రాబడి రంయ్

ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే గతం కంటే రూ.2వేల కోట్లు అధికం మొదటి త్రైమాసికం జులైతో కలిసి 14,500కోట్లు దాటిన రాష్ట్ర ఆదాయం ఎక్సైజ్, మద్యం ఆదాయం కలుపుకుంటే 6,180 కోట్లకు పైనే మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రెండేళ్ల కాలంలో ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనా నాలుగు నెలల్లో వచ్చే ఆదాయం రూ.2 వేల కోట్లకు పెరిగింది. జిఎస్‌టి అమల్లోకి వచ్చిన తరువాత రాష్ట్ర ఆదాయంలో పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. 201718 ఆర్థిక సంవత్సరంలో తొలి నాలు […] The post రాబడి రంయ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే గతం కంటే రూ.2వేల కోట్లు అధికం
మొదటి త్రైమాసికం జులైతో కలిసి 14,500కోట్లు దాటిన రాష్ట్ర ఆదాయం
ఎక్సైజ్, మద్యం ఆదాయం కలుపుకుంటే 6,180 కోట్లకు పైనే

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రెండేళ్ల కాలంలో ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనా నాలుగు నెలల్లో వచ్చే ఆదాయం రూ.2 వేల కోట్లకు పెరిగింది. జిఎస్‌టి అమల్లోకి వచ్చిన తరువాత రాష్ట్ర ఆదాయంలో పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. 201718 ఆర్థిక సంవత్సరంలో తొలి నాలు గు నెలలు గాను రూ.12,680 కోట్లు పన్నుల రూపంలో ఆదాయ ం రాగా, 201819 సంవత్సర ంలో రూ.13,700 కోట్లకు చేరి ంది. అదే ఈ ఏడాది జూలై నెలలో జిఎస్‌టిని కలపకుండానే రూ.1 3,675 కోట్ల ఆదాయం వచ్చిన ట్లు ప్రభుత్వం వర్గాలు వెల్లడించా యి. ఇక జిఎస్‌టి రూపంలో వ స్తుందని అంచనా వేస్తున్న రూ. 1000 కోట్లను కలిపితే అది రూ. 14,500 కోట్లు దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఏఫ్రిల్ నుంచి జూన్ చివరి వరకు తొలి త్రైమాసికపు రాబడులు రూ. 10,455 కో ట్లుగా ఉన్నాయి. అంటే ప్రతి నె లా రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తోంది. కాకపోతే జూలై నెలలో మాత్రం కాస్త పుంజుకుని రూ. 4 వేల కోట్లకు పైగా రాబడి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇక మద్యం, పెట్రో ఉత్పత్తుల అ మ్మకాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.6 వేల కోట్లకు పైగా పన్నుల రూప ంలో ఆదాయం వచ్చింది. జిఎస్‌టి, ఇతర పన్నుల్లో కొంత మం దకొడితనం కనిపిస్తున్నా జూలై నెలలో జిఎస్‌టి ఆదాయం పుంజుకుందని, రూ. వెయ్యి కోట్లకు పై గా రాష్ట్ర జిఎస్‌టి వచ్చే అవకాశం ఉందని వాణిజ్య పన్నుల శాఖ వ ర్గాలు చెబుతున్నాయి. గత నాలు గు నెలల పన్నుల రాబడులను పరిశీలిస్తే మద్యం, పెట్రో ఉత్పత్తు ల అమ్మకాల ద్వారా వ్యాట్ పెద్ద ఎత్తున వస్తోంది. ఈ ఆదాయంలో ప్రతినెలా పెరుగుదల కనిపిస్తోంది. మద్యం, పెట్రో ఉత్పత్తుల అమ్మకాల ద్వారా ఏఫ్రిల్ నెలలో రూ.1360 కోట్లు, మే లో రూ.1420 కోట్లు, జూన్‌లో రూ.1600 కోట్లు, జూలైలో అది రూ. 1800 కోట్లకు చేరింది.గత ఏడాది తొలి నాలుగు నెలల్లో అమ్మకాల ద్వారా రూ.5350 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అది కాస్త రూ.6180 కోట్లకు చేరాయి. గతేడాదితో పోలిస్తే మద్యం, పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు దాదాపు 15 శాతం పెరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

నాలుగు నెలల్లో రూ .7713 కోట్ల మద్యం , బీర్ల విక్రయాలు నమోదు చేసుకున్నాయి. ఈ నాలుగు నెలల్లో 1,18,73,958 పెట్టెల -మద్యంతోపాటు, 2,18,97,188 పెట్టెల బీర్లు విక్రయించినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఏడాది మద్యంపై ఆదాయపు అంచనాను రూ.12,190 కోట్లుగా ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తిస్థాయి బడ్జెట్‌లో దీనిని పెంచే సూచనలు కనిస్తిన్నాయి. కొత్త మద్యం పాలసీలో ఆ మేరకు మార్పులు చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం పాలసీతో 2216 మద్యం దుకాణాలకు లైసెన్సు ఫీజుల రూపంలో రూ.1360 కోట్లు సమకూరగా, దరఖాస్తుల రూపంలో రూ. 411 కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. ఈసారి రెట్టింపు స్థాయిలో ఆదాయం సమకూర్చుకోవాలని లక్షంగా పెట్టుకున్నారు.

State Income Increased After GST

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాబడి రంయ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: