ఫేస్‘బుక్’ అవుతున్నారా?

Facebook

 

ఇప్పుడు ఏదైనా విషయం వేగంగా బయటకు తెలియాలంటే ఫ్లాట్ ఫామ్ పేస్ బుక్.. యూత్ ఎక్కువగా గడుపుతున్న ప్రపంచం వాట్సాప్… సరదా కోసమో లేక కాలక్షేపం కోసమో వాడుతున్న సోషల్ మీడియా సొసైటీకి ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది. వీటివల్ల మంచి జరుగుతు న్నా.. మరో కోణంలో ఎన్నో కుటుంబాలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేలా చేస్తున్నది. పదే పదే సామాజిక ప్రమాదాలకు కారణమవుతున్నది ఫేస్ బుక్.

భద్రత లేదు
ఫేస్ బుక్ ఓ దశాబ్దం కిందట ఎంటర్ టైన్ మెంట్…కానీ ఇప్పుడు ఇదో పెద్ద వ్యసనం సిగరెట్, మందు, మాదక ద్రవ్యాలు… వీటి కన్నా పెద్ద వ్యసనంగా మారింది. ప్రజలు నమ్మినా నమ్మకున్నా కేవలం ఒక్క ఫేస్‌బుక్ పరిచయాల వల్ల నలిగిపోయిన జీవితాలు ఎన్నో?…

ఎక్కువ శాతం యువత ప్రొద్దున లేవగానే ఫేస్ లేని ఫేక్ బుక్ లో గుడ్ మార్నింగ్ చెప్పడంతో మొదలయ్యే ప్రయాణం..రాత్రి గుడ్ నైట్ చెప్పేంత వరకు వేలి కొనల చివరన నాట్యమాడుతునే ఉంది. ఫేస్ బుక్ వేదికగా తమ ఇష్టాలను ,రోజు వారీ చర్యలను తెలియజేసే యువత ఇప్పుడు ట్రాక్ మారింది.తమను అత్యధిక మంది గుర్తుపట్టాలని పిచ్చి పిచ్చి ఫీట్లు మొదలు పెట్టి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు.ఈ వ్యవస్థ ఎక్కడకు దారి తీసిందంటే…తమ ఆత్మహత్యలను సైతం ఫేస్బుక్ లో లైవ్ ఇవ్వడం వరకు వెళ్ళింది.

అవును ఇది నిజం 2018 మే చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా 220 కోట్ల మంది ఫేస్ బుక్ యూజర్ల ఉన్నట్లు ఆ సంస్ద వెల్లడించింది. ఏటా 13 శాతం వృద్ధి రేటుతో ఇది దూసుకెళ్తుంది. అయితే ఇక్కడే ఉన్న అసలు సంగతి కూడా బయట పెట్టింది ఫేస్ బుక్. అదేంటంటే తమకున్న యూజర్లలో 20 కోట్ల అకౌంట్లు ఫేక్ అకౌంట్లని గుర్తించింది.అంటే ప్రతి పది మంది ఫేస్ బుక్ అకౌంట్లలో ఒకటి ఫేక్ అకౌంట్ అన్నది నిజం. ఫేక్ అకౌంట్లతో మీకేం సంబంధం అని లైట్ తీసుకోకండి…. మీఅమ్మాయిల ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న అమ్మాయిలంతా నిజంగా అమ్మాయిలు కాకపోవచ్చు.అందులో కూడా ఒకరిద్దరు కేటు గాళ్ళు ఫేక్ అకౌంట్లతో చాట్ చేస్తూ ఉండచ్చు.అమ్మాయిలే కాదు అబ్బాయిల అకౌంట్లో కూడా ఫేక్ అకౌంట్లు ఉండచ్చు.కానీ ఈ విషయం తేలియక చాలా మంది ఫేస్ బుక్లో బుక్ అవుతున్నారు. ఇండియాలో 26 కోట్ల మందికి ఫేస్ బుక్ అకౌంట్లు ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో 16 కోట్ల మంది పాతికేళ్లలోపు వయసు వాళ్లే…. అంటే యూత్ ఈబుక్కుకి ఎంతల బుక్కైపోతున్నారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

వ్యాపార విలువలు పాటించే యాజమాన్యం
తమ డేటాను కోట్ల మంది యూజర్ల డేటాను యాక్సెస్ చేసుకునేందుకు 60 కంపెనీలతో ఫేస్ బుక్ అగ్రిమెంట్లు చేసుకుంటున్నట్లు అప్పట్లో న్యూయార్క్ టైమ్స్ సంచాలన విషయాన్ని బయట పెట్టింది..కేంబ్రిడ్జ్ అనాలిటిక బయట పెట్టిన వివరాలతో ఫేస్ బుక్ చిక్కుల్లో పడింది. జనాల పర్సనల్ డేటా ఫోటోలు, అభిప్రాయాలు, షేర్లు, లైక్ లు అన్నింటిని యాక్సిస్ చేసుకునేందుకు ప్రపంచంలో ఉన్న బడా కంపెనీలకు ఆవకాశం ఇచ్చేసింది.ఇలా ఎదో ఒక రోజో రెండురోజులో కాదు పదేళ్ళ పాటు వాళ్ళు ఫేస్ బుక్ లో ఎవరి డేటానైనా యాక్సిస్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చేసినట్ట న్యూయర్క్ టైమ్స్ రాసుకోచ్చింది.అదే నిజమైతే యూజర్ల నంటింట్లో ఉన్న గుట్టంతా నట్టింట్లో ఉన్నట్లే.

దేశానికే ముప్పు
ఇప్పటి వరకు 60 సంస్ధలతో ఫేస్ బుకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వారికి తెలియకుండానే ఇతరులకు చేరవేయడం మామూలు విషయం కాదు.ఆ సమాచారాన్ని వారు ఇతర అసాంఘిక కార్యక్రమాలకు వినియోగించినా ఆశ్చర్య పడనవసరం లేదు.ఈ విషయాన్ని కాస్త లోతుగా పరిశీలిస్తే ఇది భారత దేశ ఎన్నికల వ్యవస్థనే నాశనం చేసే ప్రమాదం ఉంది. ఓటర్ల సమాచారం వారి వయ స్సు దృవీకరణ ద్వారా తెలుసుకొని వారి ని సోష ల్ మీడియా ద్వారా పార్టీలు ప్రలోభ పెట్టె ప్రమా దం లేకపోలేదు. ఒక వేల అలా దేశంలోని ఏ పా ర్టీకి.. పౌరుల వ్యక్తిగత సమాచారం అందినా స్వ తంత్య్ర ఎన్నికల వ్యవస్థ మొత్తం ఉనికిని కోల్పో యే ప్రమాదం ఉంది.ఇది దేశ భవిష్యత్తునే ప్రశ్ని ంచే ప్రమాదము ఉన్నదని సామాజిక నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.

మరి అంతా సరే గాని ప్రజల సమాచారం దుర్వినియోగం చేసినప్పుడు న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు గదా అని అనిపించవచ్చు. కాని ఇక్కడే ఉంది అసలు మ ర్మం. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకునే ముందే.. వినియోగాదారుల నుంచి ఆయాప్ వారి సమాచారా న్ని పొందే పర్మిషన్ వారికి తెలియకుండానే వారి చేతితో స్వయంగా ఒప్పిస్తుంది. ఏపని అయినా మంచి కోసం చేస్తే ఎలా ంటి ఇబ్బందులు తలెత్తవు …అపరిచితుల పరిచయాల వల్ల ఏర్పడిన కృత్రిమ ఆకర్షణ..ఎన్నో కుటుంబాల సంతోషమైన కలల బృందావనాలు కూలి పోవడానికి కా రణం అయింది.ఇప్పుడు ఎందరో భారతీయుల వివరాలు ఇతర కంపనిల కు ఇవ్వడం వల్ల ఇం కా ఉహించని ప్రమాదాలు ఎదురవడం మాత్రం ఖాయం. ఒక్కటి మాత్రం నిజం ప్రపంచాన్ని ను వ్వు అరచేతిలో చూస్తున్నట్లే నిన్ను అదే అరచేతిలో ఉన్న సెల్ ద్వారా ప్రపంచం నిన్ను చూ స్తుంది జాగ్రత్త.

                                                                                                            – అర్జున్ మహేంద్ర

Special Story On Facebook

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఫేస్‘బుక్’ అవుతున్నారా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.