కౌలు డబ్బులు అడిగినందుకు తండ్రిని చంపిన కొడుకు…

 Money

 

కరీంనగర్ : తనకున్న భూమిని ఇరువురు కుమారులకు సమానంగా పంచి ఇచ్చి జీవనోపాధి కోసం తన వద్ద పెట్టుకున్న వ్యవసాయ భూమి కౌలు డబ్బులు అడిగినందుకు కన్న కొడుకే తండ్రిని కొట్టిచంపిన సంఘనట చొప్పదండి మండలంలో చోటు చేసుకుంది. చొప్పదండి సిఐ రమేష్ కథనం ప్రకారం మండలంలోని వెదురుగట్ట గ్రామానికి చెందిన గొల్లపల్లి భూమయ్యకు ఇరువరు కుమారులు కాగా, వారిలో పెద్దవాడు గొల్లపల్లి ఆనంద్, రెండవ కుమారుడు గొల్లపల్లి వినోద్.

అయితే జీవితం చివరి దశకు చేరుకుంటున్న భూమయ్య తనకున్న భూమిని ఇరువురు కుమారులకు సమానంగా పంచి ఇచ్చేందుకు నిర్ణయించుకుని గత సంవత్సరం కొందరు పెద్దల సమక్షంలో తనకున్న భూమిని ఇరువురు కుమారులకు సమానంగా పంపిణీ చేశాడు. తన జీవనోపాధి కోసం ఒక ముప్పది గుంటల భూమిని తీసుకోవడం జరిగింది. అయితే వయసు మీద పడుతున్న అతను వ్యవసాయం చేసే పరిస్థితి లేనికారణంగా తన భూమిని కూడా పెద్దకుమారుడైన ఆనంద్‌కే కౌలుకు ఇవ్వడం జరిగింది.

యేడాదికి రూ.15వేల చొప్పుకుని కౌలుకు తీసుకున్న ఆనంద్ కౌలు డబ్బులు చెల్లించని కారణంగా తన భూమిని తనకు అప్పగిస్తే వ్యవసాయం చేసుకుంటానని శనివారం రోజు భూమయ్య తన భూమి వద్దకు వెళ్లి కుమారుడు ఆనంద్‌కు తెలిపాడు. దీంతో ఆవేశానికి లోనైనా ఆనంద్ తనకు కౌలుకు ఇచ్చిన భూమిని మళ్లీ తీసుకుంటావా, కౌలు డబ్బుల కోసం కొంతకాలం వేచిచూడలేవా అంటూ పక్కనే ఉన్నటువంటి గడ్డపారతో తండ్రీ భూమయ్యపై దాడిచేసి కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన భూమయ్యను వైద్యచికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న కరీంనగర్ రూరల్ ఎసిపి టి.ఉషారాణి విశ్వనాథం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూమయ్య మృతదేహానికి పంచనామా నిర్వహించిన తర్వాత పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు చొప్పదండి సిఐ రమేష్ పేర్కొన్నారు.

Son who Killed his Father for asking Money

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కౌలు డబ్బులు అడిగినందుకు తండ్రిని చంపిన కొడుకు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.