బతుకు మెతుకు వెతుకు తీరు సెప్పు..

  బోనం బువ్వ….ఇది పక్కా తెలంగాణ మాస్ బోనం అంటేనే బువ్వ…బువ్వ ఉంటేనే బోనం.. ఇదే తెలంగాన జన జీవన యానం. అంతకు మించిన దిల్‌సే దిల్‌కా ఖేల్‌కా కిస్సా. బోనం బువ్వ ఒక మకుటం. తెలంగాణ జనజీవన శకటం. ఒక్కోక్క పువ్వేసి చందమామ పద్ధతిన పేర్చుకుంటూ పోయిన బతుకమ్మ అందం..బతుకంత చందం. నన్ను దోచుకుందువటే అనేంత ఇగిరిపోని గంధం. ఇందులో ఇమిడి ఉంది. ఒక మట్టి దీపం ఒక ఆడపడుచు ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు సాక్షం బోనం. […] The post బతుకు మెతుకు వెతుకు తీరు సెప్పు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బోనం బువ్వ….ఇది పక్కా తెలంగాణ మాస్

బోనం అంటేనే బువ్వ…బువ్వ ఉంటేనే బోనం.. ఇదే తెలంగాన జన జీవన యానం. అంతకు మించిన దిల్‌సే దిల్‌కా ఖేల్‌కా కిస్సా. బోనం బువ్వ ఒక మకుటం. తెలంగాణ జనజీవన శకటం. ఒక్కోక్క పువ్వేసి చందమామ పద్ధతిన పేర్చుకుంటూ పోయిన బతుకమ్మ అందం..బతుకంత చందం. నన్ను దోచుకుందువటే అనేంత ఇగిరిపోని గంధం. ఇందులో ఇమిడి ఉంది. ఒక మట్టి దీపం ఒక ఆడపడుచు ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు సాక్షం బోనం.

ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణలోనే బువ్వకు పూజ చేస్తరు. దీనంతో కొలుస్తరు. ఆడుతూ పాడుతరు. ఇక్కడ తర తమ భేదం లేనేలేదు. సివాలు, సిగాలు సింగారాలు అంతకుమించిన బంగారాలు..అమ్మలక్కల ఆలవాలాలు, ఇరుగుపొరుగే కాదు ఎక్కడెక్కడి వారో అలాయ్‌బలాయ్‌లు. బతుకం తా కష్టమేనా ఈ ఒక్కరోజు సంబరాల హవాయ్‌జహాజ్‌లు… డా॥దాశరథుల నర్సయ్య మన యాసలోని ఆత్మీయపు ధ్యాస ను పదిలంగా పట్టితెచ్చిండు…మన ముందుకు ఒక బోనం బువ్వ పుస్తకంగా తీసుకొచ్చి దరువేసిండు…‘ కూర లెన్ని ఉ న్నా గాని తొక్కంచుకు లేకపోతే ముద్దపోదు లోపలికి మొదటి ముద్ద తొక్కు ముద్ద ..తెలంగాణ తీరు సెప్పు .. అంటూ బడుగుల బతుకుల లో లోపలి పొరల తీరు సెప్పిం డు. తరతరాల హోరు విప్పిండు…. అన్నింట్లోనూ తెలంగాణ తీరు సెప్పు మకుటం ..నడుస్తున్న పొద్దుమీద పొడుస్తున్న కాలంగా సాగింది. బైండ్లోల కథలు.. రంజు కథలు..అన్నింటిని మన ముందుకు తెచ్చిండు.

కిన్నెర వాయిద్యం తెలంగాణ సొంతం అనే నిజాన్ని చాటి చెప్పిండు…జమ్మిని బంగారంగా భావించుకుని అందరిని ఆదరించే ఆత్మీయత లోగిలి తెలంగాణ అని తేల్చిచెప్పిండు…. మెతుకు సీమలో పుట్టిన నర్సయ్య ఈ పుస్తకంలో తెలంగాణను తన అక్షరాలతో ఆవిష్కరించిన తీరు…అందులోనూ ఎక్కడా కల్లాకపటం లేకుండా, పదాడంరాలు కవిత్వపు నగిషీలు లేకుండా సిద్ధిపేట కె రాజయ్య చిత్రలేఖనంలోని అచ్చమైన ఊరు ఆడపడుచు బొమ్మలాగా రాసిండు. తెలంగాణను పాలించిన అస్మకరాజుల నుంచి కాకతీయుల పాలన దాక , మహ్మదీయుల పాలన నుంచి అసఫ్‌జాయి రాజుల దాకా నెలకొని ఉన్న వైభవాన్ని అంతర్లీనంగా సాగుతూ పదిలంగా పరుగులు తీస్తూ వచ్చిన తెలంగాణ సంస్కృతిని, సకల మత ఆచార వ్యవహారాల సమ్మేళనాన్ని ఒక సంబురంగా తీర్చిదిద్దిండు. ఇక్కడి వారైన పాల్కురికి, పోతన , కొరవి, గోపరాజు, జాయప సేనాని , కంచర్ల గోపన్న వంటి వారిని ఎందరినో స్మరించుకున్నడు. సర్వాయి పాపనను యాది మర్వలేదు. రాణి శంకరమ్మతో పాటు తుర్రేబాజ్ ఖాన్ వంటి వారిని వాళ్ల త్యాగాలను గుర్తు చేసుకుని రాబోయే తరాలకు ఇది తెలంగాణ కథగా తీరుగా సెప్పిండు.

నాగలితో భూమి దున్ని / కళ్లముందు సాగుతుంటే నాగేటి సాళ్లల్లో / భార్య నాటు విత్తనంబు అంటూ పొలం గట్ల వెంబడి సాగే సగటు రైతు బిడ్డ బతుకు విడమర్చిండు. 3 విత్తనంబు నాటినంక మొగులువంక సూసుకుంట వానదేవుడెపుడొస్తడో అనుకుంట రైతు కుకునే తీరు సెప్పిండు రైతు ఆశలు వాడి కష్టం ప్రకృతి అనబడే దేవుడి మీద ఆధారపడి సాగే దిక్కులేని జీవనం గురించి నర్సయ్య విడమర్చిండు. కష్టపడ్డ దానికి ఫలితం అప్పుడే వచ్చినట్లుగా సంబరంతో గంతెసే రైతు ఆశను ధ్యాసను కవిత కానీ నిజంలో చెప్పిండు….
ఉరుములతో జల్లుపడితే / పల్లవించే మానసంబు
విత్తులన్ని మొలకలెత్తి / ఇగురు పెడితే ఆనందం
తెలంగాణ పల్లెను ఇంత పచ్చిగా తెలియచేయడం కేవలం జన జీవితంపై అపార ఆసక్తి, అంతకు మించిన అధ్యయనంతో సాధ్యం.

రుతువుల రాగాలు, ప్రకృతి సరాగాలు అంటూ పలువురు స్వీయ అనుభవాలను రంగరించి పోసి కవులుగా చలామణి అయిన వారు ఉన్నారు. అయితే తన జీవిత అనుభవాలను ఏకరువు పెట్టుకుంటూ మన ముందు తెలంగాణలోని బతుకు వెతను, బతికే కథను, జిందగి అంటే జీత్‌కు కాదు జిందగి అంటే జీవించడానికి అనే తీరును తన పుస్తకంలో చాటి చెప్పిండు .
బతుకమ్మ దరువు, జమ్మి బరువు పీర్ల పండుగలోని కలివిడి తనం అన్ని జుర్రుకున్నడేమో. వాటిని ఇప్పుడు తన తెలంగాణ తీరు సెప్పు అంత్యక్షరాల పొందికలో ఇడమర్చి చెప్పిండు.
వానజల్లు కురవకుంటే / గుండెజల్లు మంటు కుంగి
దీనమైన మోయు తోడ / తలరాతను తిట్టుకుంటే అంటూ బక్కచిక్కిన రైతన్న నిరాశను తెలియచేసిండు. కురిసే టైంల జల్లు పడకపోతే గుండె జల్లు మంటదన్న నర్సయ్య మన కళ్ల ముందు వానల కోసం ఎదురుచూసే అర పావు కుంట జాగా రైతును తలపించిండు. ఇక జీవన సారాన్ని కూడా కాచి చూపించిన తీరు కళ్లను చెమ్మరిస్తుంది.,,, సుఖముంటేనే జీవితంబు ..కాదుకాదు ముమ్మాటికి కష్టాలను కన్నీళ్లను అనుభవిస్తేనే తెలుసు బతుకు …అంటూ బతుకు అంటే కేవలం పంచ రంగుల రామచిలుక కాదని, ఇందులో గొంగళిపురుగు దశ కూడా ఉందని చెప్పిన తీరు ఒప్పిస్తుంది. అయితే తెలంగాణ రైతు మొక్కవోని ధైర్యశీలి. ఒక్కడే ఒక్కడు మొనగాడు.. విధి బాగా ఉండాలని చూస్తడు అయితే విధికి తలొంచడు ….

నమ్ముకున్న పొలం అమ్ముకోకు / వానలు పడతలేవని
పంటలెండిపోతయని
ఇల్లు గడిపే దారిలేదనుకున్నా …అంటూనే కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినా అవి బండి ఇరుసులు అనుకుంటూ సాగుతుండే తీరు సెప్పిండు. రైతు కేవలం ఒక్కడే కాదు తనతో పాటు తాను కట్టుకున్న తనతో పాటు పుట్టింటి నుంచి వచ్చి ఉన్న భార్యనే సమస్త బతుకు నేస్తంగా భావించుకుండు. ఆమె కూడా అంతే పెనిమిటే సమస్తంగా పొలంలో నాగేటి చాళ్లలో విత్తనంబు నాటుతూ పోతుంది. ఇంతకు మించిన సహజ సౌందర్యం. ఇంతకు మించిన ఆధునిక అందం ఏమైనా ఉంటుందా? దీనిని తన రచనలోని తెలంగాణ తీరు సెప్పు చివరి మాటలతో చాటి చెప్పిన తీరు నర్సయ్యకే సొంతం అయింది.

బోనం బువ్వ పల్లె ప్రజల ముఖచిత్రం. ఊరి పొలిమేరలుల ఒక తాటి చెట్టు, లోపలికి పొంగనే ఒక కుమ్మరికొలిమి ఇంకా వీధులలో మగ్గం, వేణుగోపాల సామి గుడి, అంతకు మించి నల్ల పోచమ్మ, సారలమ్మ నాగులయ్య వంటి గుడులు మసీదు కిరస్తానీ మందిరాలు అన్నింటిని పొదివి పెట్టుకుని ఉండే తెలంగాణ ఊర్ల చిత్రాలన్నింటిని ఆయన తన పుస్తకంలో ఆవిష్కరించిన తీరు గొప్పగా ఉందని అనుకోవద్దు . ఎందుకంటే గొప్పగా ఉండటం కంటే మించినదేందో కళ్ల ముందుంచినట్లుగా చేయడమేదో చేసిండు. ఇది కనికట్టు కాదు …ఆయువు పట్టులోంచి వచ్చి వాలినట్లుగా ఉంటది. తెలంగాణ భాసలోని ఒక్కో పదం వెనుక ఇక్కడి సంస్కృతి, అంతకు మించి ఆచార వ్యవహారాలు, పండుగలు పబ్బాలు, పౌరుషాలు, నీరసాలు, కరుణరసాలు, అంకితభావాలు, ఆవేశకావేశాలతో మమేకం అయి ఉంటుంది. నర్సయ్య పుస్తకంలో జోడెడ్లండిగా సాగింది.

నీరు తోడే చేంతాడూ / బొక్కెన బావిలో పడితే
వెదికెడి పాతాళగరిగి / బొక్కెన లాగే గిలక
తెలంగాణ తీరు సెప్పు
ఇదీ తెలంగాణ గురించి అక్కడి ఆడపడుచు ఇంట్లోని వారికి గుక్కెడు మంచినీళ్లు ఇచ్చేందుకు పడే తపన గురించి బాగా తెలిసిన వాడే చెప్పగలిగిన తీరు తెన్ను. చేంతాడూతో పాటు బొక్కెన బావిలో పడితే . ఇక అమ్మ గుండే బావిలో పడ్డట్లే అవుతది… బొక్కెను తీసేందుకు పాతాళగరిగే తేవాలి. నీళ్లు తోడే బొక్కెన కనపడకుండాపోతే దానిని వెతికే పాతాళగరిగె.. బతు కు సయ్యాటగానే సాగుతుంది. తెలంగాణ తీరును సెప్పింది.

కొండాపూర్ గుట్టమీద / టంకసాల వెలసెనంట
ప్రాచీన తెలంగాణము / లోన ఇదియె పట్టణంబు
తెలంగాణ తీరుసెప్పు
తెలంగాణకు ఉన్న ఘనమైన చరిత్ర, వెలుగులోకి రాని , జమ్మి చెట్టు మీదుంచిన ఆయుధమంటి పౌరుషాలు అన్నింటిని మన ముందుకు తీసుకొచ్చిండు. చిన్నప్పటి నుంచి గుండెనిండా పేర్చుకున్న అనుభూతులను తన విద్యావ్యాసాంగంతో మరింతగా పదును చేసుకుని మన ముందుకు కలబోసిన పుట్టెడు ధాన్యం మాదిరి తీసుకొచ్చిండు….

గోదారి తీరంలొఓ / అస్మక రాజ్యంబు వెలసే
రాజధాని ‘ పోదన్’ మరి /బోధన్‌గా మారెనంట
తెలంగాణ తీరుసెప్పు
తెలంగాణపై జరుగుతూ వచ్చిన పలు రకాల ఆక్రమణలను దీనితో మారుతూ వచ్చిన గతిని తెలిపిండు…
గొలుసుకట్టు చెరువులుంటె / కాకతీయ సామ్రాజ్యమె
గుర్తుకొచ్చుదాని పేరు / నేటి మిషన్ కాకతీయ
తెలంగాణ తీరు సెప్పు…..
( డా. దాశరథుల నర్సయ్య,విశ్రాంత లెక్చరర్, సిద్ధిపేట జిల్లాకు చెందిన వారు. ఆయన రాసిన బోనం బువ్వ పుస్తక సమీక్ష ఇది…డా నర్సయ్య, సెల్ : 9390919100)

Special story about Bonam Buvva Book

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బతుకు మెతుకు వెతుకు తీరు సెప్పు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: