రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు….

State wise covid cases in india today

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. మహారాష్ట్రలో 24 గంటల వ్యవధిలోనే దాదాపుగా మూడు వేల కేసులు నమోదయ్యాయి. విధుల్లో ఉన్న పోలీసులను కరోనా కాటువేస్తోంది. మహారాష్ట్రలో ఒక్క రోజు వ్యవధిలో 91 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకింది. పోలీసులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 2416 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకగా 26 మంది చనిపోయారు. ప్రస్తుతం కరోనా నుంచి 969 మంది పోలీసులు కోలుకోగా 1421 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ కట్టడి చేస్తున్న 45 మంది ఆరోగ్య కార్యకర్తలపై దాడులు జరిగినట్టు పోలీసులు తెలిపారు. భారత్‌లో ఒక్క రోజే దాదాపుగా ఎనిమిది వేల కొత్త కరోనా కేసులు నమోదు కాగా 265 మంది మృత్యువాతపడ్డారు. ఇండియాలో ప్రస్తుతం 1.82 లక్షల మందికి కరోనా వైరస్ సోకగా 5186 మంది మరణించారు. ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య 61.75 లక్షలకు చేరుకోగా 3.71 లక్షల మంది మృతి చెందారు. ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్యలో తొమ్మిదోవ స్థానంలో ఉన్నామని, రానున్న 24 గంటల్లో మళ్లీ ఎనిమిది వేల కేసులు పెరిగితే ఏడో స్థానానికి భారత్ చేరుకుంటుంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2499కి చేరుకోగా 77 మంది చనిపోయారు. ఒక్క రోజు వ్యవధిలోనే తెలంగాణలో 74 కేసులు పెరిగాయని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రాల వారిగా కరోనా కేసుల వివరాలు: 

 

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కరోనా బాధితుల సంఖ్య చికిత్స పొందుతున్నవారు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
65,168 34,890 28,081 2,197
తమిళనాడు 21,184 9,021 12,000 163
ఢిల్లీ 18,549 10,058 8,075 416
గుజరాత్ 16,356 6,117 9,232 1,007
రాజస్థాన్ 8,693 2,727 5,772 194
మధ్య ప్రదేశ్
7,891 3,104 4,444 343
ఉత్తర ప్రదేశ్ 7,701 2,837 4,651 213
రాష్ట్రాలు గుర్తించిన వారు
5,491 5,491 0 0
పశ్చిమ బెంగాల్ 5,130 2,851 1,970 309
బిహార్
3,565 2,233 1,311 21
ఆంధ్రప్రదేశ్
3,461 1,112 2,289 60
కర్నాటక 2,922 1,874 997 49
తెలంగాణ
2,499 1,010 1,412 77
జమ్ము కశ్మీర్ 2,341 1,405 908 28
పంజాబ్ 2,233 222 1,967 44
ఒడిశా
1,948 889 1,050 9
హర్యానా 1,923 932 971 20
అస్సాం 1,217 1,046 164 4
కేరళ
1,209 624 575 10
ఉత్తరా ఖండ్ 749 639 102 5
ఝార్ఖండ్ 563 301 257 5
ఛత్తీస్ గఢ్ 447 344 102 1
హిమాచల్ ప్రదేశ్ 317 199 109 6
ఛండీగఢ్ 291 88 199 4
త్రిపుర 282 110 172 0
లడఖ్ 77 34 43 0
గోవా 70 28 42 0
మణిపూర్
62 56 6 0
పుదుచ్చేరీ
57 34 23 0
నాగాలాండ్ 43 43 0 0
అండమాన్ నికోబార్ దీవులు
33 0 33 0
మేఘాలయ
27 14 12 1
అరుణాచల్ ప్రదేశ్
4 3 1 0
దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ
2 1 1 0
మిజోరం 1 0 1 0
సిక్కిం
1 1 0 0
మొత్తం 1,82,507 90,338 86,972 5,186

The post రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.