తెలుగు రాష్ట్రాలకు కలిసొచ్చిన ‘నైరుతి’

Southwest Monsoon to hit Telugu states

 

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికి రావడంతో ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా నైరుతి అనుకున్న సమయానికి వచ్చి మేలు చేసిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జూన్ నెల ముగిసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యిందని, ఎపిలో సాధారణం కంటే 20 శాతం, తెలంగాణలో 30 శాతం అధిక వర్షపాతం నమోదయినట్టుగా వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది.

కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో తక్కువ వర్షపాతం
ఎపిలో సగటు వర్షపాతం 93.7 శాతంగా అంచనా వేస్తే 113.1 శాతం వర్షపాతం రికార్డయ్యింది. అంటే సుమారుగా 20.7 శాతం అధికంగా వర్షం పడింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో సాధారణంగానే వర్షపాతం నమోదు కాగా మిగిలిన జిల్లాలన్నింటిలోనూ అధిక వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే వనపర్తి జిల్లాలో అధికంగా 141 శాతం అధిక వర్షపాతం నమోదుకాగా, జగిత్యాల జిల్లాలో 18 శాతం అధిక వర్షపాతం నమోదయ్యింది. ఇదిలా ఉండగా తొలిదశలో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో నైరుతితో ఆశించిన మేర వర్షాలు కురవలేదని ఐఎండి తెలిపింది. కేరళలో 25 నుంచి 45 శాతం తక్కువ వర్షపాతం, కేరళలో 17 శాతం వర్షం కురవగా, ఇక మహారాష్ట్ర, గోవాలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు తెలిపారు.

Southwest Monsoon to hit Telugu states

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post తెలుగు రాష్ట్రాలకు కలిసొచ్చిన ‘నైరుతి’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.