తండ్రిని చంపేందుకు వచ్చి …

కరీంనగర్ : తండ్రిని చంపేందుకు వచ్చిన కొడుకు తండ్రి చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శంకరపట్నం మండలం కేశవపట్నం పరిధి పాపయ్యపల్లి జరిగింది.  పాపయ్య పల్లికి చెందిన ఉడిగె రాజు (29), బుచ్చయ్య (70)లు తండ్రీకొడుకులు. రాజుకు రాంచంద్రాపురం గ్రామానికి చెందిన యువతితో 2012లో వివాహం జరిగింది. రాజుకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. రాజు నిత్యం మద్యం సేవించి వచ్చి భార్య, తండ్రిని వేధించేవాడు. దీంతో రాజు భార్య పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటుంది. […] The post తండ్రిని చంపేందుకు వచ్చి … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరీంనగర్ : తండ్రిని చంపేందుకు వచ్చిన కొడుకు తండ్రి చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శంకరపట్నం మండలం కేశవపట్నం పరిధి పాపయ్యపల్లి జరిగింది.  పాపయ్య పల్లికి చెందిన ఉడిగె రాజు (29), బుచ్చయ్య (70)లు తండ్రీకొడుకులు. రాజుకు రాంచంద్రాపురం గ్రామానికి చెందిన యువతితో 2012లో వివాహం జరిగింది. రాజుకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. రాజు నిత్యం మద్యం సేవించి వచ్చి భార్య, తండ్రిని వేధించేవాడు. దీంతో రాజు భార్య పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం తాగొచ్చాడు. తండ్రి బుచ్చయ్యను ఉరేసి చంపాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి బుచ్చయ్య కొడుకు రాజు మెడకు తాడు బిగించి ఉరేసి చంపాడు. బుచ్చయ్య భార్య నర్సవ్వ రాజు భార్యకు సమాచారం ఇవ్వడంతో ఆమె వెంటన అత్తారింటికి వచ్చింది. తన భర్త రాజును మామ బుచ్చయ్య హత్య చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. శవపరీక్ష కోసం రాజు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Son Murder By Father At Karimnagar

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తండ్రిని చంపేందుకు వచ్చి … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.