తండ్రి గొంతుకోసి హత్య చేసిన కొడుకు

  డిచ్‌పల్లి : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ కొడుకు తన తండ్రి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఖిల్లాడిచ్‌పల్లిలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వాహిద్‌ఖాన్(65) చికెన్ సెంటర్‌ను నిర్వహిస్తుండగా, అతడి కొడుకు అప్సర్‌ఖాన్ ఎరువుల దుకాణంలో హమాలీ పని చేస్తున్నాడు. తన మాట వినడం లేదంటూ తండ్రి వాహిద్‌ఖాన్‌పై కొడుకు అప్సర్‌ఖాన్ ఆగ్రహంతో ఉన్నాడు. ఈ క్రమంలోనే నెల […] The post తండ్రి గొంతుకోసి హత్య చేసిన కొడుకు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

డిచ్‌పల్లి : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ కొడుకు తన తండ్రి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఖిల్లాడిచ్‌పల్లిలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.

గ్రామానికి చెందిన వాహిద్‌ఖాన్(65) చికెన్ సెంటర్‌ను నిర్వహిస్తుండగా, అతడి కొడుకు అప్సర్‌ఖాన్ ఎరువుల దుకాణంలో హమాలీ పని చేస్తున్నాడు. తన మాట వినడం లేదంటూ తండ్రి వాహిద్‌ఖాన్‌పై కొడుకు అప్సర్‌ఖాన్ ఆగ్రహంతో ఉన్నాడు. ఈ క్రమంలోనే నెల రోజులుగా వీరి మధ్య గొడవ జరుగుతోంది. దీంతో మంగళవారం వారి మధ్య గొడవ తీవ్రస్థాయిలో జరిగింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అప్సర్‌ఖాన్ తండ్రి వాహిద్‌ఖాన్ గొంతును కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనలో నిందితుడు అప్సర్‌ఖాన్‌ను అరెస్టు చేసి,హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం వాహిద్‌ఖాన్ మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తండ్రి గొంతుకోసి హత్య చేసిన కొడుకు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: