సొరకాయ కూర సో స్వీట్

బుజియా కావల్సినవి: సొరకాయ: అరకిలో, ఉల్లిపాయ: ఒకటి, టొమాటోలు: రెండు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం తురుము : పావుటీ స్పూను, జీలకర్ర: టీస్పూను, పసుపు: పావుటీస్పూను, కారం: టీస్పూను, ధనియాలపొడి: 4టీ స్పూన్లు ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: 2 స్పూన్లు తయారీ విధానం: సొరకాయ తొక్కుతీసి గ్రేటర్‌తో సన్నగా తురమాలి. దీన్ని ప్రెష్‌ర్ కుక్కర్ లో వేసి అరకప్పు నీళ్లు పోసి ఓ విజిల్ రానివ్వాలి. తరవాత సిమ్‌లో రెండు నిమిషాలు ఉంచి, ఆఫ్ చేయాలి. […] The post సొరకాయ కూర సో స్వీట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బుజియా

కావల్సినవి: సొరకాయ: అరకిలో, ఉల్లిపాయ: ఒకటి, టొమాటోలు: రెండు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం తురుము : పావుటీ స్పూను, జీలకర్ర: టీస్పూను, పసుపు: పావుటీస్పూను, కారం: టీస్పూను, ధనియాలపొడి: 4టీ స్పూన్లు ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: 2 స్పూన్లు

తయారీ విధానం: సొరకాయ తొక్కుతీసి గ్రేటర్‌తో సన్నగా తురమాలి. దీన్ని ప్రెష్‌ర్ కుక్కర్ లో వేసి అరకప్పు నీళ్లు పోసి ఓ విజిల్ రానివ్వాలి. తరవాత సిమ్‌లో రెండు నిమిషాలు ఉంచి, ఆఫ్ చేయాలి. ఆవిరి పోయి మూత తీశాక నీళ్లు వంపేసి సొరకాయ తురుము మీద చల్లని నీళ్లు పోసి వంచేయాలి. తరవాత తురుములో నీళ్లు లేకుండా పిండేసి పక్కన ఉంచాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక సన్నని తరిగిన అల్లం వేసి వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిముక్కలు వేసి వేగాక, సిమ్ లో పెట్టి ధనియాలపొడి, కారం, ఉప్పు వేసి కలుపుతూ ఉడికించాలి. ఇప్పు డు పిండేసి ఉంచిన సొరకాయ తురుము వేసి ఓ నిమిషం వేయిం చి చివరగా కొత్తిమీర తురుము చల్లి దించాలి.

ఖీర్

కావాల్సినవి:
సొరకాయ (లేతది): చిన్నది
పంచదార : 150 గ్రా॥, పాలు : ఒకటిన్నర లీటరు, కుంకుమ పువ్వు: అరటీస్పూన్, జీడిపప్పు: ఒక టీస్పూన్,
కిస్‌మిస్: ఒక టీస్పూన్, కోవా :వంద గ్రా॥

తయారీ విధానం: సొరకాయను శుభ్రంగా కడిగి తొక్కతీసి తురమాలి. ఓ బాణలిలో ఈ తురుము వేసి అది మునిగే వరకూ నీళ్లు పోసి మూతపెట్టి మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. తరువాత పాలు పోసి కలపాలి. పాలు చిక్కగా అయ్యేవరకూ ఉడికించాలి. ఇప్పుడు పంచదార, కాసిని పాలల్లో నానబెట్టిన కుంకుమపువ్వు కూడా వేసి కలిపి దించాలి. విడిగా మరో బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్ వేసి వేయించి ఖీర్ కలిపితే వేడి వేడి సొరకాయ ఖీర్ రెడీ అయినట్లే…!

వడియాల కూర

కావాల్సినవి: సొరకాయ ముక్కలు: అరకిలో, జీలకర్ర: టీస్పూను, ఉల్లిపాయ: ఒకటి, టొమాటోలు: రెండు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం తురుము: 2 టీస్పూన్లు, పసుపు: అరటీస్పూను, ఇంగువ: చిటికెడు, కారం:టీస్పూను, గుమ్మడి లేదా మినప వడియాలు : కప్పు, మంచినీళ్లు: కప్పు, ఉప్పు: తగినంత, గరం మసాలా : అరటీస్పూను, కొత్తిమీర తురుము: 3, నూనె: మూడు స్పూన్లు
తయారీ విధానం :
* సొరకాయ తొక్కు తీసి చిన్నముక్కలుగా కోయాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక వడియాలు వేసి వేయించి తీయాలి. తరవాత ఉల్లిముక్కలు వేసి పచ్చిమిర్చి వేసి వేగాక టొమాటో ముక్కలు కూడా వేసి వేయించాలి.
* తరువాత పసుపు, ఇంగువ, కారం వేసి వేగాక సొరకాయ ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు వడియాలు కూడా వేసి ఓ నిమిషం కలిసిన తరువాత నీళ్లు పోసి మరీ మెత్తగా అవకుండా ఉతికించాలి.
* చివరగా గరం మసాలా, కొత్తిమీర తురుము వేసి ఉడికించాలి.

కుర్మా

కావాల్సినవి

సొరకాయ: అరకిలో, జీలకర్ర: అరటీస్పూన్, ఉల్లిపాయ: ఒకటి, అల్లంవెల్లుల్లిముద్ద: టీస్పూన్, టొమాటో: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, కారం:టీస్పూన్, పసుపు: పావుటీస్పూన్, ధనియాల పొడి: టీస్పూన్, గరంమసాలా: అరటీస్పూన్, ఉప్పు:రుచికి సరిపడా, నూనె: 2 టీస్పూన్లు, కొత్తిమీర తురుము: 2 టీస్పూన్లు, మసాలా మిశ్రమం కోసం: తాజా కొబ్బరి తురుము : 3 స్పూన్లు. గసగసాలు: టీస్పూను, జీడిపప్పు:ఆరు

తయారీ విధానం: సొరకాయ తొక్కతీసి ముక్కలు కోయాలి. కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. * బాణలిలో నూనె వేసి జీలకర్ర వేసి వేగాక ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరవాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఓ నిమిషం వేగనివ్వాలి. ఇప్పుడు టొమాటో ముక్క లు కూడా వేసి అవి కాస్త మగ్గిన తరువాత సొరకాయ ముక్కలు ఉప్పు, పసుపు, కారం, ధనియాలపొడి, గరం మసాలా వేసి కలపాలి. తరవా త ఓ కప్పు నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. తరవాత రుబ్బి న కొబ్బరి ముద్ద వేసి బాగా కలిపి సిమ్‌లో ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము వేసి దించాలి.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సొరకాయ కూర సో స్వీట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.