తీహార్ జైలులో శివకుమార్‌ను కలుసుకున్న సోనియా గాంధీ

Sonia-Gandhi

న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న కర్నాటక కాంగ్రెస్ నాయకుడు డికె శివకుమార్‌ను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం కలుసుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న శివకుమార్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. తీహార్ జైలును సోనియా గాంధీని సందర్శించడం ఇది రెండవసారి. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంను కలుసుకునేందుకు ఆమె తీహార్ జైలును సందర్శించారు. కాగా, అక్టోబర్ 21న కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జెడిఎస్ నాయకుడు హెచ్‌డి కుమారస్వామి తీహార్ జైలులో శివకుమార్‌ను కలుసుకున్నారు.

Sonia Gandhi Meets Shivakumar in Tihar Jail, Sonia Gandhi visits Tihar Jail to meet DK Shivakumar, Sonia Gandhi recently visited Tihar Jail to meet P Chidambaram

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తీహార్ జైలులో శివకుమార్‌ను కలుసుకున్న సోనియా గాంధీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.