రేటు తగ్గించినా.. మార్కెట్లు కుదేలు

  ముంబై: ఆర్‌బిఐ రేట్లను తగ్గింపును మార్కెట్లు సానుకూలంగా తీసుకోలేదు. సాధారణంగా వడ్డీ రేట్లను తగ్గించినపుడు మార్కెట్లు మంచి లాభాలను నమోదు చేస్తాయి. కానీ ఈసారి సూచీలు భారీగా కుప్పకూలాయి. ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.2.22 లక్షల కోట్లు కరిగిపోయింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లు పడిపోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్, నిప్టీలు పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 40వేల మార్క్‌ను కోల్పోయింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 553.82 పాయింట్లు నష్టపోయి […] The post రేటు తగ్గించినా.. మార్కెట్లు కుదేలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబై: ఆర్‌బిఐ రేట్లను తగ్గింపును మార్కెట్లు సానుకూలంగా తీసుకోలేదు. సాధారణంగా వడ్డీ రేట్లను తగ్గించినపుడు మార్కెట్లు మంచి లాభాలను నమోదు చేస్తాయి. కానీ ఈసారి సూచీలు భారీగా కుప్పకూలాయి. ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.2.22 లక్షల కోట్లు కరిగిపోయింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లు పడిపోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్, నిప్టీలు పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 40వేల మార్క్‌ను కోల్పోయింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 553.82 పాయింట్లు నష్టపోయి 39529.72 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 11,900 దిగువన ట్రేడ్ అయ్యింది. సూచీలు ఒక రోజులో అత్యధిక నష్టాన్ని చవిచూడటం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. ఆర్‌బిఐ పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో ఈ ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు సమీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత మరింతగా నష్టాలను చూశాయి. రెపో రేటును పావుశాతం తగ్గించడం బ్యాంకింగ్, ఆర్థిక రంగాలకు ప్రతికూలంగా మారింది. దీంతో సూచీలు చివరకు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. గెయిల్ షేర్లు అత్యధికంగా 12 శాతం నష్టపోగా, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఎస్‌బిఐ షేర్లు 4 నుంచి -8 శాతం నష్లపోయాయి. కోల్‌ఇండియా, టైటాన్, హీరో మోటార్స్ తదితర షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి.
16 శాతం నష్టపోయిన డిహెచ్‌ఎఫ్‌ఎల్
డిహెచ్‌ఎఫ్‌ఎల్( దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్) షేరు మార్కెట్లో భారీగా పతనమైంది. 15.62 శాతం నష్టపోయిన షేరు ఆఖరికి రూ.94.30 వద్ద స్థిరపడింది. కంపెనీపై క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు క్రిసిల్, ఐక్రా, కేర్ రేటింగ్‌ను బాగా తగ్గించాయి. దీంతో కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. షేరు విలువ రూ. 95 వద్ద అయిదేళ్ల కనిష్టానికి పడిపోయింది.
ఎన్‌బిఎఫ్‌సిలపై స్పందించకపోవడం వల్లే..
ఆర్‌బిఐ సమీక్షలో లిక్విడిటీ అంశాన్ని ప్రస్తావించలేదు. ద్రవ్య సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్‌బిఐ పాలసీ ప్రకటనలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళన రేపిందని విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేశారు. సంక్షోభంలో కూరుకుపోయిన బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సి)ల భవిష్యత్తు ఆందోళనకంగా ఉంది. ఇది ఇతర అంశాలపై ప్రభావితం చేసిందని చెబుతున్నారు.
జిడిపి అంచనాలపై దెబ్బ
201920 ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాపై ఆర్‌బిఐ కోత విధించడం, ట్రేడ్‌వార్ భయాలు, అంతర్జాతీయంగా క్షీణించిన డిమాండ్ వంటి అంశాలపై ఆర్‌బిఐ ఆందోళన వ్యక్తం చేయడం మార్కెట్లకు నిరాశ కల్గించింది. జిడిపి వృద్ధి అంచనాలు 7.2 శాతం నుండి 7 శాతానికి ఆర్‌బిఐ తగ్గించింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ట్రేడ్‌వార్ ఆందోళన పెట్టుబడిదారుల్లో అసంతృప్తికి కారణమవుతోంది.

Staff markets loss due to down interest rates

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రేటు తగ్గించినా.. మార్కెట్లు కుదేలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: