మద్యం మత్తులోతల్లిని చంపిన తనయుడు…

Mother

 

ఎడపల్లి : నిజామాబాద్ జిల్లాలో మద్యంతాగిన మత్తులో కన్నతల్లిని చంపిన సంఘటన మంగళ్‌పాడ్ గ్రామంలో చోటుచేసుకుంది. మంగళ్‌పాడ్ గ్రామానికి చెందిన పల్లె గంగాధన్ అనే వ్యక్తి తాగిన మైకంలో తన కన్నతల్లిని కడతేర్చాడని ఎడపల్లి ఎస్సై రా మునాయుడు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రోజు మాదిరిగానే తాగి ఇంటికి వచ్చిన గంగాధర్ తన భార్య కళావతితో గొడవపడ్డాడని కర్రతో కళావతిని కొట్టబోతే అతని తల్లి చిన్నమ్మ అడ్డురావడంతో కళావతి బయటకు వెళ్లిందని, గం గాధర్ కోపంతో తన తల్లి తలపై కర్రతో కొట్టడంతో తల్లి చిన్నమ్మ అక్కడికక్కడే చనిపోయిందని తెలిపారు. గ్రామస్థుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని పో లీసులు వివరాలు సేకరించినట్లు ఎస్సై తెలిపారు. గంగాధర్‌పై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎసిపి రఘు, సిఐ జాకీర్ హుస్సెన్ తదితరులున్నారు.

Son who killed his Mother in Alcohol intoxication

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మద్యం మత్తులోతల్లిని చంపిన తనయుడు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.