జూన్ 1న కేరళకు నైరుతి రుతుపవనాలు

  చల్లని కబురు మోసుకొచ్చిన వాతావరణ శాఖ 31వ తేదీన ఆరేబియా సముద్రంలో అల్పపీడనం మనతెలంగాణ/హైదరాబాద్ : భానుడి ప్రతాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు మోసుకొచ్చింది. జూన్ 1న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వెల్లడించింది. రాగల 24 గంటల్లో మాల్దీవులు, కోమెరిన్ కొన్ని ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ – నికోబార్ దీవుల్లో మిగిలిన ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం […] The post జూన్ 1న కేరళకు నైరుతి రుతుపవనాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చల్లని కబురు మోసుకొచ్చిన వాతావరణ శాఖ
31వ తేదీన ఆరేబియా సముద్రంలో అల్పపీడనం

మనతెలంగాణ/హైదరాబాద్ : భానుడి ప్రతాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు మోసుకొచ్చింది. జూన్ 1న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వెల్లడించింది.

రాగల 24 గంటల్లో మాల్దీవులు, కోమెరిన్ కొన్ని ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ – నికోబార్ దీవుల్లో మిగిలిన ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాల్లో ఈ నెల 31న అల్పపీడనం ఏర్పడవచ్చని అధికారులు తెలిపారు.

బంగాళాఖాతంలో తుఫాను సంచారంతో నైరుతి వేగం పుంజుకుందని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణం అనుకూలిస్తే 6, 7 తేదీలకల్లా రాయలసీమకు నైరుతి విస్తరించే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. అలాగే రాగల 72 గంటల్లో విదర్భ నుంచి తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితలద్రోణి కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో బలమైన గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Southwest Monsoon to Kerala on June 1

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జూన్ 1న కేరళకు నైరుతి రుతుపవనాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: