అమ్మకు అన్నీ సందేహాలే!

  ఆడుతూ పాడుతూ ఆకాశమే సరిహద్దుగా ఉండే అమ్మాయికి అమ్మ కాగానే ఎక్కడలేని పెద్దరికం వచ్చేస్తుంది. తన ఒడిలో చేరిన ముద్దు పాపాయి ప్రతి చిన్న చేష్టలకీ, పలకరింపులకీ మురిసిపోయే అమ్మకు ప్రతి విషయమూ ఆందోళనే. పిల్లలు కాస్త ఏడ్చినా, తక్కువ సేపు నిద్రపోయినా, పాలు తాగక మారాం చేసినా అన్నింటికీ భయమే. ఇతరుల పిల్లలతో తమ పాపాయిని సరిపోల్చుకుని కంగారు పడిపోతూ ఉంటారు. పాపాయితో హాయిగా గడపవలసిన కాలాన్ని అర్థం లేని భయాలు ఊహించుకుని ఆందోళన […] The post అమ్మకు అన్నీ సందేహాలే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆడుతూ పాడుతూ ఆకాశమే సరిహద్దుగా ఉండే అమ్మాయికి అమ్మ కాగానే ఎక్కడలేని పెద్దరికం వచ్చేస్తుంది. తన ఒడిలో చేరిన ముద్దు పాపాయి ప్రతి చిన్న చేష్టలకీ, పలకరింపులకీ మురిసిపోయే అమ్మకు ప్రతి విషయమూ ఆందోళనే. పిల్లలు కాస్త ఏడ్చినా, తక్కువ సేపు నిద్రపోయినా, పాలు తాగక మారాం చేసినా అన్నింటికీ భయమే. ఇతరుల పిల్లలతో తమ పాపాయిని సరిపోల్చుకుని కంగారు పడిపోతూ ఉంటారు. పాపాయితో హాయిగా గడపవలసిన కాలాన్ని అర్థం లేని భయాలు ఊహించుకుని ఆందోళన పడుతూ ఉంటారు.

ఈ భయాలు సందేహాల పట్ల కాస్త అవగాహన ఉంటే అంతా ప్రశాంతమే అంటారు నిపుణులు.పిల్లలందరిలో ఎదుగుదల ఒకే మాదిరిగా ఉండదు. తన పాపాయితో పాటు పుట్టిన ఇతరుల పిల్లల్ని చూస్తూ తమ బిడ్డల్లో ఆ దశని ఊహిస్తారు తల్లులు. కానీ పేరెంట్‌గా ఈ పోటీతత్వం ప్రమాదం అంటారు చైల్డ్ సైకాలజిస్టులు. ఒకే వయసు పిల్లలైనా వారి మానసిక వికాసంలో హెచ్చు తగ్గులుండటం సహజం. ఒకొళ్లలో ఒకొక్క నైపుణ్యం ఉంటుంది. కొందరు చాలా తొందరగా బోర్లా పడతారు. తల్లిని గుర్తించి నవ్వుతారు. మాటలు త్వరగా వస్తాయి. నడక ఆలస్యం కావచ్చు, త్వరగా రావచ్చు. కొందరు పాకి ముందుకు వెళతారు.

కొందరు పిల్లలు కూర్చునే ముందుకు జరుగుతారు కనుక పిల్లలు తమకు సొంతమైన నైపుణ్యాలు కలిగి ఉంటారని, వారికి ఇతరులతో పోలిక వద్దని తెలుసుకోవాలి తల్లులు. అసలు తమ పాపాయి ఏం చేస్తుంది? ఆమె పెరుగుదల ఎలా ఉంది అన్న విషయమై ఫోకస్ చేస్తే చాలు. ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు, పెద్దవాళ్లు, అనుభవం ఉన్న వాళ్ల సలహాతో పిల్లల పెంపకం చాలా ఈజీ అవుతుంది. ఎవరి పాప వాళ్లకి అసాధరణం అనిపిస్తుంది. డాక్టర్ సలహాతో తాము తెలుసుకున్న పద్ధతిలో బిడ్డలు పెరగాలి అనుకోవటం మంచిదే.. ఒక్కసారి తల్లికి తాను ఒక్కతే బాధ్యత తీసుకోవటం తీవ్రమైన అలసట అనిపించవచ్చు. పర్‌ఫక్ట్ పేరెంట్ అనిపించుకోవాలనే ఉబలాటంతో బిడ్డ పెంపకంలో ఇంకొకళ్ల సాయం వద్దనుకుంటేనే వచ్చే సమస్య ఇది.

తల్లి కావటం ఒక పరిపూర్ణమైన బాధ్యత. బిడ్డ పెంపకం తల్లి మాత్రమే తీసుకోవలసిన అవసరం కూడా. కానీ ఇతరుల సపోర్ట్ కూడా ఉంటేనే అదిసాధ్యం. బిడ్డ పుట్టాక తల్లి శరీరం ఎన్నో మార్పులకు గురవుతుంది. శరీర బరువు ఆకృతిలో మార్పులు కనిపిస్తాయి. పూర్తిగా బిడ్డ పైనే దృష్టి కేంద్రీకరించి వ్యక్తగతమైన జీవితం,శరీరం నిర్లక్షం చేస్తే అది అదనపు భారం కావచ్చు. జీవిత భాగసామి ఇంట్లో సభ్యులు,స్నేహితులు సాయం తీసుకుని ఈ పాపాయి పెంపకంతో పాటు తమ శరీర ఆరోగ్యం కూడా చక్కగా కాపాడుకోవాలి.

పిల్లల ఎదుగుదలలో ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. లేచి నిలబడే ప్రయత్నం, కింద పొరాడే ప్రయత్నం, మంచం పట్టుకుని నడవటం వంటి ఫీట్లు చాలా సహజం. అతిగా వాళ్లపైనే దృష్టి పెట్టి వాళ్లు పడిపోతారేమో నని భయపడుతూ కూర్చుంటే పిల్లల పెరుగుదలకే ఆటంకం కలిగించినవాళ్లు అవుతారు కూడా. పడిపోతారని ఎత్తుకు కూర్చుంటానంటే పిల్లలు నడవడం నేర్చుకునేదెట్లా? ఇంట్లో డాక్టర్ నంబర్లు పెట్టుకుని తీరాలి. పిల్లలకు ఈ ఎదుగుదల క్రమంలో చిన్న ప్రమాదాలు జరగొచ్చు. పిల్లలకు పోషకాలు అందించే క్రమంలో తల్లులు చాలా భయాలకు లోనవుతారు.

బాటిల్ ఫీడింగ్ అయితే మరీ భయపడతారు. ప్రతిసారి ఒకే సారి పాలు తాగలేకపోవచ్చు. ఇంకా ఆకలితో ఏడ్చి రాగాలు తీయవచ్చు. ఆహార వేళలు మారిపోతూ ఉండచ్చు. బిడ్డకు ఇవ్వగలిగే ఆహారం విషయంలో పూర్తి శుభ్రత, పోషకాలు విషయం శ్రద్ధ తీసుకోవచ్చు. చక్కని నిద్ర, హాయిగా ఆడుకోవటం, మొదలైనవి సహజంగా జరిగితే పాపాయి విషయంలో భయ పడవలసింది ఏమి లేదు.

పిల్లలు హాయిగా పెరుగుతారు. అది ప్రకృతి ధర్మం కూడా. వాళ్లు తొలి రోజుల్లో ఎక్కువ నిద్ర పోతారు. నెమ్మదిగా నిద్ర తగ్గుతుంది. చాలా వేగంగా పెరుగుతారు. ఈ క్రమంలో అమ్మ స్థానం అమ్మదే. కానీ అమ్మకు తోడుగా అందరూ ఉంటే పాపాయి పెంపకం తేలిక అవుతుంది. అనవసరమైన ఆలోచనలతో అమ్మ ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది.

Spiritual relationship between Mother and small kids

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అమ్మకు అన్నీ సందేహాలే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.