నూతన ఎక్సైజ్ పాలసీకి కసరత్తు

new Excise policy

 

నివేదిక తయారీలో ఎక్సైజ్ అధికారులు
ఉమ్మడి జిల్లాలో బార్లు, వైన్సులు పెరిగే అవకాశం

ఆదిలాబాద్ : కొత్త ఎక్సైజ్ పాలసీకి కసరత్తు మొదలలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలసీపై దృష్టి సారించింది. జిల్లాల వారీగా నివేదిక తయారు చేసి పంపాలని జిల్లా అబ్కారీ శాఖ అధికారులను సర్కారు ఆదేశించిం ఈ నేపథ్యంలో వారు జిల్లా పరిస్థితులకు సంబంధించి నివేదిక తయారు చేసి పం ్రంచేందుకు సిద్దం అవుతున్నారు. 2017-19 ఎక్సైజ్ పాలసీ ఈ సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి మద్యం వ్యాపారుల్లో నెలకొంది.

కొత్త ఎక్సైజ్ పాలసీ అమలుకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం బార్ల సంఖ్యను పెంచేందుకు సిద్దం అవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోను బార్ల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 28 బార్లు ఉన్నాయి. ఆదిలాబాద్‌లో 12, నిర్మల్‌లో 4, భైంసా 1, కాగజ్‌నగర్‌లో 3, మంచిర్యాల 6, బెల్లంపల్లిలో 2 ఉన్నా అయితే స్టే వారీగా చూస్తే ఇచ్చో ఉట్నూర్, ఆసిఫాబాద్, చెన్నూర్, లక్సెట్టిపేట పరిధిలో ఇప్పటికే ఒక బారు కూడా లేదు. ఇటీవల ప్రభుత్వం వివిధ గ్రామ పంచాయతీలను కలిపి కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం, అదే సమయంలో శివారు గ్రామాలను పట్టణంలో విలీనం చేయ జరిగింది.

ఈ నేపథ్యంలో కొత్త మున్సిపాల్టీల్లో బార్లు ఏర్పాటు చేసేందుకు అవకాశాలు లేకపోలేదు. అదే సమయంలో పట్టణంలో గ్రా విలీనం కావడంతో జనాభా పెరిగింది. ఈ దృష్టా ఇది వరకే బార్లున్న చో మరింత జనాభా దృష్టా బార్ల సంఖ్య పెంచుతారా.. లేదా అనేక ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ప్రధానంగా నిర్మల్ జిల్లాలో ఖానాపూర్, మంచిర్యాల జిల్లాలో నస్పూర్, క్యాతన్‌పల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. ఆదిలాబాద్‌లో శివారు గ్రామాలు విలీనం అయ్యాయి. నిర్మల్ మున్సిపాలిటీలోనూ శివారు గ్రామాలు విలీనం అయ్యాయి.

వైన్స్‌లు పెరిగే అవకాశం…
కొత్త ఎక్సైజ్ పాలసీలో కేవలం వైన్ (ఏ4) షాపుల కోసం మాత్రమే లైసెన్స్ విధానం ఖరారు చేస్తారు. బార్ల ఏర్పాటు మాత్రం కొత్త పాలసీలో పరిగణలోకి తీసుకోరు. ఈ దృష్టా పాలసీ అమలుకంటే ముందే బార్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక కొత్త పాలసీలో ఉమ్మడి జిల్లా వైన్‌షాపుల సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది. కొత్త మండలాల్లో వైన్‌షాపులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ దృ ఉమ్మడి జిల్లాలో 15 నుంచి 20 వరకు కొత్త వైన్స్ పెరిగే అవకాశం లేకపోలేదు.

ప్రస్తుతం స్టేషన్ల వారీ చూస్తే ఆదిలాబాద్ 11, ఇచ్చోడ 10, ఉట్నూర్ 7, నిర్మల్ 23, బైంసా 14, ఆసిఫాబాద్ 14, కాగజ్‌నగర్ 12, మంచిర్యాల26, బెల్లంపల్లి 24, చెన్నూర్ 8, లక్సెట్టిపేట స్టేషన్ పరిధిలో 11 వైన్స్‌లు ఉన్నాయి. కొత్త మండలాల్లో వైన్స్‌లు ఏర్పాటు చేసే అవకాశం ఉండటం వ్యాపారులు వీటి పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. 2017లో నిర్వహించిన టెండర్లలో ఒక్కో షాపునకు దరఖాస్తు చేసుకునేందుకు లక్ష ఫీజు డీడీ రూపంలో చెల్లించారు. ఇది తిరిగి ఇచ్చే రుసుము కాదు. వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ప్రభుత్వానికి ఉమ్మడి జిల్లాలో టెండర్ల ద్వారానే కోట్ల రూపాయలు సమకూరాయి.

అంతా ఇన్‌చార్జీలే..
ఆదిలాబాద్ ఎక్సైజ్ పాలన అంతా ఇన్‌చార్జీలతోనే నడుస్తోంది. ప్రధానంగా ఆదిలాబాద్ ఎక్సైజ్ డివిజన్ పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం జిల్లాలు ఉన్నాయి. ఈ డివిజన్‌కు డిప్యూటి కమిషనర్ (డిసి) కార్యాలయం ఆదిలాబాద్‌లో ఉంది. ప్రస్తుతండీసీ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో నిజామాబాద్ డీసీ డేవిడ్ రవికాంత్‌ను ఇన్‌చార్జీగా నియమించారు. ఆసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) పోస్టు కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత డీసీనే ఇన్‌చార్జీగా ఏసీగా కొనసాగారు. ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీగా ఉంది.

ఇక డీపీఈవో పోస్టు కూడా ఉమ్మడి జిల్లాలో ఇన్‌చార్జీల పాలనలోనే ఉంది. ఆదిలాబాద్, నిర్మల్ డీపీఈవో పోస్టు ఖాళీగా ఉండగా ఏఈఎస్ రవీందర్‌రాజును ఈ జిల్లాలకు ఇన్‌చార్జీగా నియమించారు. మంచిర్యాల డిపీఈవో నర్సింహారెడ్డి రెండు రోజుల కింద పదవి విరమణ చేయడంతో పెద్దపల్లి డీపీఈవో రవికుమార్‌కు ఈ బాద్యతలు అప్పగించారు. ఉమ్మడి జిల్లాలో ఒక కుమురంభీంలోనే రెగ్యూలర్ డీపీఈవో రాజ్యలక్ష్మీ కొనసాగుతున్నారు.

State government’s decision on new Excise policy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నూతన ఎక్సైజ్ పాలసీకి కసరత్తు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.