కివీస్- లంక టెస్టుకు వరుణుడి దెబ్బ

కొలంబో: శ్రీలంక న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం ప్రారంభమైన రెండో టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. వర్షం వల్ల తొలి రోజు కేవలం 36.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆటను నిలిపి వేసే సమయానికి లంక రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. టాస్ గెలిచిన లంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ లహిరు తిరిమానె (2) నిరాశ పరిచాడు. అయితే తర్వాత వచ్చిన కుశాల్ మెండిస్‌తో కలిసి కెప్టెన్ దిముత్ కరుణరత్నె ఇన్నింగ్స్‌ను కుదుట […] The post కివీస్- లంక టెస్టుకు వరుణుడి దెబ్బ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కొలంబో: శ్రీలంక న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం ప్రారంభమైన రెండో టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. వర్షం వల్ల తొలి రోజు కేవలం 36.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆటను నిలిపి వేసే సమయానికి లంక రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. టాస్ గెలిచిన లంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ లహిరు తిరిమానె (2) నిరాశ పరిచాడు. అయితే తర్వాత వచ్చిన కుశాల్ మెండిస్‌తో కలిసి కెప్టెన్ దిముత్ కరుణరత్నె ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సమన్వయంతో ఆడారు. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తున్నా కూడా వీరిద్దరూ అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచారు. లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. సమన్వయంతో ఆడిన కుశాల్ మెండిస్ 32 పరుగులు చేసి గ్రాండోమ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కరుణరత్నె ఆరు ఫోర్లతో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో లంక 10 ఆధిక్యంలో నిలిచింది.

Sri Lankan vs New Zealands Match Today

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కివీస్- లంక టెస్టుకు వరుణుడి దెబ్బ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: