జీవితకాలం తగ్గుతోంది జాగ్రత్త!

  ఇవాల్టి రోజుల్లో ఎక్కువ భాగం కూర్చుని చేసే ఉద్యోగాలు. గృహణులకు ఎన్నో అధునాతన పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల శారీరక శ్రమ లేని పనులు, విశ్రాంతిగా కూరుని ఏ టెలివిజన్, స్మార్ట్ ఫోన్‌లతో గడిపే అవకాశాలు ఎక్కువ అయ్యాయి. సౌకర్యాలు పెరగటం ఆనందించదగినదే కానీ ఎక్కువ భాగం కూర్చోవటం హానికరం. అనారోగ్య సమస్యలకు చేతులారా ఆస్కారం ఇచ్చినట్లే. దీన్నే సెడెంటరీ బిహేవియర్ అంటారు. ఇదెప్పుడో ముఫ్ఫై, నలభై ఏళ్ల క్రితమే శారీరకంగా చురుగ్గా లేని ఉద్యోగాలు […] The post జీవితకాలం తగ్గుతోంది జాగ్రత్త! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇవాల్టి రోజుల్లో ఎక్కువ భాగం కూర్చుని చేసే ఉద్యోగాలు. గృహణులకు ఎన్నో అధునాతన పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల శారీరక శ్రమ లేని పనులు, విశ్రాంతిగా కూరుని ఏ టెలివిజన్, స్మార్ట్ ఫోన్‌లతో గడిపే అవకాశాలు ఎక్కువ అయ్యాయి. సౌకర్యాలు పెరగటం ఆనందించదగినదే కానీ ఎక్కువ భాగం కూర్చోవటం హానికరం. అనారోగ్య సమస్యలకు చేతులారా ఆస్కారం ఇచ్చినట్లే. దీన్నే సెడెంటరీ బిహేవియర్ అంటారు. ఇదెప్పుడో ముఫ్ఫై, నలభై ఏళ్ల క్రితమే శారీరకంగా చురుగ్గా లేని ఉద్యోగాలు చేసేవాళ్లలో గుండె సం బంధించిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనకారులు తేల్చారు. ఎక్కువ గంటలు కూర్చునే వాళ్లలో టైప్2 డయాబెటీస్ సంబంధిత రిస్కు, గుండె నాళాల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.

అలాగే మానసిక సమస్యల రిస్క్ కూడా సెడెంటరీ ప్రవర్తన అంటే విశ్రాంతికి అలవాటు పడి కనీస మాత్రపు క్యాలరీలు కూడా ఖర్చు చేయకుండా, విశ్రాంతిగా ఉన్నవాళ్లలో కండరాలు రూపొందించే క్రావిట్స్ అనే క్రిటికల్ ఎంజైమ్ మోతాదు తగ్గిపోతుంది దీనివల్ల ట్రై గ్లిజరాయిడ్స్ పెరుగుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి, రక్తనాళాల గోడలకు ప్లేక్ చేరుకోకుండా కొలెస్ట్రాల్‌ను కరిగించే హెచ్. డి.ఎల్ పనితీరు తగ్గిపోతుంది. ఈ ఎంజైమ్ స్థాయిలలో చాలా తక్కువగా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్ కరిగిపోతుంది. సెడెంటరీ ప్రవర్తనకు టైప్2 డయాబెటీస్‌కు నడుమ సంబంధానికి ఇదే కారణం. కదలికలు లేని జీవన శైలి వల్ల జీవనకాలం తగ్గిపోవటం జరుగుతుంది. రోజులో మూ డుగంటలు కూర్చుని చేసే సమయాన్ని తగ్గించుకుంటే చాలు. జీవితకాలం రెండేళ్లు పెరిగినట్లే అం టారు నిపుణులు. కూర్చుని చేసే ఉద్యోగాల్లో కూడా ఎక్కువ నాడులు కదలికలు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. శరీరం స్ట్రెచ్ చేయాలి. లేచి కాస్త తిరగాలి. ముందుగా వ్యాయామాలు చేయాలి చురు గ్గా నడవాలి.

పవర్ వాక్ : వేలాది వైద్యులు నడకను సిఫార్స్ చేస్తారు. వాకింగ్ కంటే జాగింగ్ అంతకంటే స్పీడ్ వాకింగ్ నాణ్యమైనదిగా చెబుతారు. స్పీడ్ వాకింగ్ జాయింట్స్‌పై సులువుగా ఉంటుంది. మామూలు విండో షాపింగ్‌తో కాస్త బద్ధకం వదుల్చుకుని ఈ నడక సులువుగా మొదలు పెట్టవచ్చు. విండో షా పింగ్ నుంచి గబగబా నడవటం చాలా కొద్ది రోజు ల్లో అలవాటైపోతుంది. విండో షాపింగ్‌తో శరీరా న్ని కాస్త అటు ఇటు కదిలేలా వేసి అటు నుంచి వ డిగా నడకలకు మార్చుకోవటమే అసలురహస్యం. చక్కని తేలికైన, సౌకర్యంగా ఫ్లెక్సిబుల్‌గా ఉండే వాకింగ్ షూతో పాదాల నొప్పి రాదు. షూ వంచినపుడు పాదం బాల్ వద్ద సులువుగా ఉండాలి. పొడవాటి కాలి వేలికీ, షూకు నడుమ వేలి ముద్రంత ఖాళీ ఉండాలి. మరీ టైట్‌గా ఉంటే కాలి వేళ్లు నొప్పెడతాయి.

పవర్‌వాక్‌తో అన్ని ఆరోగ్య సమస్యలు అధిగమించేలా చేయాలంటే గంటకు కనీ సం 7.2 కిలో మీటర్లు నడవగలగాలి. అంటే నడకలో అంత వేగం ఉండాలి. 63.5 కేజీల బరువున్న మహిళలు ఆ మాత్రం వేగంతో నడిస్తే జాగింగ్‌లో 220 క్యాలరీలు ఖర్చవుతాయి. ఎలాగంటే అదే మోతాదులో ఎనర్జి ఉపయోగించాలి కనుక. నెమ్మదిగా ఆరంభించి వేగం పెంచాలి. నడక కొవ్వును కరిగించి కండరాలు టోనింగ్ చేసేదిగా మలుచుకోవాలి. సరైన పోశ్చర్ చాలా అవసరం చుబుకం పైకెత్తి తిన్నగా కదిలిస్తూ నడవాలి. అప్పుడు ఉదర కండరాలు సరైన పొజిషన్‌లో ఉంటాయి.

పని ప్రదేశంలో జాగ్రత్తలు: పనిలో తక్కువసేపు కూర్చునేలా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడూ మెట్లెక్కి నడవాలి. సీట్ లోంచి అటూ ఇటూ నడుస్తూ ఉండాలి.  గృహిణులు కూర్చున్న చోటు నుంచి నాలుగు అడుగులు వేయటం అలవాటుగా చేసేయాలి. సహాద్యోగుల దగ్గరకు నడిచే వెళ్లాలి. మెసేజ్‌లు ఫోన్‌లు మానేసి అవతల వాళ్ల సీట్ దగ్గరకు పోయి పనులు చేసుకోవాలి. లంచ్ బ్రేక్‌లో ఉండే అరగంట సమయంలో కూడా నడకకు అనువుగా చేసుకోవాలి.

మీటింగ్ సమయంలో ఎక్కువ సేపు నిలబడే మాట్లాడటం వంటివి చేస్తూ పోవాలి. ఇంట్లో కూడా ఎక్కువసేపు కూర్చునే పని చేయాలి. ఫోన్లు అందుబాటులో పెట్టుకోవద్దు. ఫోన్ వస్తే నిలబడి అటు ఇటు తిరుగుతూ మాట్లాడాలి. టి.వి. ముందు కూర్చున్నా సరే మధ్యలో బ్రేక్ ఇచ్చినట్లు అటూ ఇటూ నడవాలి. పడక ముందు ఊరికే విశ్రాంతిగా మంచంపైన వాలి ఉండే సమయం తగ్గించుకోవాలి. నిద్ర లేవగానే బద్ధకంగా అయిపోకుండా లేస్తూనే పనిలోకి ప్రవేశించాలి. అలాగే లేవటంతోనే పని అంటే కాస్సేపు ఆరుబయట గాలిలో చుట్టూ ప్రకృతిని చూస్తూ ఐదారు నిమిషాల తర్వాతే అని గుర్తు పెట్టుకోవాలి. కూర్చుని విశ్రాంతిగా ఉండే అలవాటు ఒక పట్టాన శరీరాన్ని కష్టపడనివ్వదు. ఇటువంటి ధోరణికి ఎంత త్వరగా స్వస్తి చెబితే అంత మంచిది.

Special articles on Sedentary lifestyle

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జీవితకాలం తగ్గుతోంది జాగ్రత్త! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: