గోరింట పూసిందీ..

  ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు.. గోరింటాకు గుర్తుకు వస్తుంది. అమ్మాయిలకు మంచి నేస్తం. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరాలంటూ పెద్దలు చెబుతూ ఉంటారు. చేతికి పెట్టుకున్న తర్వాత ఎవరిది ఎంత ఎర్రగా పండిందో చూసుకుని మురిసిపోతుంటారు. చేతిని అందంగా పండించే గోరింటాకు వల్ల ఆరోగ్యానికి, అందానికి కూడా అనేక లాభాలున్నాయి. జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. […] The post గోరింట పూసిందీ.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు.. గోరింటాకు గుర్తుకు వస్తుంది. అమ్మాయిలకు మంచి నేస్తం. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరాలంటూ పెద్దలు చెబుతూ ఉంటారు. చేతికి పెట్టుకున్న తర్వాత ఎవరిది ఎంత ఎర్రగా పండిందో చూసుకుని మురిసిపోతుంటారు. చేతిని అందంగా పండించే గోరింటాకు వల్ల ఆరోగ్యానికి, అందానికి కూడా అనేక లాభాలున్నాయి. జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు… ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడవకుండా రోజుని దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది.

ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటాకును కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. గోరు పుచ్చిపోవడం, ఏదైనా దెబ్బతగిలి ఇన్ఫెక్షన్ సోకడం వంటివి జరిగినప్పుడు గోరింటాకు ముద్దని గోరుకు తరుచూ పెట్టుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. కొందరికి అరికాళ్లు మండుతూ ఉంటాయి. అప్పుడు కూడా గోరింట పేస్టును రాయాలి. మంట తగ్గి కాస్త ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులకు కూడా గోరింట ముద్ద బాగా పనిచేస్తుంది. గోరింటాకు బెరడు, విత్తనాలు జ్వరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. విత్తనాలు విరేచనాలను తగ్గిస్తాయి. గోరింటాకు ముద్దని మాడుకి తగలేలా రాసుకుంటే వెంట్రుకలు రాలడం కూడా తగ్గి జుట్టు బాగా పెరుగుతుంది. తెల్లబడిన వెంట్రుకలకు రంగు వేయడం కన్నా వారానికోసారి గోరింట పెట్టుకుంటే సహజసిద్ధంగా నల్లగా మారతాయి.

మహిళలు ఎంతో ఇష్టపడే గోరింటాకులో ఎన్నో ఔషధగుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఏదైనా పండగ వచ్చేస్తే చేతినిండా గోరింటాకు పెట్టుకునే మహిళలకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవని వారు చెబుతున్నారు. కంటికి కనిపించని సూక్ష్మ క్రిములను గోరింటాకు నశింపజేస్తుంది. గోరింటాకును నెలకొక్కసారి చేతికి పెట్టుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలెర్జీలకు దూరంగా ఉంచుతుంది ఈ ఆకు. కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల బోదకాలు వ్యాధి -ఏనుగు కాలు (లింఫాటిక్ ఫైలేరియాసిస్) దరిచేరదంటారు. అంతేకాకుండా ఆటలమ్మ మచ్చలు పోగొట్టాలంటే గోరింటాకు బాగా నూరి మచ్చలపై పూస్తే సరిపోతుంది. వేడిగడ్డలను సైతం గోరింటాకు నయం చేస్తుంది. అలాగే నెలకోసారి గోరింటాకు పేస్ట్‌తో తలకు ప్యాక్ వేసుకుంటే.. జుట్టు బలపడుతుంది. జుట్టు రాలడానికి చెక్ పెట్టవచ్చు. చుండ్రును దరిచేరనివ్వదు. మృదువైన జుట్టు సొంతం అవుతుంది. సహజసిద్ధంగా రంగు వేసుకోవడానికి అనువుగా ఉండే ఆకు ఇది.  ఇన్ని ప్రయోజనాలున్న గోరింటాకును పెట్టుకుంటే వర్షాకాలంలో వచ్చే రోగాలను దూరం పెట్టవచ్చును. మార్కెట్‌లో దొరికే మెహందీ కోన్‌ల కంటే ఆకును నూరి చేతులకు, కాళ్లకు పెట్టు కుంటేనే మంచిదని చెబుతున్నారు నిపుణులు.

Special Story On Mehandi in Ashada Masam

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గోరింట పూసిందీ.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.