తండ్రిని కడతేర్చిన తనయుడు!

సంగారెడ్డి: డబ్బు ఇవ్వలేదనే కోపంతో కన్న తండ్రినే కడతేర్చాడో కసాయి కొడుకు. ఈ అమానుష సంఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని మీర్‌ఖాన్ పేటలో చోటు చేసుకుంది. గొర్రెలు విక్రయించగా వచ్చిన డబ్బు ఇవ్వడం లేదని కక్ష పెంచుకున్న కుమారుడు తండ్రిని ఉరేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. Comments comments

సంగారెడ్డి: డబ్బు ఇవ్వలేదనే కోపంతో కన్న తండ్రినే కడతేర్చాడో కసాయి కొడుకు. ఈ అమానుష సంఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని మీర్‌ఖాన్ పేటలో చోటు చేసుకుంది. గొర్రెలు విక్రయించగా వచ్చిన డబ్బు ఇవ్వడం లేదని కక్ష పెంచుకున్న కుమారుడు తండ్రిని ఉరేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Comments

comments

Related Stories: