ఇంజక్షన్ తీసుకొని స్టాఫ్ నర్సు ఆత్మహత్య

నాచారం: ఇంజక్షన్ తీసుకొని స్టాఫ్‌నర్సు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాఘవేంద్రనగర్‌లో నివాసముంటున్న ఇసాపు రాజయ్య, పుష్ప దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు రోజా గత కొంత కాలంగా నాచారంలోని ప్రసాద్ హాస్పిటల్‌లో స్టాఫ్ నర్సు గా పనిచేస్తున్నది. రోజా తండ్రి పక్షవాతంతో బాధ పడుతున్నాడు. గురువారం ఉదయం పెద్ద అమ్మాయి చుట్టాల ఇంటికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చిన పెద్ద కూతురు […] The post ఇంజక్షన్ తీసుకొని స్టాఫ్ నర్సు ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నాచారం: ఇంజక్షన్ తీసుకొని స్టాఫ్‌నర్సు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాఘవేంద్రనగర్‌లో నివాసముంటున్న ఇసాపు రాజయ్య, పుష్ప దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు రోజా గత కొంత కాలంగా నాచారంలోని ప్రసాద్ హాస్పిటల్‌లో స్టాఫ్ నర్సు గా పనిచేస్తున్నది. రోజా తండ్రి పక్షవాతంతో బాధ పడుతున్నాడు. గురువారం ఉదయం పెద్ద అమ్మాయి చుట్టాల ఇంటికి వెళ్లింది.

సాయంత్రం ఇంటికి వచ్చిన పెద్ద కూతురు తన చెల్లిని ఎంత పిలిచినా పలకకపోవడంతో చుట్టు పక్కలవారి సహాయంతో తలుపును పగులగొట్టి పరిశీలించగా రోజా సృహ లేకుండా ఉండటంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రోజా మృతి చెందింది. రోజా అట్రాక్యూరిమ్ బిస్‌లైట్ ఇంజక్షన్ అనే మత్తు ఇంజక్షన్ తీసుకోవడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంజక్షన్ ఎవరు ఇచ్చారు, ఎలాంటి కారణాలతో రోజా చనిపోయి ఉండొచ్చుననే విషయాలు దర్యాప్తులో వెల్లడికానున్నట్లు పోలీసులు తెలిపారు.

Staff nurse suicide by taking injection

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇంజక్షన్ తీసుకొని స్టాఫ్ నర్సు ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.