అటెంప్ట్ చేస్తే ఆరు మార్కులు

10వ తరగతి గణితంపై కీలక నిర్ణయం

 

మన తెలంగాణ/హైదరాబాద్ : పదవ తరగతి గణితం ప్రశపత్రంలో నాలుగు ప్రశ్నలు తప్పుగా ఉన్నట్లు అధికారులు నిర్థారించారు. గణితం రెండు పేపర్లలో కలిపి 6 మార్కులు అదనంగా కలపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. ఆ ప్రశ్నలకు జవాబు రాసే ప్రయత్నం చేసిన విద్యార్థులకు మాత్రమే అదనపు మార్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 15 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఆయా కేంద్రాలకు సమాచారం అందజేశారు. పేపర్-1లో 6వ ప్రశ్నకు ఒక మార్కు, 16వ ప్రశ్నకు 4 మార్కులు, పార్ట్ బిలో 7వ ప్రశ్నకు అర మార్కు ఇస్తారు. అలాగే పేపర్2లో పార్ట్ బిలో 4వ ప్రశ్నకు అరమార్కు ఇస్తారు. మొత్తం ఆరు మార్కులు కలుపుతారు.

 

The post అటెంప్ట్ చేస్తే ఆరు మార్కులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.