ప్రజాస్వామ్యాన్ని రక్షించండి …

ఢిల్లీ : పార్ల‌మెంట్‌లో ఆవరణలోని  గాంధీ విగ్ర‌హం వద్ద యుపిఎ చైర్మన్ సోనియా, రాహుల్‌ గాంధీలు ఆందోళనకు దిగారు. క‌ర్నాట‌క‌, గోవా రాజకీయ సంక్షోభానికి బిజెపియే కారణమని వారు నిరసన వ్యక్తం చేశారు.  క‌ర్నాట‌క‌, గోవా రాష్ట్రాల్లో బిజెపి అప్రజాస్వామిక పద్ధతుల్లో  ప్ర‌భుత్వాల‌ను కూల్చి వేస్తున్న‌ద‌ని వారు ఆరోపించారు. కాంగ్రెసేత‌ర పార్టీల నేతలు కూడా  గాంధీ విగ్ర‌హం ఎదుట ధ‌ర్నా దిగారు. టిఎంసి,ఎస్ పి, ఎన్ సిపి, సిపిఎం తదితర పార్టీల ఎంపిలు ప్లకార్డుల ప్రదర్శిస్తూ నిరసన […] The post ప్రజాస్వామ్యాన్ని రక్షించండి … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ : పార్ల‌మెంట్‌లో ఆవరణలోని  గాంధీ విగ్ర‌హం వద్ద యుపిఎ చైర్మన్ సోనియా, రాహుల్‌ గాంధీలు ఆందోళనకు దిగారు. క‌ర్నాట‌క‌, గోవా రాజకీయ సంక్షోభానికి బిజెపియే కారణమని వారు నిరసన వ్యక్తం చేశారు.  క‌ర్నాట‌క‌, గోవా రాష్ట్రాల్లో బిజెపి అప్రజాస్వామిక పద్ధతుల్లో  ప్ర‌భుత్వాల‌ను కూల్చి వేస్తున్న‌ద‌ని వారు ఆరోపించారు. కాంగ్రెసేత‌ర పార్టీల నేతలు కూడా  గాంధీ విగ్ర‌హం ఎదుట ధ‌ర్నా దిగారు. టిఎంసి,ఎస్ పి, ఎన్ సిపి, సిపిఎం తదితర పార్టీల ఎంపిలు ప్లకార్డుల ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. గోవా అసెంబ్లీ ప‌రిస్థితిపై లోక్ సభలో చ‌ర్చించాలంటూ  కాంగ్రెస్ ఎంపి కొడికున్నిల్ సురేశ్ వాయిదా తీర్మానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బుధ‌వారం బిజెపిలో చేరారు. దీంతో గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్య ఐదుకు పడిపోయింది.

Sonia And Rahul Protest In Parliament Premises

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రజాస్వామ్యాన్ని రక్షించండి … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.