విరుద్ధ ప్రయోజనాల కేసులో గంగూలీకి క్లీన్‌చిట్

ముంబయి: బిసిసిఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలికి పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలనుంచి క్లీన్‌చిట్ లభించింది.గంగూలికి పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్నాయని మధ్య ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్( క్యాబ్) అధ్యక్షుడిగానే కాకుండా బిసిసిఐ ఎజిఎంలో బెంగాల్ ప్రతినిధిగా కూడా కొనసాగుతున్నారని గుప్తా ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన ఎథిక్స్ ఆఫీసర్ డికె జైన్ దాదా(గంగూలి)కి విరుద్ధ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. బిసిసిఐ అధ్యక్ష […] The post విరుద్ధ ప్రయోజనాల కేసులో గంగూలీకి క్లీన్‌చిట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: బిసిసిఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలికి పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలనుంచి క్లీన్‌చిట్ లభించింది.గంగూలికి పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్నాయని మధ్య ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్( క్యాబ్) అధ్యక్షుడిగానే కాకుండా బిసిసిఐ ఎజిఎంలో బెంగాల్ ప్రతినిధిగా కూడా కొనసాగుతున్నారని గుప్తా ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన ఎథిక్స్ ఆఫీసర్ డికె జైన్ దాదా(గంగూలి)కి విరుద్ధ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు.

బిసిసిఐ అధ్యక్ష పదవిని చేపట్టడానికి ముందే ఆయన క్యాబ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడని తెలిపారు.2019 అక్టోబర్ 23న బిసిసిఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నందున క్యాబ్ అధ్యక్ష పదవినుంచి తప్పుకొంటున్నట్లు క్యాబ్ కార్యదర్శి అభిషేక్ దాల్మియాకు గంగూలి రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో ఆయనకు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు లేవని జైన్ స్పష్టం చేశారు. బిసిసిఐ రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి కూడా ఒకే సమయంలో ఒకటికంటే ఎక్కువ హోదాల్లో పని చేయడానికి వీలు లేదు. ఈ కారణాల వ్లనే గతంతో సచిన్ తెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, కపిల్ దేవ్‌లపై కూడా విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

Sourav Ganguly Gets Clean Chit From BCCI

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విరుద్ధ ప్రయోజనాల కేసులో గంగూలీకి క్లీన్‌చిట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: