రిషబ్‌పంత్ జోరు…సన్‌ రైజర్స్‌ కోచ్‌ కన్నీరు

విశాఖపట్నం: ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలు కావడాన్ని తట్టుకోలేక ఆ జట్టు ప్రధాన కోచ్ టామ్ మూడీ బోరున విలపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్ హైదరాబాద్ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఒక దశలో మూడు ఓవర్లలో 34 పరుగుల చేయాల్సిన ఢిల్లీని రిషబ్‌పంత్ ఒంటిచేత్తో గెలిపించాడు. బసిల్ థంపి వేసిన ఇన్నింగ్స్ 47వ ఓవర్‌లో రిషబ్ పంత్ రెండు ఫోర్లు, మరో రెండు భారీ సిక్సర్లతో సహా 22 పరుగులు […] The post రిషబ్‌పంత్ జోరు… సన్‌ రైజర్స్‌ కోచ్‌ కన్నీరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

విశాఖపట్నం: ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలు కావడాన్ని తట్టుకోలేక ఆ జట్టు ప్రధాన కోచ్ టామ్ మూడీ బోరున విలపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్ హైదరాబాద్ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఒక దశలో మూడు ఓవర్లలో 34 పరుగుల చేయాల్సిన ఢిల్లీని రిషబ్‌పంత్ ఒంటిచేత్తో గెలిపించాడు. బసిల్ థంపి వేసిన ఇన్నింగ్స్ 47వ ఓవర్‌లో రిషబ్ పంత్ రెండు ఫోర్లు, మరో రెండు భారీ సిక్సర్లతో సహా 22 పరుగులు దండుకున్నాడు. దీంతో అప్పటి వరకు గెలిచే స్థితిలో ఉన్న హైదరాబాద్ ఓటమి కోరల్లో చిక్కుకుంది.

ఇక, బసిల్ థంపి బౌలింగ్‌లో రిషబ్ పంత్ చెలరేగి పోతుండగా ఇక్కడ గ్యాలరీలో మ్యాచ్‌ను వీక్షిస్తున్న కోచ్ టామ్ మూడీ బోరున విలపించాడు. ఓటమి ఖాయమని తేలడంతో మూడీ తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం మూడీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌గా మారింది. మూడీ అంకిత భావాన్ని చూసి అభిమానులు ఫిదా అయ్యారు. ఇదిలావుండగా సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ కూడా జట్టు ఓటమిని తట్టుకోలేక బోరున విలపించాడు.

SRH coach Moody emotional after defeat from Delhi

The post రిషబ్‌పంత్ జోరు… సన్‌ రైజర్స్‌ కోచ్‌ కన్నీరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: