కన్నతల్లిని రోడ్డుపై వదిలేసిన కొడుకులు

అంబర్‌పేట గోల్నాకలో దారుణం ఎంఎల్‌ఎ కాలేరు చొరవతో కథ సుఖాంతం ముషీరాబాద్: నగరంలోని గోల్నాకలో పక్షవాతంతో బాధపడుతున్న కన్నతల్లిని ముగ్గురు కొడుకులు మంగళవారం నడిరోడ్డుపై వదిలేశారు. వివరాల్లోకి వెళితే కమలమ్మ (77)కు ముగ్గురు కొడుకులు. ఆమె పక్షవాతంతో బాధపడుతోంది. కొద్ది రోజుల క్రితం కమలమ్మ భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె కొడుకుల వద్ద ఉంటోంది. భర్త పేరున ఉన్న ఆస్తిని ఇటీవల కొడుకులు రాయించుకున్నారు. తర్వాత ఆమెను పట్టించుకోవడం మానేశారు. అసలే పక్షవాతంతో బాధపడుతున్న కమలమ్మను […] The post కన్నతల్లిని రోడ్డుపై వదిలేసిన కొడుకులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అంబర్‌పేట గోల్నాకలో దారుణం
ఎంఎల్‌ఎ కాలేరు చొరవతో కథ సుఖాంతం

ముషీరాబాద్: నగరంలోని గోల్నాకలో పక్షవాతంతో బాధపడుతున్న కన్నతల్లిని ముగ్గురు కొడుకులు మంగళవారం నడిరోడ్డుపై వదిలేశారు. వివరాల్లోకి వెళితే కమలమ్మ (77)కు ముగ్గురు కొడుకులు. ఆమె పక్షవాతంతో బాధపడుతోంది. కొద్ది రోజుల క్రితం కమలమ్మ భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె కొడుకుల వద్ద ఉంటోంది. భర్త పేరున ఉన్న ఆస్తిని ఇటీవల కొడుకులు రాయించుకున్నారు. తర్వాత ఆమెను పట్టించుకోవడం మానేశారు. అసలే పక్షవాతంతో బాధపడుతున్న కమలమ్మను ముగ్గురు కొడుకులు రోడ్డుపై వదిలేయడంతో అంబర్‌పేట వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చొరవతో పోలీసులు ముగ్గురు కుమారులకు అవగాహన కల్పించి కమలమ్మను ఇంటి పంపారు.

sons who left mother on the road at hyderabad

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post కన్నతల్లిని రోడ్డుపై వదిలేసిన కొడుకులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: