త్వరలో హీరో శింబు పెళ్లి

Hero Simbuచెన్నయ్ : ప్రముఖ తమిళ నటుడు శింబు పెళ్లి వచ్చే ఆగస్టులో జరగనున్నట్టు కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. తొలుత ఆయన లేడీ సూపర్ స్టార్ నయనతారతో ప్రేమాయణం సాగించారు. వీరి ప్రేమ విఫలమైంది. అనంతరం నటి హన్సికను పెళ్లాడనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హన్సిక, శింబుల ప్రేమకు కూడా బ్రేకప్ పడింది. దీంతో శింబు కాసింత నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయన కెరీర్ పై ప్రభావం పడింది. తిరిగి శింబు మళ్లీ కెరీరర్ పై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన తమ్ముడు , సంగీత దర్శకుడు కురళరసన్ కు పెళ్లి జరిగింది. దీంతో ఆయన తల్లిదండ్రులు  ఉష, రాజేందర్  శిబుకు కూడా పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో శింబు తల్లి ఉష తరపు బంధువుల్లో ఓ అమ్మాయిని చూశారని, ఆ అమ్మాయితోనే శింబు పెళ్లి జరగనుందని వార్తలు వస్తున్నాయి. తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు శింబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే శింబు పెళ్లికి సంబంధించి అధికారిక సమాచారం రాలేదు. శింబు పెళ్లి విషయంపై స్పష్టత రాలేదు.

Soon Hero Simbu Married

Related Images:

[See image gallery at manatelangana.news]

The post త్వరలో హీరో శింబు పెళ్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.