డోంట్ వర్రీ …కాంగ్రెసుంది

Sonia Gandhi, Manmohan Singh

 

చిదంబరంతో సోనియా, మన్మోహన్ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సోమవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా కలిశారు. ఐఎన్‌ఎక్స్ మీడియా స్కామ్ కేసులో చిదంబరం ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. కాంగ్రెస్ నేతలు మాజీ ఆర్థిక మంత్రి పట్ల సంఘీభావ సూచకంగా ఆయనను పరామర్శించారు. వారి వెంట చిదంబరం కుమారుడు, ఎంపి కార్తీ చిదంబరం కూడా వెళ్లారు. సోనియా, మన్మోహన్ సింగ్‌లు తనను కలియడానికి వచ్చారని, ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, కాంగ్రెస్ పార్టీ బలంగా, ధైర్యంగా ఉన్నంత వరకూ తాను భయపడేది లేదని, ధైర్యంగానే ఉంటానని చిదంబరం ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేతలు చిదంబరాన్ని కలియడానికి అరగంట సమయం ఇచ్చారు. చిదంబరానికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని సోనియా గాంధీ పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక చిదంబరం తనను కలువడానికి వచ్చిన మన్మోహన్‌తో చాలా సేపటి వరకూ కార్పొరేట్ పన్ను తగ్గింపు , జిఎస్‌టి ఉపశమన చర్యలు వంటి అంశాలపై మాట్లాడినట్లు వెల్లడైంది. చిదంబరం ఆరోగ్యం గురించి కూడా ఇరువురు నేతలు ఆరాతీశారు. ఈ నెల 5వ తేదీ నుంచి చిదంబరం జైలులో ఉండాల్సి వచ్చింది.

మోడీ..మీకు అంతా బాగుందా?
హౌడీ మోడీలో ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మాజీ మంత్రి చిదంబరం స్పందించారు. ఇండియా అంతా బాగుందని అంటున్నారు కదా, అవును నిరుద్యోగం, ఉన్న ఉద్యోగాలు ఊడటం, తక్కువ జీతాలు, కూలీలు, మూకదాడులు, కశ్మీర్‌లో కట్టడిలు, దిగ్బంధనాలు , ప్రతిపక్ష నేతలను జైళ్లకు నెట్టడం వంటివి తప్ప అంతా బాగుంది కదా….భారత్ మే సబ్ అచ్చే హై కదా అని మోడీకి చిదంబరం తమ ట్వీట్‌తో చురకలు పెట్టారు.

Sonia Gandhi, Manmohan Singh Meet with Chidambaram

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post డోంట్ వర్రీ …కాంగ్రెసుంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.