప్పారు.

అయితే అంతర్జాతీయ విమాన సర్వీసులు, రాజకీయ సభలు, సమావేశాలతో పాటుగా మాల్స్‌ను తెరవడంపై నిషేధాన్ని మాత్రం కేంద్రం మరికొంత కాలం కొనసాగించవచ్చని, అలాగే జనం ఎక్కువగా చేరే ప్రాంతాల్లో ముఖానికి మాస్కులు ధరించడం తప్పనిసరి చేయడంతో పాటుగా సామాజిక దూరం నిబంధనలు పాటించేలా చూడాలని రాష్ట్రాలను కేంద్రం కోరే అవకాశం ఉంది. కాగా స్కూళ్లు తిరిగి తెరవడం, లేదా మెట్రో రైలు సర్వీసులను ప్రారంభించడంపై రాష్ట్రాలే నిర్ణయాలు తీసుకోవడానికి అనుబతించవచ్చు. ‘ ఇప్పటినుంచి లాక్‌డౌన్ చర్యలను ప్రతి 15 రోజులకోసారి సమీక్షించడం జరుగుతుంది. తమ అధికార పరిధిలో తీసుకునే ప్రతి నిర్ణయంలోను రాష్ట్రాలకే ప్రధాన పాత్ర ఉంటుంది’ అని ఆ అధికారి చెప్పారు. కాగా గత మార్చి 25న లాక్‌డౌన్ ప్రకటించినప్పటినుంచి మూతపడి ఉన్న ప్రార్థనా మందిరాలను తిరిగి తెరవడంపై కూడా రాష్ట్రాలే నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం అనుమతించే అవకాశం ఉందని ఆ అధికారి చెప్పారు. జూన్ 1వ తేదీనుంచి తమ రాష్ట్రంలోని అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలను తిరిగి తెరవడానికి అనుమతించాలని ప్రధాని మోడీకి లేఖ రాసినట్లు కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్ప ఇటీవల చెప్పడం తెలిసిందే. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్రంలోని ప్రార్థనా సలాలు తిరిగి తెరవడానికి అనుమతించనున్నట్లు శుక్రవారం ప్రకటించారు.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇకపై రాష్ట్రాలకే ఎక్కువ అధికారాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: