క్రీడలు స్నేహసంబంధాలను పెంపొందిస్తాయి…

  సుబేదారి: క్రీడలు మానసిక ప్రశాంతతో పాటు స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ అన్నారు. శుక్ర వారం హన్మకొండ జనవహార్‌లాల్ నెహ్రూ మైదానంలో వరంగల్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలను సిపి రవీందర్ ప్రారంభించారు. ముందుగా జర్నలిస్ట్ టీంలను సిపి పరిచయం చేసుకొని టాస్ వేసి క్రికెట్ క్రీడను లాంఛనంగా ప్రారంభించారు. సీనియర్ జర్నలిస్ట్ బిఆర్ లెనిన్ బౌలింగ్ చేయగా సిపి బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం సిపి […] The post క్రీడలు స్నేహసంబంధాలను పెంపొందిస్తాయి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సుబేదారి: క్రీడలు మానసిక ప్రశాంతతో పాటు స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ అన్నారు. శుక్ర వారం హన్మకొండ జనవహార్‌లాల్ నెహ్రూ మైదానంలో వరంగల్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలను సిపి రవీందర్ ప్రారంభించారు. ముందుగా జర్నలిస్ట్ టీంలను సిపి పరిచయం చేసుకొని టాస్ వేసి క్రికెట్ క్రీడను లాంఛనంగా ప్రారంభించారు. సీనియర్ జర్నలిస్ట్ బిఆర్ లెనిన్ బౌలింగ్ చేయగా సిపి బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం సిపి రవీందర్ మాట్లాడుతూ… జర్నలిస్టు మిత్రులు నిత్యం వార్తల కోసం టెన్షన్‌గా ఉంటారని, వారికి రోజు ఒక యుద్ధంగా ఉంటుందని, మానసిక ఒత్తిడి తగ్గించేందుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. కొందరు కుటుంబాలను కూడా లెక్కచేయకుండా వృత్తి కోసం జీవితాన్ని త్యాగం చేస్తారన్నారు.

జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా నిలిచి, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు తోడ్పడతారన్నారు. సామాజిక మార్పు కోసం జర్నలిస్టులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం జర్నలిస్టుల కోసం క్రీడలు నిర్వహించడం వల్ల ప్రశాంత జీవితం గడపవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో వార్తా సేకరణలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వీరు మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ప్రతి సంవత్సరం ప్రెస్‌క్లబ్ సభ్యులు పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి సభ్యుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. చెక్ క్యారమ్స్, వాలీబాల్, బ్యాడ్మెంట్ తదితర క్రీడలు ఈనెల 20వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు.

మొదటి మ్యాచ్ కెమెరామెన్ల జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, కోశాధికారి బొమ్మినేని సునీల్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు వల్లాల వెంకట్మ్రణ, అనిల్‌కుమార్, గడ్డం రాజిరెడ్డి, గడ్డం కేశవ మూర్తి, మదన్‌మోహన్, రజినీకాంత్, అరుణ్‌కుమార్, సుంకరనేని నర్సయ్య, స్పోర్ట్ కమిటీ కన్వీనర్ అర్షం సదానందం, ఉపాధ్యక్షుడు గోకారపు సుధీర్, సంయుక్త కార్యదర్శి రంజిత్‌కుమార్, కార్యవర్గ సభ్యులు సుధాకర్, గొర్రె సంజీవ్, శ్రీకాంత్, దిలీప్, డిడి శ్రీనివాస్, రమేష్, కట్ట రాజు తదితరులు పాల్గొన్నారు.

Sports will promote friendship

Related Images:

[See image gallery at manatelangana.news]

The post క్రీడలు స్నేహసంబంధాలను పెంపొందిస్తాయి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: