సీజనల్ వ్యాధులను తరిమేయాలి

  పారిశుద్ధ కార్యక్రమాలపై స్పెషల్ ఫోకస్ మంత్రులు ఈటల, ఎర్రబెల్లి హైదరాబాద్ : గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై మంత్రులు ఈటల రాజేందర్ , ఎర్రబెల్లి దయాకర్ సోమవారం సచివాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, వైద్య విద్య సంచాలకుడు రమేశ్ రెడ్డి, వైద్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తదితరులు హాజరయ్యారు. అనంతరం మంత్రులు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, […] The post సీజనల్ వ్యాధులను తరిమేయాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పారిశుద్ధ కార్యక్రమాలపై స్పెషల్ ఫోకస్
మంత్రులు ఈటల, ఎర్రబెల్లి

హైదరాబాద్ : గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై మంత్రులు ఈటల రాజేందర్ , ఎర్రబెల్లి దయాకర్ సోమవారం సచివాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, వైద్య విద్య సంచాలకుడు రమేశ్ రెడ్డి, వైద్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తదితరులు హాజరయ్యారు. అనంతరం మంత్రులు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించామన్నారు. సీజనల్ వ్యాధుల తీవ్రతను పారిశుధ్య నిర్వహణతోనే ఎదుర్కోనే అంశంపై చర్చించి జిల్లా, మండల, గ్రామ స్థాయిలో అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించామన్నారు.

ప్రభుత్వం, ప్రజలు కలిసి గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ కోసం పని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు యుద్ధ ప్రాతిపదికన అన్ని గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్, కార్యదర్శి ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టాలని సూచించినట్లు మంత్రులు తెలిపారు. – ప్రభుత్వము చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా అన్ని రకాల పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపు, పాత బావుల పోడ్చివేత, డ్రైనేజీ వ్యవస్థ క్లీనింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. – అన్ని గ్రామాల్లో తాగు నీటి ట్యాంకులు పూర్తిగా క్లీనింగ్ చేయడంతోపాటు పైపు లైనుల పరిశీలన.. అవసరమైన పనుల సత్వరం పూర్తి చేయాలని సూచించామని తెలిపారు. ప్రజల్లో పెద్దఎత్తున ఆరోగ్యం, పారిశుధ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇందులో ఎంఎల్‌ఎలు, ఎంపిపి, జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలను భాగస్వాములను చేస్తామన్నారు. పరిశుభ్రత లేకపోవడం వల్ల సీజనల్ వ్యాధులు ప్రభలుతున్నాయన్నారు. దీనిపై అందరూ కలిసి పని చేస్తామన్నారు.

Special focus on sanitation programs

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సీజనల్ వ్యాధులను తరిమేయాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.