ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. పాప పరిస్థితి విషమం

Government Hospital
ఖమ్మం: జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో మరో దారుణం సోమవారం ఆలస్యంగా వెలుగు వచ్చింది. ఆసుపత్రి సిబ్బంది పదో నెలలో వేయాల్సిన టీకాలను నాలుగు నెలల పసిపాపకు వేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పాప తల్లి తెలిపిన వివరాల ప్రకారం…  తన పాపకు నాలుగో నెల అని తల్లి ఎంత చెప్పిన సిబ్బంది పట్టించుకోలేదు. పది నెలలో పిల్లలకు వేయాల్సిన టీకాలను వేయడంతో పసిపాప తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా రెండు రోజులుగా నుంచి ఆసుపత్రిలోనే చిన్నారికి ఉంచి వైద్యులు చికిత్సను అందిస్తున్నట్టుగా తెలిపింది. దీంతో చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్నారు. చిన్నారికి అత్యవసర వైద్యం అందిస్తున్నామని ప్రాణాపాయం లేదని ఈ సందర్భంగా ఆసుప్రతి ఇమ్యునైజేషన్ అధికారి అలివేలు మీడియాతో వెల్లడించారు.
Staff Negligence in Khammam government Hospital

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. పాప పరిస్థితి విషమం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.