తెలంగాణ కవిత్వ శిఖరం

  శరీరం కోసం/భూమి వదిలిన వాడికి/భూమి మీద ప్రేమ వున్నటా/శరీరం మీద ప్రేమ వున్నటా. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పగలరు? ఇలాంటి దుస్థితికి కారణం ప్రపంచీకరణ అనే మాట చెప్పి వదిలేద్దమా. నా దృష్టిలో దీనికి రెండే కారణాలు ఒకటి మనిషి ఆలోచన పద్ధతి మారడం, బంధాల కన్న డబ్బుకు ప్రాముఖ్యత ఇవ్వడం. మరొకటి ఏమీ చేయలేని నిస్సహాయత. కవి మాత్రం నిరంతరం ఊరి పక్షమేనని, ఊరి ప్రజల కోసమే ఉంటారని సిద్ధారెడ్డి గారు దృఢంగా, […] The post తెలంగాణ కవిత్వ శిఖరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

శరీరం కోసం/భూమి వదిలిన వాడికి/భూమి మీద ప్రేమ వున్నటా/శరీరం మీద ప్రేమ వున్నటా. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పగలరు? ఇలాంటి దుస్థితికి కారణం ప్రపంచీకరణ అనే మాట చెప్పి వదిలేద్దమా. నా దృష్టిలో దీనికి రెండే కారణాలు ఒకటి మనిషి ఆలోచన పద్ధతి మారడం, బంధాల కన్న డబ్బుకు ప్రాముఖ్యత ఇవ్వడం. మరొకటి ఏమీ చేయలేని నిస్సహాయత. కవి మాత్రం నిరంతరం ఊరి పక్షమేనని, ఊరి ప్రజల కోసమే ఉంటారని సిద్ధారెడ్డి గారు దృఢంగా, బలంగా ఎలాంటి అనుమానం, సందేహం లేకుండా ప్రకటించారు. భూమికి తడి లేదు, గుండెకు తడి లేదు ఇప్పుడు మాటకు కూడా తడి లేకుండా పోతోందని కవి బాధపడతారు. పుస్తకం పేరులోనే తెలుసుకోవచ్చు ఇందులో నీటి గురించి ప్రస్తావన ఎక్కువగా కనపడుతుంది. ఒకచోట నీరు దేనైన కడుగుతుంది అంటారు. మరొక చోట కత్తితో నీటిని కోయగలరా అని ప్రశ్నించారు. చివరికి నాది నీటి భాష అని చెప్పుకొని తాను ఎప్పటికీ ప్రజా కవినే, నీటి కవినే, నదికవినేనని చెప్పుకున్నారు.

రాజ్యానికి మంచి పాలన అందివ్వాలంటే మంచి రాజు కావాలి. మంచి రాజుకు సలహాలు ఇచ్చే మంత్రి, సైనికుడు, కవి కావాలి. కవి అన్నవాడు రాజ్యంలోని లోటు పాట్లు చెప్పినప్పుడే రాజు ఆ లోటు పాట్లను సరి దిద్దుకుంటూ రాజ్యానికి సుపరిపాలన అందివ్వగలడు. సాహిత్యకారులు రెండు రకాలు. మొదట రకం వారు రాజ్యాన్ని కీర్తించడానికే ఉండేవారు. రెండో రకం కవులు ప్రజల పక్షం వహించినవారు. అన్నమయ్యను గమనించండి భక్తి మార్గంలో ప్రజల మధ్య ఉన్న అనేక సమస్యలను ఎత్తి చూపారు. పంచభూతాలు అందరికీ సమానమేనని, రాజు, ప్రజలు ఒకటేనని చాలా కీర్తనల్లో ప్రకటించారు.

కవి ఏకైక లక్ష్యం పీడితుల పక్షాన నిలబడటమే, సమాజంలో అస్పృశ్యత ఉండకుండా చేయడమే, అందరూ సమానమని చెప్పడమే. వస్తువు సమాజహితం అయినప్పుడు మాత్రమే కవి కలకాలం ప్రజల్లో ఉండగలడు. సాహిత్యమనేది ఒక డిగ్రీ కాదు అదొక నిరంతరమైన ప్రవాహం. అక్షరంతో మొదలైన ప్రతి కవి చివరి శ్వాస వరకు అక్షరాలతో నిలబడగలగాలి అప్పుడే తన జీవితం పరిపూర్ణం అవుతుంది.

కవిత్వం ప్రజలకు దూరం అవుతోంది. ఇది ప్రజల తప్ప కవుల తప్ప అని విశ్లేషించుకుంటే ముమ్మాటికి కవుల పొరపాటే. గేయ కవిత్వం, మౌలిక కవిత్వం మరుగున పడిపోయింది. అలాంటి కవిత్వం రాస్తున్నవారికి విలువ లేకుండా పోయింది. నేడు గద్దర్, వంగపండు, గోరేటి వెంకన్న లాంటి కవుల వారసులు కనపడటం లేదు. కవిత్వాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లి చైతన్యం తీసుకురావడమే కాకుండా ప్రజల కష్టాలను ప్రభుత్వాలకు చేరవేయడానికి వారధులుగా ఉండేవారు. నేడు అలాంటి పరిస్థితి కనపడటం లేదు.

ప్రభుత్వాలు సాహిత్యాన్ని విస్మరించాయి. కలాలను, గళాలను తొక్కేశాయి. దోపిడీ వర్గ ప్రభుత్వాలు పీడిత ప్రజలవైపు నిలబడటం లేదు. పీడితుల పట్ల నేటి కవులు అక్షరాల మేరకే నిలబడగలుగుతున్నాడు కానీ ప్రజల మధ్య తిరగటం, పోరాటం చేయడం లేదు. కవి సమ్మేళనాలలో సాధారణమైన ప్రజల భాగస్వాములు కావడం లేదు. ఎందుకంటే కవిత్వం ఊహాజనితమై సాధారణమైనవారికి అర్థం కానీ రీతిలో పతనమైపోయింది. ఇప్పటికీ కొంతమంది కవులు ప్రజల మధ్య ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. కొందరు సఫలం అవుతున్నారు. అలాంటి కవుల్లో ఒకరైన నందిని సిధారెడ్డి గారు. ఎంత ఎదిగినా పల్లె వాసనను, యాసను వదలలేదు. ఈ మధ్య వారి ఎనిమిదో కవిత్వ సంపుటి నీటి మనసు పేరుతో తెలుగు సాహిత్యలోకానికి పరిచయం చేశారు. మెదక్ జిల్లా బందారం గ్రామంలో 1955లో జన్మించారు. సిధారెడి గారి తండ్రి గారు బాలసిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధులు.

బందారం, వెల్కటూరు, సిద్ధిపేటలలో చదువు ముగించుకుని హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ పూర్తిచేసి ’ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు’అనే అంశంపై ఎం.ఫిల్ (1981) పట్టా పొందారు. ఆ తర్వాత ’ఆధునిక కవిత్వం, వాస్తవికత – అధివాస్తవికత’ పై పరిశోధన చేసి పి.హెచ్.డి (1986) పట్టా పుచ్చుకున్నారు. నిరంతరం సాహిత్య కృషి చేస్తున్న కవితా ప్రవాహమే నందిని సిధారెడ్డి గారు.

1997 ఆగస్టులో కేవలం ఒకే ఒక గంట వ్యవధిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం – ఆవశ్యకతపై సిద్దారెడ్డి గారు రచించిన కవితే ‘నాగేటి చాల్లల్ల‘ కవితగా ప్రసిద్ధి చెందింది. ఇదే కవితను ‘పోరు తెలంగాణ‘ సినిమాలో పాటగా తీసుకున్నారు. అదే పాటకు నంది అవార్డు కూడా అందుకున్నారు.

అందెశ్రీ గారు రచించిన జయజయహే తెలంగాణ, గోరేటి వెంకన్నగారు రచించిన ‘గానమా తెలంగాణమా‘ పాటలకంటే ముందే సిధారెడ్డి తెలంగాణపై కవిత రచించారు. ముందు చెప్పినట్టు మౌళిక సాహిత్యం ప్రజల్లో నిలుస్తుంది. అందుకే నందిని సిధారెడ్డి గారు ప్రజాకవి, శ్రామిక వర్గ కవి, పీడిత ప్రజల కవి, పల్లె కవి, మట్టి కవి. దేశ దేశాలు తిరిగిన వారు ఇటీవల విడుదల చేసిన నీటి మనుసులో కవితా సంపుటి మొత్తం ఊరు గురించి, ఊరి ప్రజల గురించే కవిత్వంగా మలిచారు.

నీటి మనసు కవితా సంపుటిలో నా కలలు నావి అనే శీర్షికతో తొలి కవిత మొదలౌతుంది. ఈ కవితలో కవి ఇలా అంటారు సగం జీవితం నిద్రలేదు/ఏ కవికయినా సగం నిద్రే అన్నారు. రవి కాంచని చోట కవి్ కాంచును అని ఊరకే అనలేదు. కవి నిరంతరం కాలాన్ని తన కవిత్వంతో రికార్డు చేస్తూ ఉంటాడు. అందుకే కవికి పూర్తి నిద్ర ఎప్పటికీ ఉండదు. కవి, సైనికుడు ఇద్దరు ఒకటే, ఒకరేమో దేశ సరిహద్దులో మరొకరు దేశంలో. అదే విషయాన్ని సిధారెడ్డి గారు స్పష్టం చేశారు. కలలను కన్నీళ్లు కప్పెస్తున్నాయి‘ అనడంలో బీదరికపు కలలు ఎలా చెదిరిపోతున్నాయో చెప్పే ప్రయత్నం చేశారు కవి. అయినా కనే కలలు నావే ఎవరి కల వారిదే అందులో పోటీ ఏముంది? నా కలల పేటెంట్ హక్కులు నావేనని ప్రకటించడంలో అబ్దుల్ కలాం గారు అన్నట్లు కలలు కనాలి వాటిని సాకారం చేసుకోవాలి మన కలలు మనవే వాటిపై హక్కులు మనవే కలలను సహకారం చేసుకోవాల్సిన బాధ్యత మనదే.

శరీరం కోసం/భూమి వదిలిన వాడికి/భూమి మీద ప్రేమ వున్నటా/శరీరం మీద ప్రేమ వున్నటా. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పగలరు? ఇలాంటి దుస్థితికి కారణం ప్రపంచీకరణ అనే మాట చెప్పి వదిలేద్దమా. నా దృష్టిలో దీనికి రెండే కారణాలు ఒకటి మనిషి ఆలోచన పద్ధతి మారడం, బంధాల కన్న డబ్బుకు ప్రాముఖ్యత ఇవ్వడం. మరొకటి ఏమీ చేయలేని నిస్సహాయత. కవి మాత్రం నిరంతరం ఊరి ని, ఊరి ప్రజల కోసమే ఉంటారని సిధారెడ్డి గారు దృఢంగా, బలంగా ఎలాంటి అనుమానం, సందేహం లేకుండా ప్రకటించారు.

భూమికి తడి లేదు, గుండెకు తడి లేదు ఇప్పుడు మాటకు కూడా తడి లేకుండా పోతోందని కవి బాధపడతారు. పుస్తకం పేరులోనే తెలుసుకోవచ్చు ఇందులో నీటి గురించి ప్రస్తావన ఎక్కువగా కనపడుతుంది. ఒకచోట నీరు దేనైన కడుగుతుంది అంటారు. మరొక చోట కత్తితో నీటిని కోయగలరా అని ప్రశ్నించారు. చివరికి నాది నీటి భాష అని చెప్పుకొని తాను ఎప్పటికీ ప్రజా కవినే, నీటి కవినే, నదికవినేనని చెప్పుకున్నారు.

అరవటానికేం కీచురాయి కూడా అదేపనిగా అరుస్తుంది కాని మౌనంలో నిశబ్ద సౌందర్యం ఉన్నదని బోధ చేశారు. మౌనం కూడా ఒక వ్యూహమే, మౌనాన్ని తక్కువగా చూసేవారు అందులో సౌందర్యాన్ని ఎలా చూడగలరు. అందమైన మౌనం విస్పోటనం చెందాలి అందులో నుండి ప్రశ్నలు పుట్టాలి. ప్రశ్నలు శ్రామిక వర్గం వైపు నిలబడాలి. అప్పుడే సౌందర్యాత్మక నిశ్బబ్ద మౌనానికి విలువ ఉంటుంది. సిధారెడ్డి గారు నగర జీవితాన్ని ఆహ్వానిస్తూనే అడుగడుగునా పల్లె కోసం, పల్లె ప్రజల కోసం, పల్లె వాసన కోసం ఆరాటపడతారు. ఉస్మానియా గురించి రాసిన కవితలో రెక్కలల్లార్చుకుంటూ స్వప్నాలు ఎగిరొచ్చి/మానవుల రూపంలో విహరిస్తుంటాయి ఇక్కడ జీవికి స్వప్నం సహజం ఆ స్వప్నం సహకారం చేసుకోవాలంటే ఒక విద్యాలయంలోనే కుదురుతుంది. విద్యాలయాలు స్వప్నాలకు రెక్కలు తొడగాలి స్వేచ్ఛగా విహరించేలా చేయాలి. కాని విద్యాలయాలు కులాలు, మతాలు పేరుతో విడిపోతున్నాయి. వివక్ష అక్కడే మొదలౌతోంది. విద్యార్థులను ఉగ్రవాదులుగా చూస్తున్న ప్రభుత్వాల ధోరణి మారాలి. మనుషులు ఉన్నా దాంతో సంతోషపడరు. ఎదో కావాలి సరే కావాలంటే శ్రమ చేయవచ్చు. ఏది కావాలో అది సంపాదించుకోవచ్చు. కానీ నాకు లేనిది వాడికి ఎందుకు ఉంది. వాడి జీవితమే బాగుంది. ఎదుటివారు అదృష్టవంతుడు అనే భావనలో సంతోషానికి దూరమౌతున్నాడు. అదే విషయాన్ని స్వగతాలు కవితలో చెప్పారు.

కవి అనుభవించిన సందర్భాన్ని వస్తువుగా స్వీకరించినప్పుడు వస్తువును కవిత్వం చేయడమే కాదు. సమాజానికి అన్వయించాలి. వస్తువు కవిత్వంగా మార్చి సమాజానికి అందించడానికి కవి దగ్గర శిల్ప నైపుణ్యం ఉండాలి. అలాంటి గొప్ప నైపుణ్యం ఉన్న కవి సిధారెడ్డి గారు. సిగ్నల్, ఒక కాలం, ముఖం, అంతరం లాంటి కవితల్లో ఆ నైపుణ్యాన్ని గమనించవచ్చు. సిధారెడ్డి గారు కొన్ని చోట్ల వ్యవస్థను దెప్పిపొడిచారు, వ్యంగ్యంగా ప్రశ్నించారు. వీరి కవిత్వం నవరస భరితం కానీ పీడిత పక్షమే ఎక్కువగా కనపడుతుంది.

ఎరుక కవితలో మనుషుల వ్యక్తిత్వాల గురించి చర్చించారు. మనం స్నేహ హస్తం అందించిన కొంతమంది ఏ విధంగా ద్రోహం చేస్తారో చెప్పారు. వాగు వలే స్వాగతిస్తాను అనడంలో సమస్తాన్ని ఆహ్వానించాలన్న ది కవి ఆలోచన. అలా స్వాగతించే వారికి కొందరు గోతులు ఎలా తీస్తారో చెప్పి మదన పడతారు. పాత ఊరిలా పలకరిస్తాను అనడంలో స్వచ్ఛత, గౌరవం, మర్యాద ఉంటాయని చెప్పడమే. అలాంటి వారిపై ఈటెలు విసురుతారని ఆక్రోశించారు. అణువణువున పట్టణ జీవితాన్ని వివరిస్తూనే పల్లె గొప్పతనాన్ని తెలియజేశారు. ఇందులో వస్తువులు దాదాపుగా అందరి జీవితాల్లో ఉన్నవి, జరిగేవే కావడం చేత పుస్తకం సాధారణమైన రీడర్ కి కూడా చేరుతుంది. ఉదాహరణకు స్థితి కవితలో చిన్నప్పుడు ఆకాశంలో విమానం పోతున్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి చూసేవాడిని.

ఇప్పుడేమో విమానం కూడా పాత బస్సులా శబ్దం చేస్తూ ప్రయాణం చేస్తున్నది అన్నారు. ఇలాంటి సందర్భాలు చాలామంది అనుభవించే ఉంటారు. భాష విషయంలో ముందుగా చెప్పినట్టే సిధారెడ్డి గారు అచ్చ తెలుగు పల్లె కవి. అందులోనూ తెలంగాణ కవి ఆ యాస కనపడుతుంది. కవిత్వం విషయంలో కవి తాను పరుగులు పెట్టారు మనల్ని పరుగు పెట్టించారు. కూర్చోపెట్టి నిదానంగా, వివరంగా కవిత్వ ముద్దలను తినిపిస్తారు. వస్తువు కోసం కానీ, కవిత్వం కోసం కానీ అ సహజత్వాన్ని చొప్పించలేదు. కవి వాక్యాలు నిర్మించడానికి ప్రయత్నం చేయలేదు కవిత్వాన్ని నడిపించడమే లక్ష్యంగా పెట్టుకోవడం కనపడుతుంది.

Special story on Telangana poet Nandini Sidda Reddy

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తెలంగాణ కవిత్వ శిఖరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: