డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు

  వరంగల్ : మద్యం వ్యసనానికి బానిసైన కొడుకు తల్లి వద్ద ఉన్న డబ్బుల కోసం తల్లినే గొంతు నులిమి చంపిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని నక్కలగుట్టలో బుధవారం మిట్టమధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. హన్మకొండ పట్టణంలోని నక్కలగుట్టలో నివాసం ఉంటున్న భాషబోయిన బాలమణి(60) ఆమె కుమారుడు భాషబోయిన రేవంత్ రాజు అలియాస్ రాజు భార్య ఇద్దరు కొడుకులతో ఇంట్లో ఉంటున్నారు. రేవంత్ తల్లీ బాలామణి రైల్వే ఉద్యోగిగా పనిచేస్తుంది. […] The post డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వరంగల్ : మద్యం వ్యసనానికి బానిసైన కొడుకు తల్లి వద్ద ఉన్న డబ్బుల కోసం తల్లినే గొంతు నులిమి చంపిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని నక్కలగుట్టలో బుధవారం మిట్టమధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. హన్మకొండ పట్టణంలోని నక్కలగుట్టలో నివాసం ఉంటున్న భాషబోయిన బాలమణి(60) ఆమె కుమారుడు భాషబోయిన రేవంత్ రాజు అలియాస్ రాజు భార్య ఇద్దరు కొడుకులతో ఇంట్లో ఉంటున్నారు. రేవంత్ తల్లీ బాలామణి రైల్వే ఉద్యోగిగా పనిచేస్తుంది. పనిపాట లేకుండా మద్యం వ్యసనానికి లోనైన రేవంత్ డబ్బుల కోసం కుటుంబ సభ్యులను వేధించడం మొదలు పెట్టాడు.

తల్లి రైల్వే ఉద్యోగి కావడంతో ఆమె వద్ద ఉన్న డబ్బులు కాజేయడానికి కాచుకొని కూర్చున్నారు. బుధవారం మధ్యాహ్నం రాజు భార్య పిల్లలు ఇంట్లో లేని సమయం చూసి తల్లి ఒంటరిగా ఉండడంతో డబ్బుల కోసం గొడవపెట్టాడు. ఆమె ఎంతకు డబ్బులు ఇవ్వకపోవడంతో గొంతునులిమి చంపి డబ్బుతో పరారయ్యాడు. ఈ విషయం ఇరుగుపొరుగు వారు గమనించడంతో బాలామణి చనిపోయినట్లుగా నిర్ధారించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేసి జరిగిన సంఘటనను పరిశీలించారు. అనంతరం నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Son who killed the Mother for Money

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: