హుజూర్‌నగర్‌ బిజెపి అభ్యర్థి ఖరారు…

BJPహుజూర్‌నగర్‌: నల్లగొండ జిల్లాలోని హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనుంది. ఈ నేపథ్యంలో బిజెపి అభ్యర్థిగా శ్రీకళారెడ్డి పేరును బిజెపి అధిష్టానం ఖరారు చేసింది. ఇప్పటికే కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా… ఇక టిడిపి కూడా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతోంది. దీంతో నలుగురు అభ్యర్థులు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నిక రసవత్తరంగా మారనుంది. ఈ స్థానం నుంచి మళ్లీ కాంగ్రెస్ ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తోందని టిపిసిసి ఛీప్ ఉత్తమ్ కుమార్ తెలిపారు.

Srikala Reddy likely to be BJP Huzurnagar bypoll candidate

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హుజూర్‌నగర్‌ బిజెపి అభ్యర్థి ఖరారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.