నెట్‌వర్క్ 18తో సోనీ కంపెనీ చర్చలు

Mukesh-Ambani

న్యూఢిల్లీ : బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన నెటవర్క్ 18లో వాటాలను కొనుగోలు చేసేందుకు జపాన్‌కు చెందిన సోనీ సంస్థ ఆసక్తి చూపుతోంది. ఈ ఒప్పందం కోసం సోనీ ఒకటి కంటే ఎక్కువ ఎంపికలను పరిశీలిస్తోంది. తన భారతీ య వ్యాపారాన్ని నెట్‌వర్క్ 18లో విలీనం చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. నివేదిక ప్రకారం, రెండు సంస్థల మధ్య చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయి. అయితే ఇంకా ఎలాంటి ఒప్పందానికి రాలేదని సమాచారం. సోనీ నుండి వచ్చిన వార్తల నేపథ్యంలో గురువా రం ట్రేడింగ్‌లో నెట్‌వర్క్ 18 షేర్లు 15 శాతం పెరిగాయి. ఆఖరికి 8 శాతం లాభం తో ముగిశాయి. ఈ సంస్థ యూనిట్ టివి 18 బ్రాడ్‌కాస్ట్ స్టాక్ 1శాతం పెరిగింది. నెట్‌వర్క్ 18తో ఒప్పందం సోనీ సంస్థకు భారత్‌లో వ్యాపారం మరింత విస్తృతం అయ్యేందుకు సహాయపడుతుంది.

ఇది నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రత్యర్థి సంస్థలతో పోటీపడేందుకు దోహదం చేస్తుంది. రిలయన్స్ జియో గత కొన్ని సంవత్సరాలుగా నెట్‌వర్క్ విస్తరణ కోసం సుమారు 50 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇది తన మొబైల్ వినియోగదారులకు స్వదేశీ, విదేశీ కార్యక్రమాలను అందిస్తోంది. దేశంలో మెరుగైన కంటెంట్ కోసం పోటీ పెరుగుతున్న తరుణంలో సోనీ, రిలయన్స్ మధ్య చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దేశంలో 500 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉన్నారు.

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి వీడియో స్ట్రీమింగ్ కంపెనీలు చందాదారులను పెంచడానికి స్థానిక స్థాయి కంటెంట్‌ను అందించడంపై దృష్టి సారించాయి. జియో ప్రస్తుతం పరిమిత కంటెంట్‌ను కలిగి ఉంది. దీంతో సోనీతో ఒప్పందం కలిసివస్తుంది. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా ద్వారా దక్షిణ ఆసియా దేశాలకు సోనీ సేవలు అందిస్తుంది. దీనికి సోనీ ఎంటర్‌టైన్మెంట్ టెలివిజన్ వంటి చానెల్స్ ఉన్నా యి. దీనికి భారతదేశంలో 700 మిలియన్ల ప్రేక్షకులలు ఉన్నారు.

Sony company talks with network 18

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నెట్‌వర్క్ 18తో సోనీ కంపెనీ చర్చలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.