గోల్డ్ బాండ్ గ్రాముకు రూ.3,890

  ఈ నెల 9న ఇష్యూ ప్రారంభం: ఆర్‌బిఐ న్యూఢిల్లీ : సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూ తదుపరి దశ సెప్టెంబర్ 9 న ప్రారంభించనున్నట్టు ఆర్‌బిఐ ప్రకటించింది. గోల్డ్ బాండ్ ధర గ్రాముకు 3,890 రూపాయలుగా నిర్ణయించినట్టు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్ పథకం 2019-20 -సిరీస్ 4 సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమై ఇదే నెల 13వ తేదీన ముగుస్తుంది. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే, డిజిటల్ విధానంలో […] The post గోల్డ్ బాండ్ గ్రాముకు రూ.3,890 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఈ నెల 9న ఇష్యూ ప్రారంభం: ఆర్‌బిఐ

న్యూఢిల్లీ : సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూ తదుపరి దశ సెప్టెంబర్ 9 న ప్రారంభించనున్నట్టు ఆర్‌బిఐ ప్రకటించింది. గోల్డ్ బాండ్ ధర గ్రాముకు 3,890 రూపాయలుగా నిర్ణయించినట్టు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్ పథకం 2019-20 -సిరీస్ 4 సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమై ఇదే నెల 13వ తేదీన ముగుస్తుంది. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే, డిజిటల్ విధానంలో బాండ్ కొనుగోలు కోసం చెల్లింపు చేసేవారికి గ్రాముకు రూ.50 తగ్గింపును అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటువంటి పెట్టుబడిదారులకు గోల్డ్ బాండ్ ఇష్యూ ధర గ్రాము బంగారం 3,840 రూపాయలకే లభిస్తుందని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) తెలిపింది.

సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని 2015 నవంబర్‌లో ప్రారంభించారు. భౌతికంగా బంగారం డిమాండ్‌ను తగ్గించి, ఈ విలువైన లోహాన్ని కొనుగోలు చేయడానికి ఉపయోగించే దేశీయ పొదుపులో కొంత భాగాన్ని ఆర్థిక పొదుపుగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ గోల్డ్ బాండ్‌లను తీసుకొచ్చింది. ఈ పథకం కింద బాండ్లను ఒక గ్రాము బంగారం యూనిట్లలో సూచిస్తారు. ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్-మార్చి) ఒక వ్యక్తికి బాండ్లలో కనీస పెట్టుబడి ఒక గ్రాము, గరిష్టంగా 500 గ్రాముల సబ్‌స్క్రిప్షన్ పరిమితి విధించారు. ఆర్థిక సంవత్సరానికి సబ్‌స్క్రిప్షన్ గరిష్ట పరిమితి వ్యక్తిగత, హిందూ అవిభక్త కుటుంబానికి (హెచ్‌యుఎఫ్) 4 కిలోలు, ట్రస్టులకు, ఇలాంటి సంస్థలకు 20 కిలోలు పరిమితి విధించారు.

దిగొస్తున్న పసిడి ధర
బంగారం, వెండి ధరలు శుక్రవారం తగ్గాయి. పసిడి రూ.40 వేల స్థాయి దిగువకి పడిపోగా, వెండి ధర కూడా 50 వేల రూపాయల కన్నా దిగువన కొనసాగుతోంది. ఆభరణాల డిమాండ్ తగ్గడంతో ఈ ప్రభావం కనిపించింది. బంగారం రూ .372 తగ్గి 10 గ్రాములకు రూ.39,278 కు చేరుకుంది. వెండి కూడా బాగా పడిపోయింది. వెండి కిలోకు రూ.1,273 తగ్గి రూ.49,187 కు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారం రెండు శాతం, వెండి ఐదు శాతం పడిపోయింది.

Sovereign Gold Bond issue opening on September 9

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గోల్డ్ బాండ్ గ్రాముకు రూ.3,890 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: