శ్రావణ లక్ష్మికి స్వాగతం

  సమస్త సంపదలకు మూలం మహాలక్ష్మి. ఆమె కృప వల్లనే మనకు ఆకర్షణీయమైన రూపం ఏర్పడుతుంది. విద్యాధికులమై, విఖ్యాతి పొందుతున్నాం. లక్ష్మీకటాక్షం మానవులందరికీ అవసరమే. ఆ దేవి దయ ఉంటే అన్నింటా అభివృద్ధి. అంతులేనన్ని సంపదలు. ఆమె అనుగ్రహం పొందాలనుకునే వారందరూ ఆమె ప్రాణనాథుడు శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం పేరు మీదుగా ఏర్పడిన శ్రావణమాసంలో విష్ణువల్లభను శ్రద్ధాభక్తులతో కొలిచి ఆమె అనుగ్రహానికి పాత్రులై ధన కనక వస్తువాహనాలు పొందాలని కోరుకుంటారు. శ్రావణ మాసంలో ఆచరించవలసిన […] The post శ్రావణ లక్ష్మికి స్వాగతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సమస్త సంపదలకు మూలం మహాలక్ష్మి. ఆమె కృప వల్లనే మనకు ఆకర్షణీయమైన రూపం ఏర్పడుతుంది. విద్యాధికులమై, విఖ్యాతి పొందుతున్నాం. లక్ష్మీకటాక్షం మానవులందరికీ అవసరమే. ఆ దేవి దయ ఉంటే అన్నింటా అభివృద్ధి. అంతులేనన్ని సంపదలు. ఆమె అనుగ్రహం పొందాలనుకునే వారందరూ ఆమె ప్రాణనాథుడు శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం పేరు మీదుగా ఏర్పడిన శ్రావణమాసంలో విష్ణువల్లభను శ్రద్ధాభక్తులతో కొలిచి ఆమె అనుగ్రహానికి పాత్రులై ధన కనక వస్తువాహనాలు పొందాలని కోరుకుంటారు. శ్రావణ మాసంలో ఆచరించవలసిన విధులను తెలుసుకుందాం..

సకల సౌభాగ్యాలకు, సిరి సంపదలకు, శుభకార్యాలకు ఆవాసం శ్రావణమాసం. కాబట్టి సంప్రదాయాలను పా టించే ప్రతి ఇంటి ముంగిటా చక్కగా నీళ్లు చల్లి, ము గ్గులు పెట్టి, గుమ్మాలన్నీ మామిడి తోరణాల తోటీ, గడపలు పసుపూ కుంకుమలతోటీ శోభాయమానంగా కనిపించే ఇంటిలో ఘల్లుఘల్లుమనే గజ్జల సవ్వడితో లక్ష్మీదేవి కాలు పెడుతుంది. అమ్మ పాద స్పర్శ సోకితే నట్టిల్లు బంగారంగా మారుతుంది. ఇక ఆ ఇంటిలో సిరిసంపదలకు కొదవుండదు.

శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకా శం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి, నాగ పంచమి పుత్రాదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావం చూపే మాసం.

ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రాల ప్రభావం, చంద్రుని మూలంగా మన మీద ప్రభావం పడుతుంది. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణాలను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్ధం వైపు మనస్సును తిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యాల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగల లో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశం.

1. శ్రావణ సోమవారం ఈ మాసంలో వచ్చే సోమవారాలలో శివ భక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతి దేవికి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తుల నమ్మకం.

2. శ్రావణ మంగళవారం కృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతం ఈ మాసంలో ఆచరిస్తారు. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్థిల్లుతారు. కొత్తగా ప్ళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లి కి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి ప్ళ్ళైన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకొంటారు.

3. శ్రావణ శుక్రవారం ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీవ్రతాన్ని ఆచరిస్తారు.

4. శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతిని ఈ రోజు జరుపుకొంటారు. జంధ్యాన్ని యగ్నోపవీతమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రి దేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వేదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు.

5. రక్షాబంధనం శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలలిచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి) దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణ సమయంలో కట్టడం చేయాలి. అప అంటే పగలు, అపరం అంటే మధ్యాహ్నం అంటే 12 దాటాక, కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది. శ్రావణ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. కాబట్టి ఈ మాసంలో సత్యనారాయ వ్రతాలు చేయడం కూడా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఇది ఎప్పటి నుండో వస్తున్న శాస్త్ర విజ్ఞాన సంప్రదాయమేనని పండితులు చెబుతున్నారు.

లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందంటే…

గోవులు, తామరపుష్పాలు, పాడిపంటలు, ఏనుగులు, గుర్రాలు, రత్నాలు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలనూ అర్చించే వారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పూలు, పండ్లతోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరిత వర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి, శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, ్రస్త్రీలు ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా ఉండే ఇళ్లు, బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు, వేదఘోష, సత్వగుణ సంపదలు, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలనలోనూ మహాలక్ష్మినివసిస్తుంది.

సంపదలంటే ఏమిటి?

సాధారణంగా మనం ధనం అంటే డబ్బు ఒక్కటే అనుకుంటాం. అయితే ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం, స్థైర్యం, విజయం, వీర్యం, అభయం, శౌర్యం, సౌభాగ్యం, సాహసం, విద్య, వివేకం, ధనం, ధాన్యం, సంపద, బంగారం, వెండి, ఆభరణాలు, వస్తువులు, వాహనాలు, ఆయుధాలు, పశువులు, పుత్ర పౌత్రాదులు, కీర్తిప్రతిష్టలు, సుఖసంతోషాలు మొదలైనవన్నీ సంపదలే. వీటన్నింటికీ అధినేత్రి ఆ తల్లే. ఆమె అనుగ్రహంతోటే సాధ్యం. కాబట్టి ఆమెను పూజించి ఈ సంపదలను పొందుతాం.

Special article about Sravana masam festivities

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శ్రావణ లక్ష్మికి స్వాగతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: