ఎన్నాళ్లకీ.. పరవళ్లు..

Sreeramsagar project

 

ఎస్‌ఆర్‌ఎస్‌పి గేట్ల ఎత్తివేత
16గేట్లను ఎత్తి దిగువ గోదారిలోకి75 వేల క్యూసెక్కుల నీటివిడుదల
నిండుకుండలా మారినశ్రీరాంసాగర్ ప్రాజెక్టు
మూడేళ్ల తర్వాత పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్న శ్రీరాంసాగర్
జెన్‌కోలో ప్రారంభమైన విద్యుత్ ఉత్పత్తి
ఆనందంలో ఆయకట్టు రైతాంగం

మూడేళ్ల నిరీక్షణకు తెర పడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన హృదయాలకు కనువిందు చేసే రోజు రానే వచ్చింది. రైతన్నలు కన్న కళలను అంచనాలకు మించి పొంగిపొ ర్లేలా 16 గేట్లను ముద్దాడుతూ దిగువకు గోదారి లోకి గలగల పారుతూ తరలిపోయిం ది. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్ర దాయినిగా పేరుగాంచిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎట్టకేలకు పూర్తి స్థాయి నీటిమ ట్టానికి చేరుకుని నిండుకుండలా మా రింది. ఎగువ నుంచి వరద పోటెత్తు తుండటంతో ప్రాజెక్టు 16గేట్లను ఎత్తి దిగువకు 75వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఆయకట్టు రైతాంగం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ప్రాజెక్టు గేట్లు ఎత్తుతున్నారని తెలసిన క్షణం నుండి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఆసక్తిగా ప్రాజెక్టు వద్దకు చే రుకోవడం మొదలైంది.

నిజామాబాద్ : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా పేరుగాంచిన శ్రీ రాంసాగర్‌ప్రాజెక్టుఎట్టకేలకుపూర్తిస్ధాయినీటిమట్టానికి చేరుకుని నిండుకుండలా మారింది.

ఆయకట్టు రైతాంగం హర్షం..
మూడేళ్ల నుండి అప్పుడా ఇప్పుడా అని ఎదురుచూసిన ఎస్పారెస్పీ ప్రాజెక్టు గేట్ల ఎత్తివే యడం వల్ల ఆయకట్టు రైతాంగం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం ప్రాజెక్టు పూర్తి స్ధాయి నీటిమట్టానికి చేరుకోలేదు. గత ఏడాది రెండు పంటలకు సరిపడా నీటిని రెండు విడతల వారిగా ప్రాజెక్టు అధికారులు విడుదల చేశారు. గత సం. 77 టీఎంసీలకు మాత్రమే నీటిమట్టం చేరుకుంది. ప్రాజెక్టు పరిధిలో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాలలో 9.60లక్షల ఆయకట్టు విస్తీర్ణం కలిగి ఉంది. ప్రాజెక్టు ఒక నిండితే రెండు మూడేళ్లు ఎండిపోవడం ఆనవాయితీగా మారింది. వర్షకాలం ప్రారంభమైన నాటి నుండి ప్రాజెక్టు నిండుతుందో లేదో అన్న అనుమానాలు రైతుల్లో ప్రతిసారి నెలకొంటుంది. ఈ సారి ప్రాజెక్టు నిండుకోవడంతో రైతులు రెండో పంటకు సిద్దమవుతున్నారు.

ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి: ప్రాజెక్టు గేట్లు ఎత్తుతున్నారని తెలసిన క్షణం నుండి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఆసక్తిగా ప్రాజెక్టు వద్దకు చేరుకోవడం మొదలైంది. సోమవారం ఉదయం నుండి ఎస్సారెస్పీకి జనాలు తండోపతండాలుగా ప్రాజెక్టును చూడటానికి చేరుకున్నారు. యువతి, యువకులు ప్రాజెక్టుపై తిరుగుతూ సెల్ఫీలు దిగుతున్నారు. వివిధ జిల్లాల నుండి తరలివచ్చిన పర్యాటకులతో ప్రాజెక్టు సందడిగా మారింది. ఈ సందర్భంగా పోలీసు శాఖ గట్టి భద్రత ఏర్పాట్లు చేసింది.

జెన్‌కోలో ప్రారంభమైన విద్యుత్ ఉత్పత్తి: తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని జెన్‌కో అదికారులు వెల్లడించారు. ప్రాజెక్టు నుండి ప్రధాన కాలువైన కాకతీయ కాలువకు 6వేల క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతున్నందున నాలుగు టర్బయిన్‌లతో ఆ నీటిని వినియోగించుకుని విద్యుత ఉత్పత్తి అవుతుందని ఇంచార్జీ డీఈ శ్రీనివాస్ తెలిపారు. ఒక టర్బయిన్‌లతో ఆ నీటిని వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఇంచార్జీ డీఈ శ్రీనివాస్ సోమవారం తెలిపారు.

Sreeramsagar project filled up with water

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎన్నాళ్లకీ.. పరవళ్లు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.