స్త్రీల విద్యాభివృద్ధికి కృషి

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కెజిబివిలో ఇంటర్ విద్య ప్రారంభం మన తెలంగాణ/దిలావర్‌పూర్ : మండల కేంద్రంలోని కెజిబివిలో బుధవారం రాష్ట్ర న్యాయ గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇంటర్మీడియట్ విద్య ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్త్రీ విద్య కొరకు అనేక పథకాలను ప్రారంభించడం జరిగిందని అమ్మాయిలు అన్ని రంగాలలో రాణించినప్పుడే దేశ రాష్ట్ర అభివృద్ధ్ది సాధ్యమని తెలిపారు. పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా అన్ని […]

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
కెజిబివిలో ఇంటర్ విద్య ప్రారంభం

మన తెలంగాణ/దిలావర్‌పూర్ : మండల కేంద్రంలోని కెజిబివిలో బుధవారం రాష్ట్ర న్యాయ గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇంటర్మీడియట్ విద్య ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్త్రీ విద్య కొరకు అనేక పథకాలను ప్రారంభించడం జరిగిందని అమ్మాయిలు అన్ని రంగాలలో రాణించినప్పుడే దేశ రాష్ట్ర అభివృద్ధ్ది సాధ్యమని తెలిపారు. పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా అన్ని రంగాలలో సమాన అవకాశాలను ప్రభుత్వం కనిపిస్తుందన్నారు. బాసర సరస్వతి దేవి ఆలయం ఉన్న ఈ జిల్లాలో విద్యార్థులందరూ ఉన్నత విద్యను చదివి భవిష్యత్తులో అత్యుత్తమ రంగాలలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. సిఎం కెసిఆర్, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిల ప్రత్యేక చరవతోనే దిలావర్‌పూర్‌లోని కెజిబివి పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్య అప్‌గ్రేడ్ చేయడం జరిగిందని దీని కోరకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దిలావర్పూర్ కేజీబీవీకి రెండు గ్రూపులను ఇవ్వడం జరిగిందని త్వరలోనే పాఠశాల కొరకు ప్రత్యేక టాయిలెట్ రూమ్‌లను, సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పాల్దె లక్ష్మీ, జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ నల్ల వెంకట్రామిరెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, నిర్మల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, జిల్లా తెరాస కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ నంద అనిల్, తెరాస మండల అధ్యక్షుడు రాజేశ్వర్, జిల్లా విద్యాధికారి ప్రణీత, ఆర్డీవో ప్రసూనాంబ, మం డల విద్యాధికారి శంకర్, మండల తహసిల్దార్ నరసయ్య, కెజిబివి ప్రత్యేక అధికారిని అపర్ణ, తెరాస నాయకులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: